వైసీపీలో ఆ పెద్దోళ్ల జాతకం మారుతుందిగా?

జగన్ వికేంద్రీకరణ మంత్రంతో పదవులు వైసీపీకి అలా కోరకనే వచ్చిపడుతున్నాయి. అదేలగంటే జీఎస్ రావు కమిటీ నివేదికను జగన్ అమలుచేయబోతున్నారు. దీని ప్రకారం ఏపీలో పదమూడు జిల్లాలను [more]

Update: 2020-08-03 15:30 GMT

జగన్ వికేంద్రీకరణ మంత్రంతో పదవులు వైసీపీకి అలా కోరకనే వచ్చిపడుతున్నాయి. అదేలగంటే జీఎస్ రావు కమిటీ నివేదికను జగన్ అమలుచేయబోతున్నారు. దీని ప్రకారం ఏపీలో పదమూడు జిల్లాలను నాలుగు జోన్లుగా విభజిస్తారు. వాటిని పాలించేందుకు ప్రాంతీయ అభివృధ్ధి మండళ్ళను ఏర్పాటు చేస్తారు. వాటిని చైర్మన్లు ఉంటారు. ఆయా జోన్లోలో ప్రగతి పధకాలు అన్నీ కూడా జోన్లు చూస్తాయి. ఇలా అధికారాన్ని మరింత దిగువకు చేరవేయడమే లక్ష్యంగా ఈ బోర్డులు, జోన్లు ఏర్పాటు ఉంటుందిట.

ఆశావహులకు ఛాన్స్….

ప్రాంతీయ బోర్డులకు చైర్మన్లు కావాలి. వారు అధికార పార్టీకి చెందిన వారే ఉంటారు. పైగా క్యాబినెట్ హోదా ఉంటుంది. నిధులు కూడా ప్రత్యేకంగా కేటాయిస్తారు. కాబట్టి ఈ పదవులు మంత్రులకు ఏ మాత్రం తీసిపోవు. రాజకీయంగా స్థానికంగా బలపడాలంటే ఈ పదవులు చాలా బాగా ఉపయోగపడతాయి. అంటే మొత్తానికి నలుగురికి కొత్తగా మంత్రులతో సమానంగా ఈ పదవులు వస్తాయన్నమాట. దాని కోసం మళ్ళీ రేసు, అందులో ఆశావహులు చాలా కధే ఉంది మరి.

సీనియర్లకేనా….?

మరి ప్రాంతీయ అభివృధ్ధి బోర్డులు అంటే చాలా జాగ్రత్తగా ఎంపిక చేయాలి. రాజకీయంగా, సామాజికంగా పట్టున్న వారు కావాలి. అంతే కాదు, స్థానికంగా అక్కడ ఏ సమస్య ఉందో చూడాలి, జోన్లలో ఉన్న సహజసిధ్ధమైన వనరులు, ప్రజల అవసరాలు ఇలా చాలానే అధ్యయం చేయాలి, దాని ప్రకారం బ్లూ ప్రింట్ ని తయారు చేసి ప్రభుత్వానికి ఇవ్వాలి. ఆ మీదట అభివృధ్ధి పనుల విషయంలో నిరంతరం పరిశీలన చేస్తూ సాగాలి. ఉపాధి అవకాశాలు పెంచేలా ప్రతిపాదనలు ఉండాలి, అలాగే అభివృధ్ధికి పెద్ద పీట వేయాలి. ఇవన్నీ చేయాలంటే పెద్ద మనుషులే ఈ పదవుల్లో కూర్చోవాలి. మరి జగన్ ఈ దఫా అయినా సీనియర్లకు అవకాశం ఇస్తారో లేదో చూడాలి.

జిల్లాలతోనూ….

ఇది ఇక్కడితో ఆగేది కాదు, జిల్లాలను కూడా జగన్ విభజించదలచుకున్నారు. కనీసంగా పాతికంగా, గరిష్టంగా ముప్పయి జిల్లాలు వస్తాయి. జిల్లాలకు జిల్లా పరిషత్తులు ఉంటాయి. అలా జిల్లా పరిషత్తు చైర్మన్ పదవులు కూడా వైసీపీలో పెద్ద ఎత్తున రాబోయే రోజుల్లో లభిస్తాయన్నమాట. ఇలా వికేంద్రీకరణ అంటూ జగన్ ఎపుడైతే అడుగులు వేస్తున్నారో, పాలనా సంస్కరణలు చేపడు తున్నారో వరసగా పదవులే పదవులు అన్నట్లుగా వైసీపీలో సీన్ కనిపిస్తోంది. చూడాలి మరి ఆ అదృష్ట జాతకులు ఎవరో.

Tags:    

Similar News