రికార్డ్ లు మీద రికార్డులు బ్రేక్ చేస్తున్న జగన్

కరోనా వచ్చి రాగానే ఏపీ ప్రభుత్వంపై అన్ని అనుమానాలే. రాష్ట్ర ఆర్ధిక స్థితి దివాళా తీసింది. నిధుల కోసం కేంద్రంపై ఆధారపడాలి. జగన్ సర్కార్ కరోనా రక్కసి [more]

Update: 2020-07-10 06:30 GMT

కరోనా వచ్చి రాగానే ఏపీ ప్రభుత్వంపై అన్ని అనుమానాలే. రాష్ట్ర ఆర్ధిక స్థితి దివాళా తీసింది. నిధుల కోసం కేంద్రంపై ఆధారపడాలి. జగన్ సర్కార్ కరోనా రక్కసి కి చిక్కి విలవిల్లాడిపోతోంది అని అంతా అంచనా వేశారు. ఆంధ్రప్రదేశ్ లో వైద్య రంగం అంతా ప్రయివేట్ ఆధారపడింది. ప్రభుత్వ వైద్య రంగం కరోనాను ఎదుర్కోవడం కష్టమే అంటూ పెదవి విరిచారు అంతా.

టెస్టింగ్ టెస్టింగ్ టెస్టింగ్ అన్న చంద్రబాబు …

కరోనాను జగన్ సర్కార్ ఎదుర్కోవాలంటే టెస్టింగ్ టెస్టింగ్ టెస్టింగ్ అంటూ విపక్ష నేత చంద్రబాబు పదేపదే వీడియో సందేశాలను తన అనుకూల మీడియా లో వదిలేవారు. ఎపి సర్కార్ పని తీరు అస్సలు బాగోలేదంటూ విమర్శలు గుప్పించేవారు. పిపిఈ కిట్లపైనా విమర్శల వర్షం కురిసేది. టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్మెంట్ లలో మన రాష్ట్రం వెనుకబడింది అంటూ చంద్రబాబు లాక్ డౌన్ వన్ టూ త్రి లలో దంచేసేవారు.

పట్టుదలగా రంగంలోకి …

ఎపి సర్కార్ కరోనా పై సీరియస్ గానే ఫోకస్ పెట్టింది. విపక్షాల ఆరోపణలను పట్టించుకోకుండా టెస్టింగ్ లపై దేశంలో ఎవ్వరు చేయని కసరత్తు చేసింది. దక్షిణ కొరియా నుంచి అందరికన్నా ముందుగా కిట్ లను తెప్పించింది. అక్కడి నుంచి వెనక్కి చూడకుండా కేసులు పెరుగుదల అవుతున్నా పరీక్షలు చేయడం యజ్ఞంగా పెట్టుకుంది. దాంతో ఇప్పటికి 10 లక్షల కు పైగా టెస్ట్ లు పూర్తి చేసి దేశంలో ఢిల్లీ తరువాత రెండవ స్థానానికి చేరుకుంది.

తక్కువ కేసులు ఉన్నా …

వాస్తవానికి మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు లు అత్యధిక కేసులు నమోదు అవుతూ కలవరపరుస్తున్నాయి. ఇక్కడ టెస్ట్ లు అత్యధికంగా చేయాలిసి ఉంది. దాని వల్ల ఆ రాష్ట్రాలు పరీక్షలు ఎక్కువ చేస్తున్నాయి. తెలంగాణ సర్కార్ కి అయితే జగన్ సర్కార్ చేస్తున్న లక్షల టెస్ట్ లు తలపోటు గా మారింది. ఇప్పుడు వేలకేసులు అక్కడ పెరుగుతుండటం హై కోర్టు, కేంద్ర ప్రభుత్వం సైతం టి ప్రభుత్వాన్ని తప్పుపట్టడం తో గులాబీ సర్కార్ కి గుబులు పట్టుకుంది. అయితే ఏపీ పాజిటివ్ కేసుల వివరాలతో సంబంధం లేకుండా దూసుకుపోతూ ప్రజారోగ్యంపై ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకంగా నిలిచింది.

ఒక పక్క అంబులెన్స్ లు , మరోపక్క వైద్య కళాశాలలు …

దీనికి తోడు 1088 అంబులెన్స్ లను 13 జిలాల్లో కొత్తగా ప్రవేశపెట్టి యుద్ధానికి సిద్ధం అయ్యింది. మరోపక్క అన్ని జిల్లాల్లో ఎన్ని వేలకేసులు వచ్చినా ట్రీట్ మెంట్ చేసేందుకు సన్నాహకాలు పూర్తి చేసింది. దశాబ్ద కాలంగా పడకేసిన ప్రభుత్వ వైద్యాలయాలను దారికి తెచ్చే ప్రయత్నంతో పాటు వైద్య కళాశాలలను పార్లమెంటరి నియోజకవర్గ స్థాయిలో ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

డిఫెన్స్ లో టిడిపి …

జగన్ సర్కార్ ఇంతవేగంగా ఇన్ని అడుగులు వేస్తుందని ఊహించని టిడిపి షాక్ కావడమే కాదు కిట్ ల నుంచి అంబులెన్స్ ల వరకు అంతా అవినీతి మాయం అంటూ విమర్శలు, ఆరోపణలు మొదలు పెట్టింది. దీనిపై పాజిటివ్ గా స్పందించేందుకు ప్రధాన విపక్షానికి నోట మాట రాకపోయినా మరో విపక్షం జనసేన మాత్రం శభాష్ జగన్ అనేసింది. ఇదే వైసిపి సర్కార్ ఎపి వైద్య రంగంలో తిరుగులేకుండా వెళుతుంది అనడానికి తార్కాణం అంటున్నారు విశ్లేషకులు. ప్రజలకు అత్యంత వ్యయభారమైన వైద్యం, విద్యలను అందరి చెంతకు చేరేందుకు వైఎస్ జగన్ నిధుల లేమి వున్నా దృష్టి పెట్టడమే ఇప్పుడు అందరి ని ఆకట్టుకుంటుంది.

Tags:    

Similar News