జగన్ ది ట్రెడిషన్ పాలిటిక్స్ కాదు.. అంతా?

సాధారణంగా రాజకీయాలు ప్రపంచవ్యాప్తంగా ఒకేలా ఉంటాయి. గెలిచిన పార్టీ విపక్షాన్ని ఏదో చేస్తామని పళ్ళు కొరికి మరీ పవర్ లోకి వస్తుంది. అవినీతి పని పడతామని, అవతల [more]

Update: 2020-06-17 02:00 GMT

సాధారణంగా రాజకీయాలు ప్రపంచవ్యాప్తంగా ఒకేలా ఉంటాయి. గెలిచిన పార్టీ విపక్షాన్ని ఏదో చేస్తామని పళ్ళు కొరికి మరీ పవర్ లోకి వస్తుంది. అవినీతి పని పడతామని, అవతల వారి జేబుల్లోంచి కక్కిస్తామని కూడా గట్టి వాగ్దానాలు కూడా చేస్తుంది. తీరా ఒకసారి అధికారంలోకి వచ్చాక అదంతా మరచిపోతారు. రాజకీయ నాయకులు మాటలకే తప్ప చేతలకు సిధ్ధం కారు. పైగా ఒకరి తప్పులను మరొకరు కప్పిపుచ్చుతారు. ఎందుకంటే రేపు పొరపాటున మళ్ళీ ఓడి ఆ విపక్షం అధికారంలోకి వస్తే తమకు కూడా రక్షణ కావాలన్న ముందు చూపుతో, రాజకీయ తెలివిడితో. జనం కూడా ఇలాంటి రాజకీయాన్నే ఇప్పటిదాకా చూస్తూ వచ్చారు. నడిరోడ్డు మీద విపక్ష నేతలను నడిపించి జైళ్లకు పంపడం సినిమాల్లోనే సాగుతుది తప్ప ఒరిజినల్ గా చూస్తే వారంతా ఒక్కటేనని జనానికి గట్టి నమ్మకం.

తుడిచేస్తారా…?

జగన్ పదేళ్ల రాజకీయమే ఒక సంచలనం. ఆయన తండ్రి చాటు బిడ్డగా కడప ఎంపీగా పోటీ చేసి గెలిచారు. ఆ అనుభవం మూడు నెలలు మాత్రమే. వైఎస్సార్ గతించాక మాత్రం జగన్ ది అలుపెరగని పోరాటమే. ఆయనదంతా కొత్త పోకడే. వర్తమాన రాజకీయాలు భిన్నమే. జనంలోనే ఏదైనా తేల్చుకోవడం, జనంతోనే మాట్లాడుతూ వారి గొంతుకగా ఉండడమే జగన్ రాజకీయం. అందుకే ఆయన ట్రెడిషనల్ పాలిటిక్స్ ని తుడిచిపెట్టేస్తున్నారు. తర, తమ భేదం లేకుండా ఆయన సాధార‌ణ జనం ఏది కోరుకుంటున్నారో అదే చేస్తూ వస్తున్నారు.

మొహమాటాల్లేవు…

జగన్ సీఎం అయ్యాక ఒక్కసారి కూడా విపక్ష నేత చంద్రబాబుతో భేటీ వేయలేదు. ఆయనతో ముచ్చట పెట్టలేదు. బాబుతో ఎటువంటి మొహమాటాలు ఉండకూడదని జగన్ పక్కాగా ఫిక్స్ అయ్యారు. ఇది నిజంగా అసాధారణమైన విషయమే. రాజకీయ నాయకులు అసెంబ్లీలో బయటా ఎన్నో అనుకుంటారు, తిట్టుకుంటారు కూడా. కానీ ఎదురుపడితే పలకరించుకుంటారు. కుశల ప్రశ్నలు వేసుకుంటారు. కానీ ఏపీలో ఆ సంప్రదాయం అసలు లేదు. దానికి బాబు ఆజ్యం పోస్తే జగన్ పూర్తిగా కొనసాగిస్తున్నారు. అందుకే ఆయన తెగే దాకా లాగుతున్నారు. చంద్రబాబుతో పేచీయే తప్ప రాజీ లేదంటున్నారు. గత సర్కార్ అవినీతిని లాగి పారేసి జనంలో దోషిగా బాబును నిలబెట్టాలనుకుంటున్నారు.

భయం లేదుగా….?

సాధారణంగా రాజకీయ నాయకులకు మళ్ళీ అధికారంలోకి రావేమోనని భయం ఉంటుంది. ఇంతలా చేస్తున్నాం, రేపటి రోజున పొరపాటున లెక్కలు తప్పి అవతల పార్టీ అధికారంలోకి వస్తే మన గతేం కానూ అన్న చింత అసలు లేదు. అందుకే జేసీ దివాకరరెడ్డి చెప్పినట్లుగా జగన్ ఎవరికీ భయపడే ప్రసక్తేలేదు. ఆయన తలచుకుంటే ఎవరికైనా అరెస్టులు తప్పవు. జగన్ టార్గెట్ టీడీపీ. అందుకే గతంలో ఎన్నడూ చూడని ఘటనలుఏపీలో జరుగుతున్నాయి. లేకపోతే జేసీ సోదరుల్లో ఒకరు జైలుకు ఇంత సులువుగా వెళ్తారని ఎవరైనా కలలో కూడా అనుకున్నారా. గత సర్కార్ అవినీతి అంటూ ఒక మాజీ మంత్రిని కటకటాల పాలు చేయడం కూడా అరుదైన ఘటనే. ఇది అంతం కాదు ఆరంభం అంటోంది వైసీపీ, అలాగే జరుగుతుందని జేసీ కూడా జోస్యం చెబుతున్నారు. మనసులో చంద్రబాబుకు ఆ సందేహాలు నిండుగా ఉన్నాయి. ఎందుకంటే జగన్ ట్రెడిషనల్ పాలిటిక్స్ చేయడంలేదు. ఆయనకు తప్పు అని తోస్తే యాక్షన్ లోకి దిగిపోవడమే. ఇదిపుడు జాతీయ స్థాయిలోనూ చర్చగా ఉన్న అంశంగా ఉంది. ఎందుకంటే అక్కడ ఉన్నది జగన్.

Tags:    

Similar News