ఏడాదిలోనే ఇంత మార్పా..? జగన్ వైపు వచ్చేస్తాయా?

వైసీపీలో అసంతృప్తి మెల్లగా మొదలై ఏడాది తిరిగేసరికి తారస్థాయికి చేరుకుంటున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. సీనియర్ నాయకులు పదవీ వియోగాన్ని తట్టుకోలేకపోతున్నారు. అలాగని మనసులో ఎక్కడా దాచుకోవడంలేదు. ఎందుకంటే [more]

Update: 2020-06-08 05:00 GMT

వైసీపీలో అసంతృప్తి మెల్లగా మొదలై ఏడాది తిరిగేసరికి తారస్థాయికి చేరుకుంటున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. సీనియర్ నాయకులు పదవీ వియోగాన్ని తట్టుకోలేకపోతున్నారు. అలాగని మనసులో ఎక్కడా దాచుకోవడంలేదు. ఎందుకంటే వీరంతా తన రాజకీయ జీవితాలు మొత్తం కాంగ్రెస్ పార్టీకే అంకితం చేసారు. ఇపుడు వైసీపీ లాంటి ప్రాంతీయ పార్టీలో, జగన్ లాంటి ఏక నాయకుడి ఆద్వర్యంలో పనిచేస్తున్నా కూడా పాత వాసనలు పోవడంలేదు. దాంతో ఒక్కసారిగా గొంతులు లేస్తున్నాయి. అవి మెల్లగా సాగుతూ అధినేత జగన్ వైపుగా రావడానికి అట్టే సమయం పట్టకపోవచ్చునని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఆనం అలా….

సీనియర్ మోస్ట్ నాయకుడిగా ఉన్న మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఉమ్మడి ఏపీలో కీలక మంత్రిత్వ శాఖకు నిర్వహించారు. ఆయన మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి నాయకత్వంలో ఆర్థిక మంత్రిగా కూడా పనిచేశారు. అటువంటి ఆనం ఇపుడు వట్టి ఎమ్మెల్యేగా ఉండిపోవడం అంటే నామోషీగా ఫీల్ అవుతున్నారు. పైగా ఆయన కంటే జూనియర్లు మంత్రులుగా జిల్లాలో చక్రం తిప్పడంతో ఈ నెల్లూరు పెద్దాయన ఏమీ కాకుండా పోవడంతో కుమిలిపోతున్నారు. దాంతో ఆయన తన అసంత్రుప్తిని బయటకు తీశారు. ముందుగా అధికారులతో మొదలుపెట్టి ఆ మీదట మంత్రుల దాకా వచ్చేసిన ఆనం ఇక ముఖ్యమంత్రి జగన్ మీదకే బాణాలు ఎక్కుపెట్టాల్సిఉందిపుడు.

ధర్మాగ్రహమేనా…?

ఇక శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు సైతం మంత్రి పదవికి తాను అర్హుడిని కాదా అని ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఆయన సమయం దొరికినపుడల్లా సొంత పార్టీ మీదనే విమర్శలు చేస్తున్నారు. ఈ ప్రభుత్వంలో ఇంత నిర్లక్ష్యమా… ఇదేనా మన పాలన అంటూ తరచూ మీడియాకు ఎక్కుతున్నారు. తాజాగా ఆయన ఆరోగ్య మంత్రి ఆళ్ళ నాని జిల్లా సమీక్షకు వస్తే ఆయన ముందే వైద్య ఆరోగ్య శాఖ అవినీతిమయం అయిపోయిందంటూ ఘాటుగా కామెంట్స్ చేశారు. లంచం ఇస్తేనే తప్ప పనులు జరగడం లేదంటే ఇది మన ప్రభుత్వమేనా అని నిలదీశారు. శానిటైజేషన్ కాట్రాక్టులకు ముంబై నుంచి కాంట్రాక్టర్లకు ఇవ్వడమేంటి అని గద్దించారు. ఇందులో కొన్ని వాస్తవాలు ఉన్నా అలా మంత్రి ముఖం మీద అధికార పార్టీ ఎమ్మెల్యే కామెంట్స్ చేయడంతో పార్టీతో పాటు సర్కార్ పరువు టోటల్ గా గంగలో కలిసింది.

కుమ్ములాటలే….

విజయనగరం జిల్లాలో ఏకంగా ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి మీద ఆమె సొంత మామ, మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత శత్రుచర్ల చంద్రశేఖరరాజు తాజాగా హాట్ కామెంట్స్ చేశారు. ఏడాది కాలంలో కురుపాం లో అభివ్రుధ్ధి ఊసే లేదని గాలి తీసేశారు. గతంలో వైఎస్సార్ సర్కార్ బెటర్, జగన్ పాలనలో పేదలకు న్యాయం జరగడంలేదని డైరెక్ట్ అటాక్ చేశారు. ఇవన్నీ కూడా పార్టీలో పెరుగుతున్న అసమ్మతులు, అసంత్రుప్తులే. వీటిని జగన్ ఎలా డీల్ చేస్తారో తెలియదు కానీ శ్రుతి మించి రాగాన పడితే మాత్రం కొంప కొల్లేరే అంటున్నారు పార్టీ హితైషులు.

Tags:    

Similar News