ఆ రెండూ అడగొద్దంటున్న జగన్.. రీజన్ ఏంటంటే?

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెండు అంశాలపై సీరియస్ గా ఉన్నారు. ఒకటి మద్య నిషేధం, రెండు ఇసుక అక్రమ తవ్వకాలు. ఈ రెండింటిపై ముఖ్యమత్రి జగన్ [more]

Update: 2020-05-27 06:30 GMT

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెండు అంశాలపై సీరియస్ గా ఉన్నారు. ఒకటి మద్య నిషేధం, రెండు ఇసుక అక్రమ తవ్వకాలు. ఈ రెండింటిపై ముఖ్యమత్రి జగన్ కఠిన నిర్ణయాలు కూడా తీసుకుంటున్నారు. ఈ రెండింటిని అదుపు చేసేందుకు ప్రత్యేకంగా ఒక విభాగాన్ని ఏర్పాటు చేవారు. స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో ను ఏర్పాటు చేసి అందులో 70 శాతం ఎక్సైజ్ సిబ్బందిని కూడా నియమించారు. ఎస్ఈబీ విధివిధానాలను కూడా రూపొందించారు.

ఎస్ఈబీని ఏర్పాటు చేసి…..

ఎస్ఈబీ సిబ్బంది పూర్తిగా మద్య నియంత్రణకు, అక్రమ ఇసుక తవ్వకాలపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. మద్యం సంగతి తీసుకుంటే ఏపీలో మద్యాన్ని నియంత్రించేందుకు వాటి ధరలను విపరీతంగా పెంచారు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం ధరలు వంద శాతం పెరిగాయి. అయినా ఇతర రాష్ట్రాల నుంచి మద్యం రాష్ట్రంలోకి వస్తూనే ఉంది. పొరుగు రాష్ట్రాల్లో మద్యం ధరలు తక్కువగా ఉండటంతో తెలంగాణ, కర్ణాటక, చెన్నై నుంచి మద్యాన్ని ఏపీలోకి తరలించడం ఎక్కువయిపోయింది.

మద్య నియంత్రణకు….

ీదీంతో ఎస్ఈబీ అధికారులు దీనిపైనే దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం రాష్ట్ర సరిహద్దుల వద్ద ప్రత్యేక చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. ఈ చెక్ పోస్టులు వద్ద ప్రత్యేకంగా సిబ్బదిని నియమించారు. ఇక ఇసుక తవ్వకాలపై కూడా జగన్ ప్రత్యక ఆదేశాలు జారీ చేశారు. అక్రమ ఇసుక తవ్వకాలను ఎట్టి పరిస్థితుల్లో ప్రోత్సహించవద్దని ఇప్పటికే జగన్ పార్టీ నేతలకు సంకేతాలిచ్చారు. ఇటీవల ఇసుక తవ్వకాల విషయంలో ముగ్గురు ఎమ్మెల్యేలకు జగన్ క్లాస్ కూడా పీకినట్లు వార్తలు వచ్చాయి.

ఇసుక తవ్వకాలపై….

అంతేకాకుండా స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బోర్డు విషయంలో తాను జోక్యం చేసుకునేది లేదని కూడా జగన్ స్పష్టం చేశారు. అందులోని అధికారులు, సిబ్బంది బదిలీల్లో కూడా రాజకీయ జోక్యం ఉండకూడదని జగన్ ఆదేశించారు. ఉన్నతాధికారులకే పూర్తి పగ్గాలు అప్పగించారు. దీంతో వైసీపీ ఎమ్మెల్యేల గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లయింది. సీనియర్ నేతలు కూడా ఈ విషయంలో జగన్ ను ఒప్పించలేక పోతున్నారు. ఈ రెండు విషయాల్లో ఎవరూ జోక్యం చేసుకోవద్దని సీఎంవో ద్వారా ఎమ్మెల్యేలు, మంత్రులకు కూడా చెప్పించినట్లు తెలిసింది. మొత్తం మీద జగన్ సంక్షేమ పథకాల తర్వాత ఈ రెండు అంశాలను ప్రాధాన్యతగా తీసుకున్నారు.

Tags:    

Similar News