జగన్ కి ఝలక్ ఇచ్చేటట్లే ఉన్నారే?

జగన్ అనుకుంటే సాధిస్తారు. అది ఆయన తత్వం. కానీ రాజ్యంగబద్ధ పదవిలో ఉన్న తరువాత ఒక పని జరగాలంటే దానికి చాలా కధ ఉంటుంది. పై నుంచి [more]

Update: 2020-05-23 13:30 GMT

జగన్ అనుకుంటే సాధిస్తారు. అది ఆయన తత్వం. కానీ రాజ్యంగబద్ధ పదవిలో ఉన్న తరువాత ఒక పని జరగాలంటే దానికి చాలా కధ ఉంటుంది. పై నుంచి కిందదాకా ఎందరో ఉంటారు. ఎక్కడ కొర్రీ పడినా మొత్తం తిరకాసు అవుతుంది. ఇపుడు జగన్ కి అలాంటి చేదు అనుభవమే ఎదురుకాబోతోందా? అంటే అవును అనే అంటున్నారు. జగన్ కి శాసనమండలి అంటే ఇష్టంలేదు. ఎందుకంటే అక్కడ జూనియర్ చంద్రబాబు ఉన్నారు. నారా లోకేష్ పదవీ కాలం 2025 వరకూ ఉంది. ఆయన్ని అక్కడ పెట్టుకుని మండలికి వెళ్ళడానికి మనసు ఒప్పకనే జగన్ ముఖ్యమంత్రిగా ఒకే ఒకసారి మండలికి వెళ్ళి నమస్కారం పెట్టేశారు. మరో వైపు చూసుకుంటే మండలిలో యనమల రామకృష్ణుడు ఉన్నారు. ఆయన పదవీ కాలం 2023 వరకూ ఉంది. దాంతో జగన్ మండలికి రాం రాం అనేశారు.

తేల్చలేదుగా…..

జగన్ ఎంతో హడావుడిగా మండలి రద్దు కావాలని డిసైడ్ అయినా, మండలి విషయంలో ప్రత్యేక అసెంబ్లీ సమావేశం పెట్టి మరీ ఒక్క దెబ్బకు రద్దు అనేశారు. ఆ తరువాత కధ కేంద్రం వద్దకు వెళ్ళింది. అయితే కేంద్రం మండలి రద్దు బిల్లు విషయంలో ఇప్పటిదాకా ఏమీ తేల్చలేదు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలన్నీ అల్లరిగానే సాగాయి. ఈ లోగా కరోనా వైరస్ పేరిట లాక్ డౌన్ ప్రవేశ పెట్టారు. ఈ పరిణామాల నేపధ్యం నుంచి చూసుకున్నపుడు జూలై నుంచి ప్రారంభం అయ్యే పార్లమెంట్ సమావేశాల్లో అయినా మండలి రద్దు బిల్లు వస్తుందా అంటే అనుమానమేనని అంటున్నారు.

న్యాయశాఖ వద్దే….

ఇప్పటికీ మండలి బిల్లు న్యాయ శాఖ వద్దనే ఉందని బీజేపీ నేతలు చెబుతున్నారు.ఏపీ మండలి రద్దు బిల్లుని ఏం చేయాలన్న దాని మీద అక్కడ ఇంకా ఏ నిర్ణయమూ తీసుకోలేదని అంటున్నారు. దీనికి కారణం కూడా ఉంది. బీజేపీ ఏం చేసినా జాతీయ విధానం అంటుంది. అంటే ఒక రాష్ట్రంలో ఒకలా, మరో రాష్ట్రంలో ఇంకోలా ఉండడానికి వీలులేదని కూడా ఆ పార్టీ ఆలోచనట. మండలి అన్న వ్యవస్థ ఏపీతో కలుపుకుంటే దేశంలో ఆరు చోట్ల ఉన్నాయని అంటున్నారు. ఇక 2012 నుంచి చూసుకుంటే రద్దు చేసిన చోట మళ్ళీ శాసన‌మండలి కావాలని కొన్ని రాష్ట్రాలు కోరుకుంటున్నాయి. దాంతో మండలి విషయంలో ఏకమొత్తంగా దేశస్థాయిలో ఒక విధానం ఉండాలని కేంద్రం భావిస్తోందిట.

స్టాండింగ్ కమిటీకే….

ఇక మండలి రద్దు బిల్లుని స్టాండింగ్ కమిటీకి పంపాలని కూడా కేంద్ర పెద్దలు సూత్రప్రాయంగా ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా చెబుతున్నారు. దేశంలో మండలుల తీరు, అవి పని చేస్తే ఎలా ఉంటుంది. వాటి ఆవశ్యకత ఉందా. అవి ఉండాలి అంటే ఎలాంటి నిబంధనలు పొందుపరచాలి. ఒకవేళ అవి వద్దు అనుకున్నా, ఉండాలని అనుకున్నా కూడా ఆ అధికారం రాష్ట్రాల చేతుల్లో ఉంచకుండా కేంద్రం వద్దకే పెట్టుకోవాలని కూడా ఆలోచన ఉందని అంటున్నారు. స్టాండింగ్ కమిటీ కనుక సిఫార్సు చేసి మండలి తప్పనిసరిగా ఉండాలి, దాన్ని రద్దు చేసే అధికారం రాష్ట్రాలకు ఇవ్వకూడదు అంటే మాత్రం జగన్ కి గట్టి ఝలక్ తప్పదని అంటున్నారు. ఇవన్నీ ఎలా ఉన్నా కూడా మండలిని స్టాండింగ్ కమిటీకి పంపించాలనుకుంటే అదే వైసీపీకి పెద్ద దెబ్బ అని కూడా అంటున్నారు. జగన్ అనుకున్నట్లుగా మండలి రద్దు కాకపోతే స్టాండింగ్ కమిటీ నిర్ణయం వచ్చేలోగా పుణ్యకాలం కూడా గడుస్తుంది అంటున్నారు. చూడాలి మరి ఏ జరుగుతుందో.

Tags:    

Similar News