జగన్ యధార్ధ వాది

మనకో సామెత ఉంది. యధార్ధ వాది లోక విరోధి అని. జగన్ విషయం చూస్తే అదే నిజం కూడా. అయితే ఇంటి యజమాని అన్నీ నిజాలు చెబితే [more]

Update: 2020-04-29 02:00 GMT

మనకో సామెత ఉంది. యధార్ధ వాది లోక విరోధి అని. జగన్ విషయం చూస్తే అదే నిజం కూడా. అయితే ఇంటి యజమాని అన్నీ నిజాలు చెబితే ఇబ్బందులు తప్పవు. కొన్ని దాచాల్సినవి ఉంటాయి. దాన్నే లౌక్యం అంటారు. జగన్ కి మొదటి నుంచి ఇది తక్కువే. ఆ మాటకు వస్తే ఆయన తండ్రి వైఎస్సార్ కూడా ఉన్నది ఉన్నట్లు మాట్లాడేవారు. అయితే ఆయన కొంత రాజకీయం తెలిసినవారు. జగన్ మాత్రం తనదైన శిక్షణలో రాజకీయ నేతగా ఎదిగారు కాబట్టి ఆయన ఏది చెప్పినా నోటి వెంట అలా బయటకు వచ్చేస్తుంది. దాని వల్ల తక్షణ ఇబ్బందులు వస్తాయి. కొన్ని సార్లు ఆయన చెప్పేయడమే మంచిది అనిపిస్తుంది కూడా. ఇప్యుడు కరోనా విషయంలో కూడా జగన్ పచ్చి నిజం ఒకటి అలా చెప్పేశారు.

తప్పని ముచ్చట…..

ఇపుడు జగన్ చెప్పినది వింటే మొదట భయం వేస్తుంది ఎవరికైనా, కానీ ఇక ముందు జీవితం ఇదేనని వైద్య నిపుణులు కూడా చెబుతున్నారు. కరోనాకు మందు లేదు, చేయాల్సింది అంతా స్వీయ రక్షణ. దానికి లాక్ డౌన్ పేరు చెప్పి ఎంతకాలం ఇంట్లో ఉంచుతారు. అది కష్టం కూడా బతుకు బండి కదలాలంటే కూర్చుంటే కాదుగా. అందుకే జగన్ యాధార్ధమైన మాట చెప్పారు. కరోనాకు మందు లేదు. అందువల్ల దానితోనే సహజీవనం చేయాలని, బయటకు వెళ్ళినపుడు కచ్చితంగా జాగ్రత్తలు పాటించాలని కూడా సూచించారు. అదే అందరినీ కాపాడుతుందని కూడా చెప్పేశారు. ఇది తుఫాన్ కాదు, భూకంపం లాంటిది కానే కాదు, అందువల్ల గడువులు, అంతాలు అసలు ఉండవు, ఇదే జగన్ చెప్పినది.

వాక్సిన్ ఒక ఊహ…..

ఈ దేశంలో కొన్ని వ్యాధులకు ఇప్పటికీ మందు లేదు. క్యాన్సర్, ఎయిడ్స్, కొన్ని రకాల ఫ్లూలకు కూడా మందులు లేవు. ఇక కరోనా వైరస్ విషయంలోనూ ఇప్పటికైతే అంతా పరిశోధనా దశలోనే ఉంది. వాక్సిన్ వస్తుందని భ్రమలు పడడం తప్ప నిజమెంతో ఎవరికీ తెలియదు. ఎందుకంటే కరోనా వైరస్ చైనాలో పుట్టాక ఇప్పటికి తన లక్షణాలను 2,500 వరకూ మార్చుకున్న బహు రూపాల మహమ్మారి. అది ఒక్కో మనిషి శరీరంలో ఒక్కోలా తన ప్రతాపం చూపిస్తోంది. కొందరిని ఓడిస్తోంది, కొన్ని చోట్ల తాను ఓడుతోంది. ఇక కామన్ పాయింట్ ఏంటి అంటే రోగ నిరోధక శక్తి ఉంటే ఇది ప్రమాదం కాదు. అలాగే తగిన జాగ్రత్తలు తీసుకుని జీవితాన్ని మళ్ళీ మొదటి నుంచి ప్రారంభించాలి. కరోనాతో మరణశయ్య మీద ఉన్న ఇటలీలో కూడా ఇపుడు జనం రోడ్ల మీదకు వస్తున్నారు. అక్కడ కూడా తగిన అవగాహనతో బతకాలనుకుంటున్నారు అదే జగన్ చెప్పారు.

రేపటి రోజున….

ఇక ఈ సత్యం జగన్ ఒక్కడికే తెలియదు, దేశంలోని ముఖ్యమంత్రులకు, కేంద్ర పెద్దలకు కూడా తెలుసు. కరోనాను ఎప్పటికీ జీరోను చేయలేమని కూడా తెలుసు. అయినా కూడా రాజకీయం కోసం కొందరు ముఖ్యమంత్రులు డెడ్ లైన్లు పెడుతూ కరోనా అంతం ఆ రోజుతో అంటున్నారు. దాన్ని వల్ల జనాలకు ఈ రోజు బాగున్నా రేపటి రోజుల అసలు నిజాలు తెలిస్తే ఇబ్బంది పడతారు. దాన్ని ముందే చెప్పేసి జగన్ ఇప్పటికైతే లోక విరోధి అయ్యరు. ఆయన మొదట్లో చెప్పిన పారసైట్ మాలే ఇప్పటికీ కరోనా రోగులకు చికిత్సగా ఇస్తున్నారు. అలాగే బ్లీచింగ్ పౌడర్ కూడా చల్లుతున్నారు. అయితే ఉన్నది చెబితే రాజకీయం అనిపించుకోదు, అందుకే విపక్షాలు రంకెలు వేస్తున్నాయి. కానీ జనాలకు తగిన చైతన్యం కలిగించి బయటకు తీసుకురాకపోతే కరోనా చావుల కంటే ఆకలి చావులు పెరుగుతాయి.

Tags:    

Similar News