మూడేళ్లు మాత్రమే….మెరుపులు ఇక ఎలా?

కరోనా వైరస్ ఇపుడు అధికార పార్టీలకు పెను సవాల్ అయి కూర్చుంది. దీనికి నివారణ లేదు. నియంత్రణ ఒక్కటే మార్గం. దాంతో తలుపులు అన్నీ మూసుకు కూర్చోవాలి. [more]

Update: 2020-04-11 05:00 GMT

కరోనా వైరస్ ఇపుడు అధికార పార్టీలకు పెను సవాల్ అయి కూర్చుంది. దీనికి నివారణ లేదు. నియంత్రణ ఒక్కటే మార్గం. దాంతో తలుపులు అన్నీ మూసుకు కూర్చోవాలి. ఒక్క మాటలో చెప్పాలంటే ఎటువంటి వ్యాపకాలూ లేకుండా అన్నీ బంద్ చేసుకోవాలి. అది బాగానే ఉంది కానీ అన్నీ మూసేస్తే పాలనా రధం కదిలేదెలా. కరెన్సీ కరకరలాడేదెలా. ఇది ఇపుడు దేశంలో ముఖ్యమంత్రులకు, ప్రధాని మోడీకి పెను సమస్యగా మారింది. పులి మీద స్వారీగా కరోనా వైరస్ తో పోరు ఉంది. దాని మీద కూర్చున్నా ముప్పే. దిగినా తప్పే. కరోనా వైరస్ ని కట్టడి చేయకపోతే ఫెయిల్యూర్ పాలకులు అవుతారు. కట్టడి చేస్తే ఆర్ధికంగా అతి పెద్ద దెబ్బ పడిపోతుంది. ఎలా చూసుకున్నా ప్రభువులకు గడ్డుకాలమేనని చెప్పాలి.

ఏపీకే గట్టి దెబ్బ….

మూలిగే నక్క మీద తాడిపండు మాదిరిగా ఏపీని కోరోనా వైరస్ గట్టి దెబ్బ తీసేలా ఉంది. కరోనా వైరస్ కోసం ప్రత్యేకంగా నిధులు ఖర్చు చేయాలి. అదే సమయంలో ఉన్న నిధులను వదులుకోవాలి. అంటే చేతికి రూపాయి ఆదాయం రాదు తగులుకుంటే మాత్రం ఎక్కువగానే ఖర్చు ఉంది. ఈ క్రమంలో జగన్ కి రానున్న కాలమంతా ఇబ్బందిగానే ఉందని అంటున్నారు. తొలి ఏడాది జగన్ అనుకున్నట్లుగా జరిగినా మిగిలిన నాలుగేళ్ళూ సవాళ్ళకు జవాబు చెప్పుకుంటూనే సాగాల్సిఉంది. ఆర్ధిక వనరులు ఏ విధంగానూ లేని ఏపీకి ఏదో చేయాలన్న జగన్ తాపత్రయానికి కరోనా వైరస్ అలా వచ్చి కాటేసిపోయింది.

మూడేళ్ళే……

చివరి ఏడాది ఎన్నికల కోసం వదిలేసినా జగన్ కి మిగిలింది అచ్చంగా మూడేళ్ళ సమయమే. కరోనా వైరస్ మరో మూడు నెలల్లో పూర్తిగా అదుపులో వచ్చినా దాని ప్రభావం ఆర్ధికంగా ఇతరాత్రా కచ్చితంగా ఒకటి రెండేళ్ళ పాటు ఉంటుందని ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు. అంటే రానున్న కాలమంతా పడుతూ లేస్తూనే ఏపీ సాగాలన్నమాట. మరో వైపు ఇది యూనివర్శల్ సమస్య కాబట్టి కొత్త పరిశ్రమలు అసలు వస్తాయన్నది పెద్ద డౌట్. ఉన్నవి కూడా ఎన్ని నిలబడతాయో తెలియదు. దాంతో కొత్త ఆదాయాలకు, ఉపాధికి కూడా అవకాశాలు ఉండవు. ఇంకో వైపు అసలే ఆర్ధిక మాద్యంతో ఉన్న దేశానికి కరోనా కొట్టిన దెబ్బతో అది పదింతలు అయి కూర్చుంటుంది. నిరుద్యోగం, పేదరికం, ఆకలి చావులు ఇలా అన్ని రకాలుగా కూడా ఏపీకి విపత్కరమైన పరిస్థితులే ఎదురవుతాయని అంటున్నారు.

ఏమీ చేయకుండానే ..?

ఒక్క మాటలో చెప్పాలంటనే జగన్ ఏమీ చేయకుండానే 2024 ఎన్నికలకు ప్రజల ముందు వెళ్ళాల్సివస్తుందన్న చర్చ వైసీపీతో పాటు రాజకీయ నిపుణులలో కూడా వస్తోంది. ఏపీకి జీవనాడి లాంటి పోలవరానికి అర లక్ష నిధులు కేంద్రం ఈ పరిస్థితుల్లో ఇస్తుందా అన్నది కూడా అతి పెద్ద సందేహం. ఇక మూడు రాజధానుల కధ కూడా ఎక్కడి గొంగలి అక్కడే అన్నట్లుగా ఉండే సీన్ కనిపిస్తోంది. మరో వైపు టైర్ టూ సిటీలను ఏపీలో అభివ్రుధ్ధి చేయలనుకుంటున్న జగన్ సర్కార్ ఆలోచనలు కూడా అంత తొందరగా నెరవేరే అవకాశాలు కనిపించడంలేదు. ఇవన్నీ పక్కన పెడితే జగన్ తాను చెప్పినట్లుగా నవరత్నాల హామీలను రానున్న నాలుగేళ్ళూ సవ్యంగా కొనసాగించగలరా అన్నది అతి పెద్ద డౌట్ గా ఉంది. మొత్తం మీద జగన్ పాలనలో కూడా తేడా ఏమీ లేదని, మరింతగా తమ బతుకులు దుర్బరం అయ్యాయని అంచనాకు జనం వచ్చేలా 2024 నాటికి పరిస్థితులు ఉంటే కనుక వచ్చే ఎన్నికల్లో జగన్ అతి పెద్ద ముప్పే ఎదుర్కోవాల్సివస్తుంది మరి.

Tags:    

Similar News