ఏక మొత్తంగా జగన్ ముహూర్తం పెట్టేశారట

జగన్ రాజకీయంగా ఆరితేరిపోయారు. ఆయన ఒక పధ్ధతి ప్రకారం ఏపీ రాజకీయాలను మొత్తం తన గుప్పిట్లోకి తీసుకుంటున్నారు. బలమైన నాయకుడు, సీనియర్ నేత చంద్రబాబు రాజకీయాన్ని చరమాంకానికి [more]

Update: 2020-03-16 02:00 GMT

జగన్ రాజకీయంగా ఆరితేరిపోయారు. ఆయన ఒక పధ్ధతి ప్రకారం ఏపీ రాజకీయాలను మొత్తం తన గుప్పిట్లోకి తీసుకుంటున్నారు. బలమైన నాయకుడు, సీనియర్ నేత చంద్రబాబు రాజకీయాన్ని చరమాంకానికి తీసుకురావడమే జగన్ ప్రస్తుత టార్గెట్. అంతే కాదు, మిగిలిన పార్టీలు సైతం లేవకుండా గట్టి దెబ్బ కొట్టాలన్నది కూడా జగన్ ఎత్తుగడ. తన టార్గెట్లను 2020 వెళ్ళేలోపే పూర్తి చేయడానికి జగన్ మాస్టర్ ప్లాన్ వేశారు. అందుకే లోకల్ బాడీ ఎన్నికలను ఆలస్యం చేయకుండా ఒకేసారి పెట్టేస్తున్నారు. అక్కడ కూడా బంపర్ మెజారిటీని సాధించి తనకు తిరుగులేదనిపించుకోవడమే ఇపుడు మిగిలివుంది.

కేంద్రంలోకి…..

లోకల్ బాడీ ఎన్నికల తరువాత ఏకంగా కేంద్రంలోకి బీజేపీలో వైసీపీ చేరిపోతుందని అంటున్నారు. కనీసంగా మూడు మంత్రి పదవులు వైసీపీ బేరం ఆడుతోందిట. రెండు క్యాబినెట్. ఒక సహాయ మంత్రి పదవులు వైసీపీ కోటాలో తీసుకుంటారని సమాచారం. విజయసాయిరెడ్డితో పాటు, అయోధ్య రామిరెడ్డిలకు మంత్రి పదవులు ఇప్పించడమే కాకుండా కాపు సామాజికవర్గానికి మరో కీలకమైన మంత్రి పదవిని తీసుకోవాలని జగన్ భావిస్తున్నారు. ఆ విధంగా డైరెక్ట్ గా మోడీ, షాలతోనే కనెక్షన్ పెట్టుకుని ఏపీలో నాలుగేళ్ళ పాటు తనదైన శైలిలో పాలన చేయడానికి జగన్ అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారుట.

విపక్షానికి చెక్….

అటు చంద్రబాబు, ఇటు పవన్ కళ్యాణ్ కి ఒకే దెబ్బకు చెక్ పెట్టడానికే జగన్ మోడీ కూటమిలో చేరుతున్నారని అంటున్నారు. అంటే భవిష్యత్తులో ఈ రెండు పార్టీలకు ఎక్కడ నుంచి కూడా ప్రాణ వాయువు అందకుండా చేసి క్షీణింపచేయడమే జగన్ టార్గెట్ గా ఉందని అంటున్నారు. ఎపుడైతే జగన్ మోడీ కొలువులో మంత్రులను తీసుకుంటారో నాడే పవన్ బయటకు రాకతప్పదు. మిగిలిన నాలుగేళ్ళూ ఆయన పార్టీని నడపలేక ఇబ్బంది పడడం కూడా ఖాయమని, ఇక లోకల్ బాడీ ఎన్నికల తరువాత టీడీపీని పూర్తిగా ఉనికి లోకుండా చేసే పక్కా ప్లాన్ కూడా జగన్ వద్ద ఉందని అంటున్నారు. మొత్తానికి మొత్తం ఎమ్మెల్యేలను టీడీపీ నుంచి జగన్ లాగేసుకోవడం ద్వారా బాబుని రాజకీయంగా గట్టి దెబ్బ తీసేలా భారీ స్కెచ్ గీశారని అంటున్నారు.

నోరెత్తడానికి లేదుగా…..

రానున్న నాలుగేళ్ళలో ఏపీలో ఎటువంటి ఎన్నికలూ ఉండవు. అందువల్ల పాలన మీద, అభివృధ్ధి మీద దృష్టిపెట్టడానికి జగన్ కి ఎంతో సమయం ఉంటుంది. అదే సమయంలో బీజేపీతో కలవడాన్ని ఎవరైనా వ్యతిరేకించినా జగన్ తనదైన శైలిలో నచ్చచెబుతారు. అది సొంత పార్టీలో అయితే బీజేపీ వల్ల నష్టం ఏమీ లేదని చెప్పి ఒప్పిస్తారు. ఒకవేళ కాదూ కూడదు అని ఎవరైనా అనుకున్నా మాట్లాడేందుకు ఇప్పటిలా వీలుండదు, ఎందుకంటే లోకల్ బాడీ ఎన్నికల తరువాత, కేంద్రంలో మంత్రులు చేరాక జగన్ అత్యంత బలవంతుడు అవుతారని విశ్లేషణలు ఉన్నాయి. ఆ బలంతో రాజకీయ ప్రత్యర్ధులను కట్టడి చేయడమే కాకుండా 2024 నాటికి ఏపీ రాజకీయ మైదానాన్ని పూర్తిగా తనకు అనుకూలంగా ఖాళీ చేసుకోవడానికి జగన్ పక్కా ప్లాన్ తో ముందుకు సాగుతున్నారని అంటున్నారు. మొత్తానికి జగన్ స్కెచ్ వేస్తే ఎలా ఉంటుందో ఫ్యూచర్లో తెలుస్తుంది.

Tags:    

Similar News