మూడు దిక్కుల్లోనూ లేకుండా?

జగన్ తీసుకుంటున్న నిర్ణయం తెలుగుదేశం పార్టీ నేతలను ఆర్థికంగా దెబ్బతీయనుంది. రాజధాని అమరావతిలో కేవలం అసెంబ్లీ, సచివాలయం మాత్రమే ఉంటే రోజు వారీ యాక్టివిటీ ఉండదు. శాసనసభ [more]

Update: 2019-12-17 14:30 GMT

జగన్ తీసుకుంటున్న నిర్ణయం తెలుగుదేశం పార్టీ నేతలను ఆర్థికంగా దెబ్బతీయనుంది. రాజధాని అమరావతిలో కేవలం అసెంబ్లీ, సచివాలయం మాత్రమే ఉంటే రోజు వారీ యాక్టివిటీ ఉండదు. శాసనసభ సమావేశాలు జరిగే పదిరోజులు మాత్రమే అమరావతిలో యాక్టివిటీ ఉంటుంది. అసెంబ్లీ, శాసనసభ సమావేశాలను పెద్దగా నిర్మించకపోయినా పరవాలేదు. తాత్కాలిక భవనాలనే వినియోగించుకోవచ్చు. దీనివల్ల అమరావతి ప్రాంతంలో భూముల ధరలు బాగా తగ్గే వీలుంది. కొనేవారు కూడా ఉండరు.

టీడీపీని ఆర్థికంగా దెబ్బతీసేందుకు…..

రాజధాని ప్రాంతంలో తెలుగుదేశం పార్టీకి చెందిన అనేక మంది నేతలు భూములు కొనుగోలు చేశారు. ఒక్కొక్కరూ వందల ఎకరాలు కొనుగోలు చేసి తమ పట్టును రాజధాని ప్రాంతంలో నిలుపుకునేందుకు ప్రయత్నించారు. ఇప్పుడు కేవలం అసెంబ్లీ, శాసనమండలి మాత్రమే ఉంటే ఇక్కడ పురుగు సంచారం ఉండదు. సచివాలయాన్ని విశాఖపట్నంకు తరలించడం వెనక కూడా పెద్ద ఆలోచనలోనే జగన్ ఉన్నట్లు తెలుస్తోంది.

బ్రాండ్ ఇమేజ్ కూడా….

టీడీపీ నేతలను ఆర్థికంగా దెబ్బకొట్టేందుకే జగన్ మూడు రాజధానుల ప్రస్తావన తెచ్చినట్లు తెలుస్తోంది. ముందుగా దీనిపై ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్ ను కూడా తీసుకోనున్నారు. ఇప్పటికే మద్యం షాపులను కుదించి టీడీపీ నేతలను ఆర్థికంగా దెబ్బ తీసిన జగన్ రాజధానిపై సంచలన నిర్ణయం తీసుకుని టీడీపీ నేతలను దారుణంగా దెబ్బతీశారు. ఇక అమరావతిని నిర్మిస్తే చంద్రబాబు బ్రాండ్ ఉంటుంది. అదే అలా వదిలేస్తే చంద్రబాబు బ్రాండ్ ను చెరిపేయవచ్చన్నది కూడా జగన్ ఆలోచన.

విపక్షాన్ని దెబ్బతీసేందుకే…..

ఇప్పుడు జగన్ తీసుకోబోతున్న నిర్ణయంపై ప్రజల నుంచి పెద్దగా వ్యతిరేకత రాకపోవచ్చు. తమ ప్రాంతాలు అభివద్ధి చెందుతున్నాయంటే అందరూ స్వాగతిస్తారు. విపక్షం కూడా జగన్ నిర్ణయాన్ని సీరియస్ గా విభేదించకపోవచ్చు. ముఖ్యంగా మూడు దిక్కుల్లో టీడీపీకి దిక్కులేకుండా చేయాలన్నది జగన్ ప్లాన్ గా తెలుస్తోంది. కర్నూలులో హైకోర్టు, విశాఖలో సచివాలయం ఏర్పాటు చేస్తే ఆ ప్రాంతాల్లో కొద్దోగొప్పో బలంగా ఉన్న టీడీపీని ఖతం చేయడానికే జగన్ మూడు రాజధానుల ప్రతిపాదనను తెరపైకి తీసుకువచ్చినట్లు చెబుతున్నారు. మొత్తం మీద జగన్ సంచలన ప్రకటన చేసి టీడీపీకి నిద్ర లేకుండా చేసినట్లయింది.

Tags:    

Similar News