వన్ సైడ్ గా సౌండ్ లేదే?

వైఎస్ జగన్ చిన్న వయసులోనే ముఖ్యమంత్రి అయ్యారు. వయసు చిన్నది కావడంతో ఆయన కొంత అసహనానికి, తొందరపాటుకు గురవుతారని అందరూ భావించారు. పైగా తొమ్మిదేళ్ల తర్వాత అధికారం [more]

Update: 2019-12-18 13:30 GMT

వైఎస్ జగన్ చిన్న వయసులోనే ముఖ్యమంత్రి అయ్యారు. వయసు చిన్నది కావడంతో ఆయన కొంత అసహనానికి, తొందరపాటుకు గురవుతారని అందరూ భావించారు. పైగా తొమ్మిదేళ్ల తర్వాత అధికారం రావడంతో జగన్ వన్ సైడ్ గా సౌండ్ చేస్తారని భావించారు. కానీ జగన్ ముఖ్యమంత్రి అయి ఆరు నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకూ జగన్ తొందరపడలేదు. మాట జారలేదు. బేల తనం చూపించలేదు. ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే….?

కట్టుబట్టలతో వచ్చానంటూ….

గతంలో అధికారంలో ఉన్న చంద్రబాబు ఐదేళ్ల పాటు ఒకే మాట అనే వారు. “కట్టుబట్టలతో వచ్చాను. బస్సులో పడుకున్నా. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగాలేదు. కేంద్రం సాయం కూడా అరకొరమాత్రమే.” అంటూ ప్రతి సభలో ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేసేవారు. ఉద్యోగుల జీతాలు చెల్లించడానికి కూడా నిధులు లేవని టీడీపీ నేతలు పదే పదే చెప్పేవారు. రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలంటే మరికొంత సమయం పడుతుందని తరచూ అనేవారు.

తీవ్రమైన కష్టాల్లో ఉన్నా…..

నిజానికి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత తీవ్రంగా నష్టపోయింది. హైదాబాద్ లాంటి ఆదాయాన్ని ఇచ్చే నగరాన్ని వదులుకుని రావడంతో బాగా గండిపడింది. మరో వైపు కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వకపోగా, ఇస్తానన్న ప్రత్యేక ప్యాకేజీ కూడా ఇవ్వకపోవడం, ఆదాయం లేక ఖర్చులు పెరిగి పోవడంతో ఏపీ ఖజానా కుదేలైపోయింది. దీంతో చంద్రబాబు అప్పులు తెచ్చి మరీ రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు ప్రయత్నించారు. కేంద్ర ప్రభుత్వంతో దాదాపు నాలుగేళ్ల పాటు సయోధ్యతతో ఉన్నప్పటికీ అనుకున్న రీతిలో నిధులు ఏపీకి విడుదల కాలేదు. అందుకే చంద్రబాబు పదే పదే నిధుల కొరతపై మాట్లాడేవారు.

పెదవి దాటకుండా….

కానీ జగన్ ముఖ్యమంత్రి అయి ఆరు నెలలు కావస్తోంది. నిధుల కొరత అలాగే ఉంది. జగన్ రోజుకో పథకం లాంచ్ చేస్తున్నారు. కొత్త పథకాలకు శ్రీకారం చుడుతున్నారు. ఆర్థిక భారమైన పథకాలను ఏమాత్రం వెరవకుండా ప్రకటిస్తూనే ఉన్నారు. ఆరోగ్య శ్రీ, ఫీజు రీఎంబర్స్ మెంట్, అన్ని వర్గాలపై వరాలు వెరసీ ఆర్థిక భారాన్ని పెంచేవే. కానీ జగన్ ఇప్పటి వరకూ ఎక్కడా నిధులు కొరత ఉందని మాట్లాడలేదు. కేంద్రం నుంచి సాయం అందడం లేదని నిందలు వేయడం లేదు. అలాగని సంక్షేమ పథకాలను నిలిపివేయడంలేదు. జగన్ కు, చంద్రబాబుకు అదే తేడా అని వైసీపీ నేతలు చెబుతుండటం విశేషం.

Tags:    

Similar News