ఇంతకీ జగన్ కి ఇచ్చే సలహా ఏంటి అంటే… ?

సలహా. ఇది ఎదుటివారికి ఇచ్చే తేలికైన మాటగా వాడుకలో చెప్పుకుంటారు. తాను పాటించని వాటిని కూడా ఇతరుల మీదకు రుద్దే వారు మంచి సలహాదారులు అవుతారు. ఇవన్నీ [more]

Update: 2021-07-25 06:30 GMT

సలహా. ఇది ఎదుటివారికి ఇచ్చే తేలికైన మాటగా వాడుకలో చెప్పుకుంటారు. తాను పాటించని వాటిని కూడా ఇతరుల మీదకు రుద్దే వారు మంచి సలహాదారులు అవుతారు. ఇవన్నీ ఇలా ఉంటే అసలు జగన్ వంటి నాయకుడు సలహాలు వినే స్వభావేనా అన్నది ఒక డౌట్. మొత్తానికి ఏపీలో సలహాదారులు ఒకరిద్దరు కాదు, ఏకంగా 45 మంది సలహాదారులు ఉన్నారు. వారంతా కలసి ఇచ్చిన సలహాలతోనేనా ప్రభుత్వం ఇన్ని అప్పులు చేసిందా అన్న విమర్శలు అయితే విపక్షాల నుంచి వస్తున్నాయి.

అసలు అవసరమా…?

సలహాదారులే జగన్ ప్రభుత్వంలో ఎక్కువ మంది ఉన్నారు. మంత్రులు పాతిక మంది ఉంటే వారికి రెట్టింపు సలహాదారులు ఉన్నారు. మరో వైపు ఏపీలో నలబై మంది దాకా ప్రిన్సిపుల్ సెక్రటరీస్ ఉంటారు, వీరితో పాటుగా ఐఏఎస్ అదిధికారులు, ఐపీఎస్ లు కూడా ఉంటారు. మరి ఇంత మంది ఉంటుండంగా సలహాదారులు అవసరమా అన్న ప్రశ్న అయితే సహజంగా ఎవరికైనా వస్తుంది. నిజానికి ఏపీ పరిస్థితి ఎలా ఉంది, ఆదాయం లేదు, అప్పులు తప్ప మరేమీ లేవు. అలాంటి చోట ఇంతమంది సలహాదారులు లక్షలలో జీతాలు, అధికార వైభోగాలు వంటివి ఉండాలా అన్నది కూడా చర్చగా ఉంది.

చెడ్డ పేరు తప్ప….

మంది ఎక్కువ అయితే మజ్జిక పలుచన అంటారు. అలాగే తెలివైన వారు ఎక్కువ మంది ఉంటే సరైన నిర్ణయాన్ని ఎవరూ తీసుకోనీయరు అన్న మాట కూడా ఉంది. ఇపుడు జగన్ సర్కార్ లో అదే జరుగుతోందా అన్నదే సందేహం. నిజానికి సలహాదారుల వ్యవస్థ అన్నదే ఒక దండుగమారిదని కూడా చెప్పాలేమో. వారికి అధికారాలు తప్ప బాధ్యతలు ఉండవు, వారు సలహాలు ఇచ్చినా తీసుకుంటారో లేదో ఎవరికీ తెలియదు, ఇది వట్టి అలంకారప్రాయం పదవులు. వీటిని ఆశ్రితులు, అయిన వాళ్ళకు ఇచ్చుకోవడం తప్ప మరేమీ దీని వల్ల ఉపయోగం లేదు. పైగా వారి వల్ల సర్కార్ కి దుబారా ఖర్చుతో పాటు ఇంతమందిని వేసుకున్నందుకు చెడ్డ పేరు రావడం ఖాయం.

ఇకనైనా మేలుకుని….

జగన్ ఎవరి మాటా వినరు అని అంటారు. ఇది ఎంతవరకూ నిజమో తెలియదు కానీ జగన్ మాట వినాలనుకున్నా, సలహాలు తీసుకోవాలనుకున్నా సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి ఒకరిద్దరిని ఉంచుకుంటే సరిపోతుందేమో. ఇక వారిని కూడా మంత్రులను మించి హైలెట్ చేయడం కూడా మంచిది కాదు, ఏపీలో తెస్తున్న ప్రతీ రూపాయి అప్పు, అంతే కాదు వాటి వడ్డీలు కూడా పాతికేళ్ళు గడచినా కడుతూనే ఉండాలి, ఈ విషయాన్ని గమనంలో ఉంచుకుని ఎంత వీలైతే అంతగా ఖర్చు తగ్గించుకుంటే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. ఈ విషయంలో జగన్ మరో మారు ఎవరూ వేలెత్తి చూపించకుండా మేలుకుంటే మంచిదని హితైషులు అంటున్నారు.

Tags:    

Similar News