మెరుపులు మెరిపిస్తారా?

ఏపీ సీఎం జ‌గ‌న్ త‌న‌దైన శైలిలో పాల‌న‌లో మెరుపులు మెరిపిస్తున్నారు. సంక్షేమం నుంచి అభివృద్ధి కార్యక్రమాల వ‌ర‌కు కూడా జ‌గ‌న్ దూకుడు ప్రద‌ర్శిస్తున్నారు. ఈ క్రమంలో గ‌తానికి [more]

Update: 2019-12-09 14:30 GMT

ఏపీ సీఎం జ‌గ‌న్ త‌న‌దైన శైలిలో పాల‌న‌లో మెరుపులు మెరిపిస్తున్నారు. సంక్షేమం నుంచి అభివృద్ధి కార్యక్రమాల వ‌ర‌కు కూడా జ‌గ‌న్ దూకుడు ప్రద‌ర్శిస్తున్నారు. ఈ క్రమంలో గ‌తానికి భిన్నంగా ఆయ‌న వ్యవ‌హ‌రిస్తున్నార‌నే వ్యాఖ్యలు త‌ర‌చుగా వినిపిస్తున్నాయి. పాల‌న ప్రారంభించిన తొలి రెండు వారాల్లోనే ప‌లువురు మంత్రుల నుంచి కొన్ని కీల‌క సందేహాలు తెర‌మీదికి వ‌చ్చాయి. ప్రస్తుతం ప్రభుత్వ అనుబంధం శాఖ‌ల్లో టీడీపీ ప్రభుత్వం నియ‌మించిన ఆ పార్టీ సానుభూతి ప‌రులు ఔట్‌సోర్సింగ్ ప‌ద్ధతిలో ప‌నులు చేస్తున్నార‌ని, వీరిని ప‌క్కన పెట్టి మ‌న వారికి అవ‌కాశం ఇవ్వాల‌ని డిప్యూటీ సీఎంగా ఉన్న ఓ మ‌హిళా నాయ‌కురాలు చెప్పుకొచ్చారు.

పార్టీలకతీతంగా…

అయితే, దీనికి జ‌గ‌న్ వెంట‌నే అడ్డు చెప్పారు. వారు స్వత‌హాగా ఉద్యోగులు. త‌ర్వాతే వారు ఏ పార్టీకి చెందిన వారు.. అనే విష‌యాన్ని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాలి. మ‌న విధానాలు న‌చ్చితే.. మ‌న‌కే జై కొడ‌తారు. అంటూ.. ఆ ఉద్యోగుల‌ను తొల‌గించేది లేదన్నారు. అంతేకాదు, పార్టీల‌కు, జెండాల‌కు, అజెండాల‌కు అతీతంగా ప్రభుత్వంలోని ప్రతి ఒక్కరూ ప‌నిచేయాల‌ని సూచించారు. ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న ప్రతి సంక్షేమ కార్యక్రమం పార్టీల‌కు అతీతంగా ప్రతి ఒక్క అర్హులకు చేరాల‌ని కూడా జ‌గ‌న్ నిర్దేశించారు. ఇప్పుడు ఇదే త‌ర‌హాలో గ‌తంలో ఏ సీఎం కూడా చేయ‌ని విధంగా జ‌గ‌న్ సంచ‌ల‌న నిర్ణయం తీసుకుని అమ‌లు చేసేందుకురెడీ అయ్యారు.

ఎమ్మెల్యేలకు వరాలు…..

తొలి అసెంబ్లీ స‌మావేశంలో జగన్ చెప్పిన విధంగానే పార్టీల‌తో సంబంధం లేకుండా రాష్ట్రంలోని ప్రతి నియోజ‌క‌వ‌ర్గానికి కోటి రూపాయ‌ల అభివృద్ది నిధులు అందిస్తామ‌న్న ప్రతిపాద‌న‌ను కార్య రూపంలోకి తెచ్చేందుకు సిద్ధమ‌య్యారు. రేప‌టి నుంచి ఏపీ అసెంబ్లీ శీతాకాల స‌మావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలోనే రాష్ట్రంలో అధికార‌, ప్రతిప‌క్ష ఎమ్మెల్యేల‌కు జ‌గ‌న్ తీపి క‌బురు అందించ‌నున్నారు. ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో అభివృద్ధి ప‌నుల నిమిత్తం ఏటా కోటి రూపాయ‌లు ఇచ్చే కార్యక్రమానికి ఆయ‌న శ్రీకారం చుట్టనున్నారు. ఈ నిధులు అన్ని పార్టీల ఎమ్మెల్యేల‌కు స‌మానంగా ఇవ్వడంతోపాటు పార‌ద‌ర్శక‌త‌కు కూడా పెద్దపీట వేయాల‌ని నిర్ణయించారు.

విపక్ష సభ్యులకూ….

అదేస‌మ‌యంలో ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో పెండింగ్‌లో ఉన్న కీల‌క ప్రాజెక్టుల విష‌యంపై కూడా జ‌గ‌న్ దృష్టి పెట్టనున్నారు. ఈ విష‌యాన్ని కూడా అసెంబ్లీ స‌మావేశాల్లో ప్రక‌టించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. నిజానికి అనుభ‌వ‌జ్ఞుడైన సీఎంగా పేరున్న చంద్రబాబు గ‌డిచిన ఐదేళ్లలో ప్రతిప‌క్ష నాయ‌కులు గెలిచిన నియోజ‌క‌వ‌ర్గాల‌కు నిధులు ఇవ్వక‌పోగా.. ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో ని టీడీపీ ఇంచార్జుల ఖాతాలో అభివృద్ధి నిధులు జ‌మ చేసి, వైసీపీ నేత‌ల‌ను డ‌మ్మీలుగా చూపించే ప్రయత్నం చేయ‌డం తెలిసిందే. కానీ, ఇప్పుడు జ‌గ‌న్ చేస్తున్న ప్రయ‌త్నం ప్రజాస్వామ్య వాదుల‌ను అచ్చెరువొందిస్తోంది.

Tags:    

Similar News