జగన్ సామాజిక న్యాయం కత్తిమీద సామేగా … ?

సామాజిక వర్గాల సమతూకం పాటించడం రాజకీయపార్టీలకు కత్తిమీద సాము వంటి పరిణామమే. ముఖ్యంగా కులాల నడుమ సమతూకం పాటిస్తూ ముందుకు సాగడం మరీ కష్టమైన పనే. ఈ [more]

Update: 2021-07-22 05:00 GMT

సామాజిక వర్గాల సమతూకం పాటించడం రాజకీయపార్టీలకు కత్తిమీద సాము వంటి పరిణామమే. ముఖ్యంగా కులాల నడుమ సమతూకం పాటిస్తూ ముందుకు సాగడం మరీ కష్టమైన పనే. ఈ అంశంలోనే తెలుగుదేశం పార్టీ లెక్కలు తప్పి ఘోరంగా దెబ్బతింది. గతంలో సామాజిక న్యాయం పేరుతో మెగాస్టార్ చిరంజీవి సైతం పార్టీ పెట్టి 294 స్థానాల్లో బిసిలకు 100 సీట్లు కేటాయించి కూడా తన వ్యూహాన్ని విజయవంతం చేసుకోలేకపోయారు. కాపులను బిసిల్లోకి చేరుస్తామంటూ ఓట్ల కోసం టిడిపి చేసిన ఫీట్లు ఫలించలేదు. ఫలితంగా గత ఎన్నికల్లో మొత్తం పార్టీ చతికిలపడింది. నమ్ముకున్న సామాజికవర్గం జనసేన వెంట వెళ్ళిపోతే పార్టీకి వెన్నెముకగా ఉన్న బిసి లు వైసీపీ కి జై కొట్టేశారు.

నాడు ఆ స్లోగన్ వర్క్…

పార్టీ పదవులనుంచి అధికార పదవుల వరకు అన్ని కమ్మ సామాజికవర్గానికే అంటూ తరచూ వైసీపీ లెక్కలతో మీడియా ముందు పెడుతూ నాడు అధికారపార్టీని గట్టిగా ఇరకాటంలో పెట్టేది. ఈ అంశం ప్రజల్లో బాగా ప్రచారం కావడం, విజయవంతంగా వైసీపీ ఈ ఆపరేషన్ ను సక్సెస్ చేయగలిగింది. ఇప్పుడు అధికారంలోకి వైసీపీ ఉంది. ఆ పార్టీ మంత్రి పదవుల నుంచి ఉప ముఖ్యమంత్రుల వరకు సామాజిక న్యాయం సూత్రం పాటిస్తూ వస్తుంది. రాజ్యసభ సీట్ల భర్తీలో, ఎమ్యెల్సీ సీట్ల ఎంపికలో సైతం జగన్ మార్క్ పాలిటిక్స్ సోషల్ ఇంజనీరింగ్ ప్రత్యర్థులను షాక్ కు గురిచేశాయి. తాజాగా నామినేటెడ్ పదవుల భర్తీ అంశంలోనూ జగన్ సర్కార్ ఆచితూచి అడుగులు వేసింది. ఇందులో 50 శాతం పదవులను ఎస్సి, ఎస్టీ బిసి, మైనారిటీలకు కేటాయించడం ఇచ్చిన పదవుల్లో 50 శాతం మహిళలకు ఇవ్వడం సాహసోపేతమైన చర్యనే. అయితే ఇక్కడే టిడిపి రెడ్డి సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసింది. ఇచ్చిన పదవుల్లో 26 మంది రెడ్లే ఉన్నారని వీరికి ప్రాధాన్యత కలిగినవి కట్టబెట్టి మిగిలినవారికి డమ్మీ పోస్ట్ లు ఇచ్చారంటూ అల్లరి మొదలు పెట్టింది.

తిప్పికొడతారా ?

గతంలో క్యాబినెట్ విషయంలో చాలామంది అర్హులైన రెడ్లు ఉన్నప్పటికి సామాజిక న్యాయం కోసం జగన్ కొందరిని పక్కన పెట్టేశారు. ఆళ్ళ రామకృష్ణ రెడ్డి, ఆర్కే రోజా, లతో సహా ఎక్కువమందే వైసీపీ తొలి క్యాబినెట్ బెర్త్ దక్కించుకోలేకపోయారు. అయితే రోజా వత్తిడితో ఏపిఐఐసి ఛైర్మెన్ గిరి ఇచ్చినా అనేకమంది ఇంకా వెయిటింగ్ లిస్ట్ లోనే ఉన్నారు. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతం లో రెడ్ల సామాజికవర్గం అత్యధికం. ఈ నేపథ్యంలో జగన్ తప్పనిసరిగా తన పార్టీతో తనతో నడిచిన వారికి న్యాయం చేయక తప్పదు. అయితే కోస్తా, ఉత్తరాంధ్ర లో సైతం రెడ్లకు కొన్ని పదవులు ఇవ్వడం వారి సమర్ధత రీత్యా ఇచ్చినా విమర్శకులకు జగన్ ఆస్కారం కల్పించినట్లే అయ్యింది. దాంతో టిడిపి దీన్నే ఆయుధంగా మలుచుకుని వైసీపీ సామాజిక పదవుల పందేరం పలుచన చేయాలని శక్తివంచన లేకుండా తన పార్టీ అనుకూల మీడియా ల ద్వారా ప్రచారం ముమ్మరం చేసింది. ఈ దాడి నుంచి ఫ్యాన్ పార్టీ బయటపడేందుకు ఇకపై అనుసరించే వ్యూహం ఎలా ఉండబోతుందన్నది ఆసక్తికరం.

Tags:    

Similar News