జగన్ బాగానే సర్దేశారు

వైసీపీ అధికారంలోకి వస్తే తమకు పదవులు వస్తాయని కాచుకుని ఉన్న వారికి జగన్ చేయాల్సింది చేశారు. సర్కార్ ఏర్పడి ఆరు నెలలైంది. నామినేటెడ్ పదవుల పంపిణీ సైతం [more]

Update: 2019-12-07 15:30 GMT

వైసీపీ అధికారంలోకి వస్తే తమకు పదవులు వస్తాయని కాచుకుని ఉన్న వారికి జగన్ చేయాల్సింది చేశారు. సర్కార్ ఏర్పడి ఆరు నెలలైంది. నామినేటెడ్ పదవుల పంపిణీ సైతం తాత్కాలికంగా బంద్ అయ్యాయి. దాంతో మంచి ఆకలి మీద వైసీపీ నాయకులు ఉన్నారు. అయితే జగన్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల పాలకవర్గాలను ప్రకటించి చాలా మందికి శాంతి కలిగించారనుకోవాలి. ఈ లెక్కన చూసుకుంటే చైర్మన్ పదవులు మాత్రం అస్మదీయులే దక్కించుకున్నారు. క్యాబినెట్ ర్యాంక్ తో సమానమైన చైర్మన్ గిరీలను పలుకుబడి కలిగిన నాయకులే తమ వారికి ఇప్పించుకున్నారని అంటున్నారు. దాంతో మిగిలిన నాయకులకు నిరాశే మిగిలిందని వినిపిస్తోంది.

రాజుగారి ఇంటికే…

విశాఖ జిల్లాలో గత అయిదేళ్ళుగా డీసీసీబీ చైర్మన్ పదవిని కన్నబాబు రాజు ఇంటి గుమ్మానికే కట్టేసుకున్నారని అంటున్నారు. కాంగ్రెస్ లో రెండు మార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కన్నబాబుకు మంత్రి పదవి అప్పట్లో దక్కలేదు. అయితే విభజన తరువాత ఆయన టీడీపీలో చేరిపోయారు. ఇక్కడ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు. ఎమ్మెల్సీ కూడా చేయలేదు, దానికి ప్రతిఫలంగా డీసీసీబీ చైర్మన్ పదవిని కొడుకు సుకుమార వర్మకు ఇచ్చారు. ఇలా టీడీపీలో ఉన్నపుడు పదవికి అనుభవించిన రాజుగారు ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిపోయారు. ఆయనకు ఇక్కడ కూడా జగన్ పెద్ద పీట వేశారు. దాంతో ఆయన కుమారుడు సుకుమార్ వర్మకు మరోసారి డీసీసీబీ పదవిని జగన్ ఇచ్చేశారు. ఇక కన్నబాబు ఎటూ ఎమ్మెల్యేల్గా ఉన్నారు. దాంతో పాటు టీటీడీ బోర్డ్ మెంబర్ గా కూడా ఉన్నారు. దీంతో మూడు పదవులు ఒకే కుటుంబానికి దక్కినట్లైంది.

బొత్స వర్గానికే….

ఇదిలా విజయనగరం జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ పదవిని తన వర్గానికే దక్కించుకున్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. కాంగ్రెస్ పాలనలో సైతం బొత్స వర్గమైన మరిశర్ల తులసికే ఈ పదవిని సాధించుకున్నారు. ఇపుడు కూడా మరో మారు ఆమెకే ఈ పదవి దక్కేలా బొత్స చక్రంతిప్పడంతో ఆయన వ్యతిరేకవర్గం పూర్తిగా డీలా పడింది. నిజానికి బొత్స సత్యనారాయణ రాజకీయమే డీసీసీబీ చైర్మన్ పదవి నుంచి మొదలైంది. దాంతో మూడు దశాబ్దాలుగా ఆయన పట్టు బ్యాంక్ మీద ఎక్కడా జారిపోలేదు. ఇపుడు మళ్ళీ తన వారికే అక్కడ కుర్చీ వేయించేశారు.

ఆ వర్గానికి న్యాయం…..

ఇక శ్రీకాకుళం డీసీసీబీ చైర్మన్ పదవిని తీసుకుంటే పాలవలస వ్రికాంత్ బాబుకు అవకాశం ఇచ్చారు. ఇక్కడ మంత్రి ధర్మాన కృష్ణదాస్ తన పట్టుని ఎంతవరకు నిలుపుకున్నారన్నది పక్కన పెడితే చాలా కాలంగా పార్టీ కోసం పనిచేస్తున్న బలమైన సామాజిక వర్గానికి చెందిన విక్రాంత బాబుకు కీలకమైన పదవి దక్కడం పట్ల వైసీపీలో మరో ప్రధాన వర్గం ఆనందంగా ఉంది. ఇదిలా ఉండగా విక్రాంతబాబు ఎమ్మెల్సీ పదవిని ఆశించారని అంటున్నారు. అయితే ఆయనకు జగన్ ఈ కీలకమైన పదవి ఇవ్వడం పట్ల అనుచరులు సైతం ఆనందంగా ఉన్నారు. జగన్ అన్ని వర్గాలకు, కులాలకు న్యాయం చేస్తున్నారని దీంతో రుజువైదని అంటున్నారు. మొత్త్తానికి మిగిలిన పదవులు కూడా భర్తీ చేస్తే మరింతమందికి అవకాశం వస్తుందని అంటున్నారు.

Tags:    

Similar News