జగన్ ఆగేట్లు లేరే.. టీడీపీ గొంతుకలను…?

ఎన్ని విమర్శలొచ్చినా జగన్ తగ్గడం లేదు. టీడీపీ నేతల వరస అరెస్ట్ లతో బెంబెేలెత్తిస్తున్నారు. జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టిన తర్వాత వరసగా టీడీపీ నేతలను అరెస్ట్ [more]

Update: 2021-04-23 05:00 GMT

ఎన్ని విమర్శలొచ్చినా జగన్ తగ్గడం లేదు. టీడీపీ నేతల వరస అరెస్ట్ లతో బెంబెేలెత్తిస్తున్నారు. జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టిన తర్వాత వరసగా టీడీపీ నేతలను అరెస్ట్ చేస్తుండటం ఏపీలో చర్చనీయాంశంగా మారింది. సీనియర్ నేతలనే వైసీపీ ప్రభుత్వం టార్గెట్ చేసిందన్న విమర్శలు టీడీపీనేతలు చేస్తున్నారు. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ వాయిస్ ను బలంగా విన్పించే వారినే అరెస్ట్ చేస్తున్నారు. తాజాగా ధూళిపాళ్ల నరేంద్ర అరెస్ట్ తో మరోసారి చర్చనీయాంశంగా మారింది.

ఆర్థిక మూలాలను….

జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ నేతల ఆర్థిక మూలాలను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నారని టీడీపీ నేతలు చెబుతున్నారు. గీతం యూనివర్సిటీ అక్రమంగా ఆక్రమించుకున్న స్థలాన్ని జగన్ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. అలాగే వెలగపూడి రామకృష్ణ ఆక్రమించిన ప్రభుత్వ భూమిని కూడా స్వాధీనం చేసుకుంది. శుక్ర, శనివారాలు వస్తున్నాయంటే టీడీపీ నేతలు బెదిరిపోయేలా జగన్ ప్రభుత్వం చర్యలుంటున్నాయని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

అచ్చెన్న నుంచి… ఉమ వరకూ….

తొలుత ఈఎస్ఐ స్కాంలో అచ్చెన్నాయుడును అరెస్ట్ చేశారు. ఆ తర్వాత కొల్లు రవీంద్రను ఒక హత్య కేసులో నిందితుడిగా పేర్కొంటూ అరెస్ట్ చేశారు. వీరిద్దరూ జైలు జీవితం గడిపి తర్వాత బెయిల్ పై బయటకు వచ్చారు. వీరిద్దరూ తెలుగుదేశం పార్టీ వాయిస్ ను బలంగా విన్పించే వారే. ఇక మరో సీనియర్ నేత దేవినేని ఉమపై సీఐడీ కేసు నమోదయింది. ఆయనకు జగన్ ను విమర్శించిన కేసులో సీఐడీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ నెల 29వ తేదీన ఆయన విచారణకు హాజరుకావాల్సి ఉంది.

సంగం డెయిరీలో…..

ఇక తాజాగా ధూళిపాళ్ల నరేంద్ర ను నేడు అరెస్ట్ చేశారు. ఆయన గత కొంత కాలంగా రాజధాని అమరావతి భూములు, విశాఖ భూములపై ఆరోపణలు చేస్తున్నారు. దీనిని జగన్ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుందని చెబుతున్నారు. సంగం డెయిరీలో జరిగిన అవకతవకలపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. ఈయన సంగం డెయిరీ ఛైర్మన్ గా ఉన్నారు. మొత్తం మీద జగన్ ప్రభుత్వం టీడీపీ నేతలను వరసగా అరెస్ట్ లు చేస్తుండటం రాజకీయంగా ఏపీలో హీట్ ను రేపుతుంది.

Tags:    

Similar News