జగన్ కాళ్లు కట్టేసుకున్నారా?

జగన్ తన మంత్రివర్గం కూర్పు విషయంలో దేశంలోనే సంచలనం రేకెత్తించారు. బడుగు, బలహీన వర్గాలు, మైనారిటీలకు, మహిళలకు పెద్ద ఎత్తున చోటు కల్పించి మేధావివర్గాలతో పాటు, ప్రజాస్వామ్యవాదుల [more]

Update: 2019-11-26 06:30 GMT

జగన్ తన మంత్రివర్గం కూర్పు విషయంలో దేశంలోనే సంచలనం రేకెత్తించారు. బడుగు, బలహీన వర్గాలు, మైనారిటీలకు, మహిళలకు పెద్ద ఎత్తున చోటు కల్పించి మేధావివర్గాలతో పాటు, ప్రజాస్వామ్యవాదుల నుంచి శభాష్ అనిపించుకున్నారు. అయితే ఎంచుకున్న మంత్రులు ఎంతవరకూ ప్రభుత్వ రధాన్ని ముందుకు తీసుకుపోతున్నారన్నది అర్ధం కాని ప్రశ్నగా ఉంది. ఓ వైపు ప్రభుత్వానికి ఊపిరి సలపనీయకుండా విమర్శలు చేస్తున్నాయి. ప్రతి చిన్న అంశాన్ని పెద్దదిగా చేస్తున్నాయి. మరో వైపు సంబంధిత మంత్రులు మౌనం వహిస్తున్నారు. గట్టిగా కౌంటర్లు ఇవ్వలేకపోతున్నారు. చాలా శాఖ మంత్రులు అయితే అసలు ఉన్నారా అన్న సందేహాలు కూడా కలుగుతున్నాయి. ఈ మంత్రివర్గంతో జగన్ ఓ విధంగా తన కాళ్ళను తానే కట్టేసుకుని ముందుకు సాగలేకపోతున్నారా అనిపించమానదు.

పట్టు లేదుగా…?

కొందరు మంత్రులను జగన్ మొహమాటానికి తీసుకున్నారు. రాజకీయ అవసరాలను దృష్టిలో పెట్టుకుని చోటు ఇచ్చారు. అలా కీలకమైన ఐటి, భారీ పరిశ్రమల శాఖకు మంత్రిగా మేకపాటి గౌతంరెడ్డి నియమితులయ్యారు. ఆయన తండ్రి మేకపాటి రాజమోహన్ రెడ్డి జగన్ కి కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన మొదటి రోజు నుండే పూర్తి మద్దతుగా నిలిచారు. నెల్లూరు జిల్లాలో మంచి పట్టు ఆయనకు ఉంది. తాజా ఎన్నికల్లో ఆయన తప్పుకోవడంతో కుమారుడు గౌతంరెడ్డికి జగన్ అవకాశం ఇచ్చి మంత్రిగా తీసుకున్నారు. అయితే గౌతంరెడ్డి తన శాఖలో సరైన పనితనం చూపించలేకపోతున్నారని అంటున్నారు. కనీసం విపక్షాల ఆరోపణలకు ఆయన వెంటనే కౌంటర్లు ఇవ్వలేకపోతున్నారని కూడా అంటున్నారు. ఏపీకి అసలు పరిశ్రమలు రావడం లేదని, ఉన్నవి రద్దు చేసుకుని పోతున్నారని విపక్షాలు అంటున్నా మంత్రి మౌనంగానే ఉన్నారు. ఆయన పనితీరు మెరుగుపరచుకోవాలని అంటున్నారు.

కీలక శాఖలు సైలెంట్….

ముఖ్యమంత్రి తరువాత అంతటి ప్రాధాన్యత ఉన్న శాఖ హోం శాఖ. మరి ఆ శాఖ మంత్రి మేకతోటి సుచరిత దూకుడుగా ముందుకు సాగలేకపోతున్నారు. ఏపీలో వైసీపీ నేతలపైన సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లుగా పోస్టింగులు పెడుతున్నా పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లుగా ఉన్నారంటేనే అర్ధం చేసుకోవాలి ఆ శాఖ తీరు ఎలా ఉందో. టీడీపీ హయాంలో హోం శాఖ పూర్తిగా ప్రభుత్వం కట్టిదిట్టంగా నడిపింది. ఇక ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి ఎంతసేపూ ఏపీ అప్పుల్లో ఉందని చెబుతారు. మొదట్లో చెప్పుకోవడానికి బాగానే ఉన్నా ఆరు నెలల పాలన తరువాత ఆయన పనిలో పడాలి. అది కనిపించాలి. ముఖ్యమంత్రి జగన్ తనవరకూ తాను సమయం వచ్చినపుడు కేంద్రాన్ని అడుగుతూ ఉంటారు. ఈలోగా కేంద్రం నుంచి రావాల్సింది సాధించుకునే చొరవ కనబరచాలి. విభజన హామీలు, రావాల్సిన నిధుల గురించి ఆర్ధిక మంత్రి ఎంతమేరకు శ్రద్ధ పెట్టారంటే నిరాశే మిగులుగుతుంది.

ఇసుక వేశారుగా..?

ఇక ఇసుక కొరత పేరిత విపక్షం కంపు చేసినా కూడా పంచాయతి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గట్టిగా మాట్లాడితే ఒట్టు. ఒట్టి ఇసుకతో బలమైన జగన్ సర్కార్ పునాదులు కూల్చాలని చూస్తే బాధ్యత గల మంత్రి చేసిందేమీ లేదని విమర్శలు ఉన్నాయి. మొత్తానికి చూసుకుంటే ఈ జాబితాలో చాలా మంది పట్టు లేని మంత్రులు ఉన్నారు. సగానికి పైగా మంత్రులు మౌనరాగాలు ఆలపిస్తూంటే వీరితో జగన్ రెండున్నరేళ్ళ పాటు వేగగలరా అన్న డౌట్లు వస్తున్నాయి. అదే జరిగితే ప్రభుత్వానికి ఈలోగా రావాల్సిన చెడ్డపేరు వచ్చేస్తుందని కూడా సొంత పార్టీ నుంచే నేతలు హెచ్చరిస్తున్నారు.

Tags:    

Similar News