ఫీడ్ బ్యాక్ తోనే ఫ్యూచరట…జగన్ దెబ్బకు ఎమ్మెల్యేలు బెంబేలు

ఆంధ్రప్రదేశ్ లో ఒక విషయం మాత్రం స్పష్టమయింది. జగన్ తోనే గెలుపు అని తేలిపోయింది. జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో పాటు మాట తప్పరన్న విశ్వాసమే [more]

Update: 2021-04-02 02:00 GMT

ఆంధ్రప్రదేశ్ లో ఒక విషయం మాత్రం స్పష్టమయింది. జగన్ తోనే గెలుపు అని తేలిపోయింది. జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో పాటు మాట తప్పరన్న విశ్వాసమే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ విజయానికి ప్రధాన కారణం. ఈ విషయాన్ని ఎవరైనా అంగీకరించాల్సిందే. అదే ఇప్పుడు పార్టీలోని నేతలకు ఇబ్బందికరంగా మారింది. మొన్నటి వరకూ తమ ప్రాంతాల్లో తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శిస్తూ, తమ వల్లనే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచామని చెప్పుకుంటున్న నేతలు స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు చూసి డీలా పడ్డారనే చెప్పాలి.

తామే అంతా అనుకున్న వారికి….

నిజమే వైసీపీ అధికారంలోకి రాగానే జగన్ కు పాలన చేతకాదని సొంత పార్టీ నేతలే అభిప్రాయపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా తమ ఆధిపత్యాన్ని పెంచుకోవచ్చని కూడా వైసీపీలో ఒకరిద్దరు నేతలు అంచనా వేశారు. ఉత్తరాంధ్ర, రాయలసీమకు చెందిన ఇద్దరు నేతలయితే ప్రభుత్వంలో తామే నెంబర్ 2 అని బిల్డప్ తొలినాళ్లలో ఇచ్చుకున్నారు కూడా. కానీ అన్నింటికీ జగన్ తన దైన శైలిలోనే సమాధానం చెప్పారు. జల్లాల వ్యవహారాలన్నింటినీ తన కోటరీ ద్వారానే తాడేపల్లి నుంచి నడిపించడం ప్రారంభించారు.

చిటుక్కుమన్నా…..

జిల్లాలో ఏమాత్రం చిటుక్కుమన్నా సీఎంవో ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుంది. ఎప్పటికప్పుడు సీఎంవో జిల్లాల పరిస్థితులపై జగన్ కు నివేదికలను అందిస్తుంది. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లోనూ సీఎంవో కార్యాలయం మేయర్లు, డిప్యూటీ మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్ లపై జిల్లాలో కిందిస్థాయి నేతల నుంచి కూడా ఫీడ్ బ్యాక్ తీసుకుంది. ఆ ఫీడ్ బ్యాక్ ఆధారంగానే మొన్న జరిగిన ఎంపిక ఉందంటున్నారు.

ఎమ్మెల్యేలు డమ్మీలేనా?

ప్రతి జిల్లాలో తనకంటూ ప్రత్యేక సెల్ ను జగన్ ఏర్పాటు చేసుకున్నారు. రానున్న కాలంలో పదవుల ఎంపిక, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల కేటాయింపు కూడా జగన్ ఫీడ్ బ్యాక్ ఆధారంగానే చేస్తారంటున్నారు. దీంతో మంత్రులు, ఎమ్మెల్యేలు తాము కేవలం డమ్మీలమని తెలుసుకున్నారు. మిగిలిన మూడేళ్లలో పార్టీకోసం కష్టపడి పనిచేసి జగన్ దృష్టిలో పడితేనే భవిష్యత్ ఉంటుంది. ఇక నేతలు చెబితేనే పదవులు దక్కుతాయన్న ప్రచారానికి జగన్ ఈ రకంగా ఫుల్ స్టాప్ పెట్టారంటున్నారు. దీంతో మున్సిపల్ ఎన్నికల ఫలితాల తర్వాత ద్వితీయ శ్రేణి నాయకత్వంలోనూ జగన్ పై మరింత నమ్మకం పెరిగింది.

Tags:    

Similar News