పక్కా లోకల్ అంటున్న జగన్ ?

జగన్ సైలెంట్ గా ఉంటారు కానీ చాలా లోతుగానే ఆలోచిస్తారు అని ఆయన తీసుకునే నిర్ణయాల వల్లనే తెలుస్తుంది. విశాఖ అంటే చాలు వలసదారుల అడ్డాగా ఏనాడో [more]

Update: 2021-03-31 15:30 GMT

జగన్ సైలెంట్ గా ఉంటారు కానీ చాలా లోతుగానే ఆలోచిస్తారు అని ఆయన తీసుకునే నిర్ణయాల వల్లనే తెలుస్తుంది. విశాఖ అంటే చాలు వలసదారుల అడ్డాగా ఏనాడో మారిపోయింది. ప్రత్యేకించి మూడు దశాబ్దాలుగా రాజకీయ పదవులు ఏవీ కూడా లోకల్స్ కి దక్కలేదు. దాని మీద అందరికీ ఆవేదన ఉంది. అయితే అధినాయకులు, పార్టీలు మాత్రం నాన్ లోకల్స్ కే పెద్ద పీట వేస్తున్నాయి. దాంతో ఎవరూ ఏమీ చేయలేని పరిస్థితి. ఇపుడు ఒక బలమైన పార్టీ అధినేతగా, ప్రభుత్వాధినేతగా జగన్ తీసుకున్న కీలకమైన నిర్ణయంతో విశాఖ వాసులకు ఊరట లభించింది.

అందుకే అలా…..

విశాఖ కార్పొరేషన్ మేయర్ పదవి కోసం జగన్ అభ్యర్ధిని ఎంపిక చేసిన తీరు ఇపుడు అందరి మన్ననలు అందుకుంటోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో నాన్ లోకల్స్ కి పగ్గాలు ఇవ్వడం ధర్మం కాదు అన్న విధానంతోనే జగన్ ఇలాంటి ఆలోచనాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు అంటున్నారు. మూడు తరాలన నుంచి విశాఖలోనే పుట్టి పెరిగిన కుటుంబం నుంచి మేయర్ గా గొలగాని వెంకట హరి కుమారిని జగన్ ఎంపిక చేశారు. అందులోనూ బలమైన యాదవ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇచ్చారు. పైగా మహిళకు కూడా అవకాశం కల్పించారు. విద్యాధికురాలుగా కూడా ఆమె ఉండడం మరో అర్హతగా చెబుతున్నారు.

ధీటైన జవాబు….

వైసీపీ విశాఖలో గెలిస్తే ఇతర ప్రాంతాల వారు వచ్చి పులివెందుల రాజకీయాలు చేస్తారంటూ గత కొన్నేళ్ళుగా టీడీపీ ప్రచారం చేస్తూ వస్తోంది. జీవీఎంసీ ఎన్నికల వేళ కూడా ఆ పార్టీకి చెందిన సబ్బం హరి వంటి వారు నాన్ లోకల్స్ కావాలా, లోకల్స్ కావాలా అంటూ పత్రికా ప్రకటనలు ఇచ్చి మరీ జనాలను రెచ్చగొట్టారు. వీటన్నిటికీ జగన్ ధీటైన జవాబే చెప్పారు అంటున్నారు. ఈ కారణంగానే ప్రకాశం జిల్లాకు చెందిన వంశీ క్రిష్ణ శ్రీనివాస్ ని చివరి నిముషంలో మేయర్ ఎంపిక నుంచి తప్పించారు అన్న మాట కూడా వినిపిస్తోంది. విశాఖ పాలన పూర్తిగా స్థానికుల చేతులల్లోనే ఉంచాలన్న జగన్ అభిమతానికి అనుగుణంగానే ఈ ఎంపిక జరిగింది అంటున్నారు.

చెంప పెట్టేనా …?

విశాఖను పాలనా రాజధానిగా జగన్ ప్రకటించారు. రేపటి రోజున ఇక్కడ అభివృద్ధి కూడా వేగవంతంగా సాగే అవకాశాలు ఉన్నాయి. దాంతో పాటు రాజకీయ ప్రాముఖ్యత కూడా ఎక్కువగానే ఉంటుంది. ప్రత్యేకించి మెగాసిటీకి తొలి పౌరుడు అంటే ఆ విలువ వేరు. అటువంటి పదవిలో నాన్ లోకల్ ని నియమిస్తే ఆ దుస్సంప్రదాయం మరింతగా కొనసాగుతుంది అని ఆలోచించే జగన్ తనదైన శైలిలో చెక్ పెట్టారు. మరి టీడీపీ విశాఖ మీద ప్రేమ తనకూ చాలా ఉంది అంటుంది. రేపటి రోజున తాను కూడా లోకల్స్ కి ప్రాధాన్యత ఇస్తుందా అన్నది చూడాలి. ఒకవేళ ఆ పార్టీ ఇవ్వకపోతే లోకల్స్ మద్దతు వైసీపీకే నూరు శాతం ఉంటుంది అన్న మాట కూడా వినిపిస్తోంది. ఏది ఏమైనా బీసీలకు, మహిళలకు, లోకల్స్ కి ప్రాముఖ్యత ఇవ్వడం ద్వారా జగన్ తనదైన మార్క్ పాలిటిక్స్ ఇదేనని రుజువు చేసుకున్నారు.

Tags:    

Similar News