బాబు ఫార్ములా కాదట.. జగన్ కు ఆయనే ఆదర్శమట

ముఖ్యమంత్రుల అంటే నిరంతరం ప్రజల్లో ఉండాలి. మీడియాతో నిత్యం సమావేశమవుతుండాలి. ఇది చంద్రబాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చూపించారు. అయితే నిత్యం ప్రజల్లో ఉన్నా ముఖ్యమంత్రులకు అదేమీ [more]

Update: 2021-02-27 02:00 GMT

ముఖ్యమంత్రుల అంటే నిరంతరం ప్రజల్లో ఉండాలి. మీడియాతో నిత్యం సమావేశమవుతుండాలి. ఇది చంద్రబాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చూపించారు. అయితే నిత్యం ప్రజల్లో ఉన్నా ముఖ్యమంత్రులకు అదేమీ ప్లస్ కాలేదన్న దానికి కూడా చంద్రబాబే ఉదాహరణగా నిలిచారు. ఇప్పడు అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ పని తాము చేసుకుపోయే పనిలోనే ఉన్నారు. పబ్లిసిటీ కి కూడా పెద్దగా ప్రాధాన్యత కూడా ఇవ్వడం లేదు. అందులో ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఒకరు.

మామూలు హడావిడి కాదు….

నిజానికి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉండే హడావిడి అంతా ఇంతా కాదు. సమీక్షలని, వీడియో కాన్ఫరెన్స్ లని, ఆకస్మిక తనిఖీలని ఇలా నిత్యం ప్రజల్లోనే నలుగుతుండేవారు. ఇక మీడియా సమావేశాలు వారానికి కనీసం మూడు రోజులైనా ఉండేలా ప్లాన్ చేసుకుంటారు. ప్రభుత్వం నుంచి లీకుల సంగతి చెప్పనవసరం లేదు. పార్టీ నేతలపైనా, అధికారులపైనా వరస లీకులు ఇస్తూ ప్రజాభిప్రాయాన్ని చంద్రబాబు తెలుసుకునే వారు.

కేసీఆర్, నవీన్ పట్నాయక్ లు…..

కానీ ఇప్పుడు తెలంగాణాలోనూ ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దగా హడావిడి చేయలేదు. అయినా ఆయన రెండోసారి ప్రజామోదంతో గద్దెనెక్కారు. ఇక ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సంగతి చెప్పనవసరం లేదు. ఆయన ఎప్పుడో తప్ప మీడియా ముందుకు రారు. రాష్ట్ర విషయాలను తప్ప పెద్దగా దేనినీ పట్టించుకోరు. కానీ ఐదుసార్లు నవీన్ పట్నాయక్ ను విజయం వరించింది. ఈఫార్ములాను జగన్ అనుసరిస్తున్నట్లుంది.

పబ్లిసిటీ ఎక్కువయితే….

చంద్రబాబుకు మితిమీరిన పబ్లిసిటీయే చేటు తెచ్చి పెట్టింది. అమరావతి, పోలవరంల విషయంలో చంద్రబాబు వైఖరికి భిన్నంగా జగన్ వ్యవహరిస్తున్నారు. పోలవరం పనులు వేగంగా జరుగుతున్నా పెద్దగా దానిపై ఫోకస్ పెట్టడం లేదు. అనుకున్న లక్ష్యం చేరడమేనని ఆయన అధికారులను ఆదేశించడం వరకే పరిమితమయ్యారు. నిత్యం ప్రాజెక్టుల చుట్టూ తిరగడం లేదు. తన పనితాను చేసుకుపోతున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఏపీ ప్రజలకు చూపిన దృశ్యాలను జగన్ మారుస్తున్నారంటున్నారు. అందుకే ఎక్కువగా జగన్ పబ్లిసిటీకి ఇష్టపడటం లేదన్నది పార్టీ వర్గాల అభిప్రాయం. ఈ విషయంలో జగన్ నవీన్ పట్నాయక్ ను ఫాలో అవుతున్నట్లు కనపడుతుంది.

Tags:    

Similar News