ఒక్క జగన్ కోసం అంతా ఒక్కటవుతారా…?

వైఎస్ ఫ్యామిలీకి ఉన్న చరిష్మానే అదేనేమో. నాడు వైఎస్సార్ ఒంటి చేత్తో మొత్తం కాంగ్రెస్ పార్టీని రెండు సార్లు అధికారంలోకి తీసుకువచ్చారు. అప్పట్లో వైఎస్సార్ ఉంటే గెలవడం [more]

Update: 2021-02-09 05:00 GMT

వైఎస్ ఫ్యామిలీకి ఉన్న చరిష్మానే అదేనేమో. నాడు వైఎస్సార్ ఒంటి చేత్తో మొత్తం కాంగ్రెస్ పార్టీని రెండు సార్లు అధికారంలోకి తీసుకువచ్చారు. అప్పట్లో వైఎస్సార్ ఉంటే గెలవడం కష్టమని విపక్ష పార్టీలు అన్ని ఒక్క లెక్కన భయపడిపోయాయి. 2009 నాటికి తత్వం బోధపడిన చంద్రబాబు మహా కూటమి పేరిట అందరికీ ఒక దరికి చేర్చి వైఎస్సార్ మీదకు దండెత్తినా కూడా ఏమీ చేయేలేకపోయారు. ఇపుడు కూడా మరోసారి వైఎస్సార్ వారసుడు జగన్ విషయంలో ఏపీలోని విపక్ష శిబిరంలో పెద్ద ఎత్తున కలవరం మొదలైందిట.

టీడీపీలో అదే బెంగ….

వైఎస్ జగన్ అన్న క్యారెక్టర్ తో ఢీ కొట్టడం చాలా కష్టమన్నది రాజకీయ ధురంధరుడు చంద్రబాబుకు ఎపుడో అర్ధమైపోయింది. ఓ వైపు ఆయనకు వయసు అయిపోతోంది. టీడీపీ కళ నెమ్మదిగా కరగిపోతోంది. అదే సమయంలో టీడీపీ భావి వారసుడు ఎవరు అన్న చర్చ వచ్చినపుడు కూడా బెంగ నిండారా తమ్ముళ్ళలో ఉంది. జగన్ చూస్తే మధ్యాహ్న మార్తాండుడు మాదిరిగా ఉన్నారు. ఆయన మరో ముప్పయ్యేళ్ళ పాటు దూకుడుగా రాజకీయం చేయగలరు. దానికి తగిన సాధనాసంపత్తి అన్నీ సమకూర్చుకుంటున్నారు. దాంతో టీడీపీ అయితే ఒంటరిగా జగన్ ని ఢీ కొట్టలేమని గట్టిగానే తీర్మానించుకుంది.

ఇక కలివిడిగానే….

ఇక ఏపీలో సీన్ చూస్తే బీజేపీ జనసేన ఒక కూటమి కట్టారు. దానికి అంత సీన్ లేదని ఏపీ పొలిటికల్ చిత్రాన్ని చూసిన వారు ఎవరైనా ఇట్టే చెప్పేస్తారు. వారు ఏపీ పొలిటికల్ రేసులో అన్ని నంబర్లు దాటుకుని జగన్ ని ఎదురు నిలబడాలంటే చాలా పుష్కరాలే జరిగిపోయేట్లున్నాయి అంటున్నారు. మరో వైపు కృంగిపోయిన కామ్రెడ్స్, అలాగే కమిలి పోయిన కాంగ్రెస్ కూడా చెరో వైపు ఉన్నాయి. ఈ నేపధ్యంలో విడిగా ఉంటే ఎవరూ కూడా జగన్ కుర్చీని అంగుళం కూడా కదపలేరు అన్నది తేలుతున్న సత్యం. అందుకే కలివిడిగానే కలబడాలని భారీ స్కెచ్ తెర వెనక వేస్తున్నారని భోగట్టా.

జగన్ వర్సెస్ అదర్స్…..

ఇక ఏపీలో జగన్ తో ఏ పార్టీ ఒంటరిగా ఢీ కొట్టే సీన్ లేదు కాబట్టి మహా కూటమి ప్రతిపాదన మరో మారు తెర మీదకు వస్తోంది. జగన్ నానాటికీ తన ఓటు బ్యాంక్ ని పటిష్టం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఎవరెన్ని విమర్శలు చేసినా ఆయన గ్రామీణ ప్రాంతాలతో పాటు, మహిళల పట్ల ప్రత్యేక శ్రద్ధతో ముందుకు సాగుతున్నారు. జగన్ తన ఓటు బ్యాంక్ ని కూడా మరింతగా స్ట్రాంగ్ చేసుకుంటున్నారు. ఈ నేపధ్యంలో ఏపీలో కుడి ఎడమల తేడా లేకుండా అన్ని పార్టీలు ఒకే గూటిలో చేరుతాయా అన్న చర్చ అయితే వస్తోంది. అంటే దేశంలో 1989లో జరిగిన పరిణామం అన్న మాట. నాడు అతి బలమైన రాజీవ్ గాంధీని ఓడించడానికి బీజేపీ, కమ్యూనిస్టులు చెరో వైపునా నిలబడితే మిగిలిన పార్టీలు అసలు కార్యాన్ని నెరవేర్చాయి. అలా చంద్రబాబు, ఆయన టీడీపీ పెద్దన్నగా ఏపీలో కొత్త రాజకీయాన్ని, యాంటీ జగన్ వేదికను నిర్మించడానికి జోరుగా కసరత్తు సాగుతోంది అంటున్నారు. అదే నిజమైతే ఏపీలో రాజకీయ ముఖ చిత్రమే మారుతుందని చెప్పాలి.

Tags:    

Similar News