రాజ్యాంగాన్ని అర్ధం చేసుకోలేదా…?

వైఎస్ జగన్. దూకుడు బాగా ఉన్న యువ నేత. ఆయనలో ప్లస్ పాయింటే దూకుడు. ఎన్నిసార్లు గోడకు ముక్కు గుద్దుకున్నా ఆ దూకుడు ఆగదు. జగన్ విషయంలో [more]

Update: 2021-01-27 13:30 GMT

వైఎస్ జగన్. దూకుడు బాగా ఉన్న యువ నేత. ఆయనలో ప్లస్ పాయింటే దూకుడు. ఎన్నిసార్లు గోడకు ముక్కు గుద్దుకున్నా ఆ దూకుడు ఆగదు. జగన్ విషయంలో ఎవరేమి అనుకున్నా ఆయన పట్టుదలతో ముందుకే వెళ్తారు. తాను మనసులో తలచినదే చేస్తారు. ఇక జగన్ 2012లో కాంగ్రెస్ ని ఎదిరించి జైలుపాలు అయినపుడు ఆయన రాజకీయాలను సరిగ్గా ‌అర్ధం చేసుకోలేదు అన్న వారు ఉన్నారు. 2014 ఎన్నికల్లో తృటిలో అధికారాన్ని పోగొట్టుకున్నపుడు ఆయనకు ఎత్తులు జిత్తులు అర్ధం కావు అన్నారు. 2017 నాటికి వైసీపీని టీడీపీ ఖాళీ చేస్తున్నపుడు ఆయనకు పార్టీని ఎలా నడపడమో అర్ధం కాదు అన్నారు. తాజాగా జగన్ గురించి అంటున్న మాట ఆయన సరిగ్గా రాజ్యాంగాన్ని అర్ధం చేసుకోలేదని.

మొట్టికాయలు అందుకేనా…?

బాబా సాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ రచన చేశారు. ఆయన రాజ్యాంగం గురించి ఒక మంచి మాట చెప్పారు. రాజ్యాంగం బహు గొప్పది. కానీ ఆ గొప్పతనం తెలియాలి అంటే రాజ్యాంగ వ్యవస్థలో కూర్చున్న వారు కూడా గొప్పగానే వ్యవహరించాలి అని. కానీ మనం రాజ్యాంగం వరకే చూస్తున్నాం. జగన్ మాత్రం ఇంకా లోతుగా చూస్తున్నారు. కానీ ఈ రాజ్యాంగం కల్పించిన వ్యవస్థలకు రక్షణగా కోర్టులు ఎపుడూ ఉంటాయన్న సత్యాన్ని ఆయన మరచిపోతున్నారు. అందుకే ఈ ఇరవై నెలల కాలంలో ఎన్నో మొట్టికాయలు వరసగా జగన్ సర్కార్ మీద పడుతున్నాయి.

ప్రజలను గెలిచారు…..

ఇక జగన్ ఏది అర్ధం చేసుకున్నా లేకపోయినా ప్రజలను అర్ధం చేసుకున్నారు. ఆయన పాదయాత్రలో వేలాది కిలోమీటర్లు నడిచారు. ప్రజల మనసులను చూరగొన్నారు. వారి కోసం ఏదో చేయాలని తపన ఆయనకు ఉంది. అందుకే వచ్చిన వెంటనే తొంబై శాతం హామీలను నెరవేర్చారు. కానీ ఆయన ఇంకా చాలా చేయాలి అనుకుంటున్నారు. కానీ ఏది చేయాలన్నా కూడా రాజ్యాంగబధ్ధమైన ప్రక్రియలోనే చేయాలి. వ్యవస్థలతో సర్దుబాటు చేసుకుంటూనే ముందుకు సాగాలి. సంఘర్షణే నా పధం అని జగన్ కనుక ఆలోచిస్తే ఆయన అర్ధం చేసుకున్న ప్రజలే నష్టపోతారు.

ఓవర్ నైట్ జరగవు….

మన ప్రజస్వామ్య దేశంలో ఏదీ ఒవర్ నైట్ జరిగేది కాదు, ఇప్పటికీ మనం అభివృద్ధి చెందిన దేశంగానే ఉన్నామంటే చాలా విషయాలు దానికి కారణం. జగన్ విషయానికి వస్తే ఆయన ముఖ్యమంత్రిగా ఇంకా తొలి అడుగులు వేస్తున్నారు. ఇంత దూకుడు కూడదు అనే వారున్నారు. రెండు మూడు సార్లు గెలిచిన వారు కూడా వెళ్లని వ్యవస్థల జోలికి జగన్ వెళ్ళి చేయి కాల్చుకుంటున్నారు అన్న సానుభూతి కూడా ఉంది. కానీ జగన్ కి ఏమీ అర్ధం కాదా? ఆయనది కేవలం దూకుడేనా? అంటే కానే కాదు, జగన్ కి అన్నీ అర్ధమవుతాయి. ఆయన ఎంతగా అర్ధం చేసుకుంటే అంతగా దూకుడు చూపుతారంతే. కానీ ఆయన దూకుడుకు ఫలితాలు ఈ రోజుకీ ఇప్పటికిపుడూ రావు అంతే. సమయం కోసం వేచిచూడాలి.

Tags:    

Similar News