టచ్ చేసి చూస్తోందిగా ?

ఏపీలో రాజకీయాలు చూస్తే తొంభైల దశకం నాటి తమిళనాడు రాజకీయాలు గుర్తుకు రాక మానవు. ఉప్పు నిప్పులా వైసీపీ టీడీపీ చెరోపక్కన నిలబడి తొడకొడుతున్నాయి. మిగిలిన పార్టీలు [more]

Update: 2021-01-31 08:00 GMT

ఏపీలో రాజకీయాలు చూస్తే తొంభైల దశకం నాటి తమిళనాడు రాజకీయాలు గుర్తుకు రాక మానవు. ఉప్పు నిప్పులా వైసీపీ టీడీపీ చెరోపక్కన నిలబడి తొడకొడుతున్నాయి. మిగిలిన పార్టీలు ఏదో పేరుకు చెప్పుకోవడానికి ఉన్నా వాటికి అంత సీన్ ఏమీ కనిపించడంలేదు. దాంతో ఏపీలో ఏం జరిగినా ఈ రెండు పార్టీల మధ్యనే రాజకీయం అన్నట్లుగా ఉంది. ఈ నేపధ్యంలో అర్ధ రాత్రి అరెస్టులు పోలీస్ స్టేషన్లలో తిప్పడాలూ ఈ మధ్యన బాగా ఎక్కువైపోయాయి. మాజీ మంత్రులను, కాస్తా పేరున్న నాయకులనే బేఖాతరుగా ఇంటికి వెళ్ళి మరీ పోలీసులు జీపు ఎక్కించేస్తున్నారు.

డీ మోరలైజ్ అవడానికేనా…?

రాజకీయాల్లో ఎలా ఉంటుందంటే చూసుకుందాం రా అంటూ కవ్వించుకోవడాలు, టచ్ చేసి చూడు అంటూ సవాళ్లు విసురుకోవడాలు మామూలే. కానీ అన్నంతపనీ చేయడం అంటే అసలు జరగదు. కానీ ఏపీలో మాత్రం చాలా సులువుగా అరెస్టులను చేస్తున్నారు. నిన్నటిదాకా మిడిసిపడిన నాయకులను ఏమీ కాకుండా చేసేస్తున్నారు. ఈ దెబ్బకు చిత్తు టీడీపీ పెద్దల గుట్టు అంటూ క్యాడర్ కి వైసీపీ వ్యూహాత్మకంగానే సందేశాన్ని పంపుతోంది. జూమ్ యాప్ లో బాబు ఎంతగా ఊదరగొట్టినా సుఖం లేదు, పొలిటికల్ మైలేజ్ ఒక్క పిసరు కూడా రాదు అని తేలిపోయాక వైసీపీ బెరుకూ బెంగా లేకుండా అరెస్టుల పర్వానికి తెర లేపుతోంది.

బిగ్ షాట్స్ సైలెంట్….

ఆ మధ్య వరకూ రాయలసీమలో తెగ నోరు చేసిన జేసీ బ్రదర్స్ ఇపుడు పిన్ డ్రాప్ సైలెన్స్ అయ్యారంటే వైసీపీ వ్యూహం పారుతోంది అనే అనుకోవాలి. ఉత్తరాంధ్రాలో అచ్చెన్నాయుడుని తెల్లారుతూనే ఇంటి ముందే అరెస్ట్ చేసి విజయవాడ దాకా కారులో తీసుకొచ్చిన వైసీపీ ఇపుడు ఆయన కౌంటర్ పార్ట్ అయిన కళా వెంకటరావునూ అదే అర్ధరాతి తలుపుకొట్టి మరీ పోలీస్ స్టేషన్ ఏంటో చూపించింది. అధికారం నిక్షేపంలా చేతిలో ఉన్నపుడు జంకూ గొంకూ ఉంటే వేస్ట్ అన్న థియరీ వైసీపె ప్రభుత్వ పెద్దలది గా ఉన్నట్లుంది.

ఖాకీలతోనే కధ‌ …..

గతంలో చంద్రబాబు కూడా పోలీసులను అడ్డం పెట్టుకునే పాలన చేసేవారు. ఏ నాయకుడు ఆందోళం‌కు రెడీ అన్నా ముందుగా హౌస్ అరెస్ట్ చేసేవారు. అంతెందుకు ముద్రగడ పద్మనాభం విషయంలోనూ అదే జరిగింది. ఇపుడు జగన్ దానికి మరింతగా తనదైన దూకుడు జత చేసారు. దాంతో ఇది పోలీస్ రాజ్యమని టీడీపీ సహా విపక్షాలు ఆడిపోసుకుంటున్నాయి. ఎవరెలా అనుకున్నా ఇది పక్కా పాలిటిక్స్. ఇలాగే ఉంటుంది. ఎవరో కామన్ మ్యాన్ ఏదో అనుకుంటాడనో, మరెవరో మేధావి పెదవి విరుస్తాడని, ఇంకెవరో పెద్ద మనిషి విశ్లేషణలు నెగిటివ్ గా రాస్తారని చూస్తూ ఊరుకుంటే చేతిలో అపరిమితమైన పవర్ ఉన్నా లాభమేంటి. ఇపుడు జగన్ సర్కార్ అమలు చేస్తున్నాది అదే. విపక్షం నోరు చేస్తే సైలెంట్ గా ఎలా ఉంచాలో ఇరవై నెలల్లో బాగా నేర్చేసింది. ఇక మీదట లాంగ్ మార్చులు, దీక్షలు, యాత్రలు అంటే వైసీపీ రాజ్యంలో కుదురుతుందా అంటే డౌటే మరి. జనంలోనే తేల్చుకుంటామంటే ఆనక అందరూ అపుడే చూసుకోవాలి మరి.

Tags:    

Similar News