అపర హిందువు జగనే…?

హిందువు అంటే నిలువు బొట్లూ అడ్డ బొట్లూ పెట్టేసి గట్టిగా మాట్లాడితే సరిపోతుందా. దేశంలో ఓట్ల కోసం వెతుకుతున్న సవాలక్ష మార్గాలలో హిందువులను కూడా కట్టేశారు. దాంతోనే [more]

Update: 2021-01-17 00:30 GMT

హిందువు అంటే నిలువు బొట్లూ అడ్డ బొట్లూ పెట్టేసి గట్టిగా మాట్లాడితే సరిపోతుందా. దేశంలో ఓట్ల కోసం వెతుకుతున్న సవాలక్ష మార్గాలలో హిందువులను కూడా కట్టేశారు. దాంతోనే ఇపుడు గుడులూ తీర్ధాలూ కూడా రణ రంగాన్నే తలపిస్తున్నాయి. రాజకీయ సమరానికే అసలైన వేదికలు అవుతున్నాయి. ఇంతవరకూ ఈ జాడ్యం ఏపీలో లేదు అని సంతోషించిన వారికీ ఆ బెడదా బెంగా తెచ్చేసిన అచ్చమైమిన పాపం విపక్షాలదే. అయితే తెలివైన వారు మాత్రం దీన్ని ఆదిలోనే అడ్డుకుంటారు. అదే ముఖ్యమంత్రి జగన్ చేస్తున్నది.

ఆస్తికుడు ఆయనే …?

మతాలు ఎవైనా దేవుడు ఉన్నాడు అని నమ్మేవారిని ఆస్తికుడు అంటారు. దేవుడు లేడన్న వితండివాదులను నాస్తికులు అంటారు. మరి దేవుడితోనే రాజకీయాలు చేయాలనుకునే వారిని ఏమనాలి. వారు నాస్తికులా, ఆస్తికులా అన్నింటికీ అతీతులా అంటే సమాధానం లేదు. ఇక ఏపీలో జగన్ ప్రభుత్వం ఇప్పటిదాకా ఏ మతం పట్ల వివక్ష చూపిన దాఖలాలు లేవు. జగన్ కూడా హిందూ ఆలయాలకు ఇవ్వాల్సిన ప్రాధ్యాన్యత ఇస్తున్నారు. అంతే కాదు ఆయా ఆలయ ఆచార వ్యవహారాలను ఒక ముఖ్యమంత్రిగా ఆయన వెళ్ళినపుడు తప్పకుండా పాటిస్తున్నారు. అలాగే వాటి విషయంలో తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటున్నారు.

బురద జల్లినా….

జగన్ విషయంలో హిందూ మతాధిపతులకు, ఆస్తికులకు రాని సందేహాలు డౌట్లు మాత్రం రాజకీయ జీవులకు రావడమే ఇక్కడ వింతా విడ్డూరమూ. రాష్ట్రంలో గత అయిదేళ్లలో ఎన్నో దేవాలయాలు కూల్చవేయబడ్డాయి. అలాగే మరింటిని రోడ్ల విస్తరణ ఇతరత్రా పేరు మీద తొలగించారు. నాడు మాట్లాడని వారు ఇపుడు పెద్ద నోరు చేసుకోవడం జనాలు బాగానే గమనిస్తున్నారు. ఇక మతాలు కులాలు అన్నీ ఒక్కటే అని చెప్పాల్సిన ఏపీలోని సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ ఒకాయన అయితే తాను మరీ ఇంత సంకుచితమా అన్నట్లుగా మాటల గారడీ చేస్తున్నారు. అయినా జనంలో ఇప్పటికైతే పెద్దగా ప్రతిస్పందన రాకపోవడం రాష్ట్రానికి మేలు చేసేదే.

చెక్ పెట్టే దిశగా …?

చంద్రబాబు హయాంలో ఏపీలో కూల్చివేయబడిన గుడులూ గోపురాలను పునరుద్ధరించే పనికి ముఖ్యమంత్రి జగన్ ఉపక్రమించడం అంటే నిజంగా అభినందించతగిన విషయం. అదే విధంగా ఏపీలోని అన్ని దేవాలయాలలో సీసీ కెమెరాలను పెట్టడం, రక్షణ చర్యలు పెంచడం వంటి చర్యల ద్వారా వైసీపీ సర్కార్ సకాలంలోనే మత రాజకీయాలకు అడ్డుకట్ట వేస్తోంది. ఏపీలో ఉన్న వారే కాదు సౌతిండియాలోని ప్రజలు ఇలాంటి విషయాల్లో అంతలా భావోద్వేగాలకు గురి కాదు. ఆ అదృష్టం ఉండబట్టే ఏపీలో ఇంతలా రచ్చ చేయడానికి విపక్షాలు చూసినా ప్రశాంతత దెబ్బతినలేదు. ఇక అన్ని మతాలకు సమాన ప్రాతినిధ్యం కల్పిస్తూ సమ భావనను పెంపొందిస్తున్న వైసీపీ సర్కార్ ఇపుడు విపక్షాలకు గట్టి ఝలక్ ఇచ్చేసింది. మొత్తానికి కరోనాతో పూర్తిగా కర్చు అయిపోయినా జీవుడి బాధలు చూడాల్సిన విపక్షాలు ఇలా దేవుడి పేరిట రాద్ధాంతం చేయడమే దారుణం, బాధాకరం.

Tags:    

Similar News