అడుగు కూడా ముందుకు పడదట.. అదంతే?

జగన్ కి మూడు రాజధానులు అంటే ఇష్టమని అందరికీ తెలిసిందే. అందులో అమరావతి కూడా ఒక రాజధానిగా ఉందని ఇప్పటిదాకా వైసీపీ మంత్రులు చెబుతూ వచ్చారు. టీడీపీతో [more]

Update: 2021-01-07 03:30 GMT

జగన్ కి మూడు రాజధానులు అంటే ఇష్టమని అందరికీ తెలిసిందే. అందులో అమరావతి కూడా ఒక రాజధానిగా ఉందని ఇప్పటిదాకా వైసీపీ మంత్రులు చెబుతూ వచ్చారు. టీడీపీతో కానీ ఇతర ప్రతిపక్షలతో కానీ వాదించేటపుడు ఈ పాయింట్ నే వైసీపీ నేతలు ముందుకు తెస్తూంటారు. అమరావతి కూడా శాసన రాజధానిగా ఉంటుందని కూడా చెబుతూంటారు. మరి జగన్ కి అమరావతి అన్నది అసలు రాజధానిగానే కనిపించడంలేదా అన్న చర్చ అయితే వస్తోంది.

టీడీపీ వారే అంటూంటారా..?

అమరావతి రాజధాని విషయాన్ని జగన్ ఎక్కడా బయటకు చర్చకు పెట్టారు. ఆయన ఎపుడో మీటింగులలోనో మరో విధంగానో తన మనసులో మాటను అన్యాపదేశంగా వెల్లడిస్తూంటారు. తాజాగా ఆయన శ్రీకాళహస్తిలో ఇళ్ళ పట్టాల పంపిణీ సభలో మాట్లాడుతూ అమరావతిలో దళితులకు యాభై నాలుగు వేల ఇళ్ళ పట్టాలు ఇస్తామంటే కోర్టులో కేసులు వేసి అడ్డుకున్నారంటూ గట్టిగానే విమర్శలు చేశారు. అంతవరకూ బాగానే ఉంది కానీ ఆయన మరో మాట కూడా అన్నారు. అమరావతి అని ఉంది కదా, అదే టీడీపీ వారు రాజధానిగా కూడా చెబుతూంటారు అని జగన్ ఈ సభలో అనడం ఆసక్తినే కాదు సంచలనాన్ని కూడా రేకెత్తించింది. అంటే టీడీపీ వారికి తప్ప అమరావతి రాజధానిగా ఎవరికీ కాదు అని జగన్ చెప్పదలచుకున్నారని అర్ధమైపోతోంది.

ఇగ్నోర్ చేయడమేనా….?

జగన్ రాజకీయం షార్ప్ గా ఉంటుంది. చెప్పాల్సింది సూటిగా చెబుతూనే అవసరం లేదు అనుకున్న దాన్నిపూర్తిగా సైడ్ చేసి పారేస్తారు. ఆయన ఎక్కువగా తన మాటల్లో చంద్రబాబు పేరు ప్రస్తావించరు కూడా. తాను పదే పదే ఆయన పేరు చెప్పి హైలెట్ చేయడం జగన్ కి ఇష్టం లేదు అంటారు. ఈ విధంగా జగన్ కొందరు వ్యక్తులను కొన్ని పార్టీలను పూర్తిగా ఇగ్నోర్ చేస్తారు. తన మాటల ద్వారా జనం మనసులో వారిని జొప్పించడం ఎందుకు అన్నది కూడా ఆయన లాజిక్ కావచ్చు. ఇపుడు ఆ జాబితాలో అమరావతిని కూడా తెచ్చేశారా అన్న మాట అయితే వినిపిస్తోంది.

క్లారిటీ ఇచ్చేశారా …?

జగన్ అధికారంలో ఉండగా అమరావతి విషయంలో రాజధానిగా అడుగు ముందుకు పడదు అన్నది అందరికీ తెలిసిందే. అయితే దానిని శాసన రాజధానిగా ఇదే జగన్ సర్కార్ అసెంబ్లీలో బిల్లు పెట్టి మరీ చట్టం చేసింది. అంటే మూడు రాజధానులలో ఒకటిగా అమరావతి ఉంటుందని వైసీపీ పెద్దలు చెప్పారన్న మాటే. కానీ అసలైన రాజధాని మాత్రం విశాఖే అన్నది జగన్ మనసులో మాట ఇపుడు ఇలా బయటకు వచ్చిందని అంటున్నారు. ఇలా నెలలు గడుస్తున్న కొద్దీ అమరావతి రాజధాని పేరిట ఉద్యమాలు జరుగుతున్న కొద్దీ జగన్ కూడా తన వైపు గట్టిగానే ఉంటున్నారు. మరి ఆయన ఆలోచనలు కనుక రేపు మరో రూపు దాలిస్తే ఏకైక‌ రాజధానిగా విశాఖ ఉన్నా కూడా ఆశ్చర్యం లేదు అన్న మాట కూడా వినిపిస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.

Tags:    

Similar News