ఉప ఎన్నికల్లో ఓటమిని వైసీపీ నేతలే కోరుకుంటున్నారా?

పాలన సాగినంత కాలం తమకు తిరుగులేదనుకుంటారు. తమకు ఇచ్చే ఫీడ్ బ్యాక్ కూడా అదే చెబుతుండటంతో ఎవరూ తాము తీసుకున్న నిర్ణయాలను వెనక్కు తీసుకోరు. కానీ ఏదైనా [more]

Update: 2021-01-20 12:30 GMT

పాలన సాగినంత కాలం తమకు తిరుగులేదనుకుంటారు. తమకు ఇచ్చే ఫీడ్ బ్యాక్ కూడా అదే చెబుతుండటంతో ఎవరూ తాము తీసుకున్న నిర్ణయాలను వెనక్కు తీసుకోరు. కానీ ఏదైనా వ్యతిరేక ఫలితం వెలువడితే అప్పుడు పునరాలోచన మొదలవుతుంది. ఇప్పుడు జగన్ విషయంలోనూ అదే జరగాలని కొందరు పార్టీ శ్రేయోభిలాషులు సయితం ఆకాంక్షిస్తున్నారు. జగన్ ముఖ్యమంత్రిగా దీర్ఘకాలం కొనసాగాలనుకుంటున్న వారు సయితం జగన్ ఒక దెబ్బ తగలాల్సిందేనన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

అనేక నిర్ణయాలు…..

జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో కొన్ని వివాదాస్పదం కాగా మరికొన్ని ప్రజోపయోగమైన నిర్ణయాలే. జగన్ గత పందొమ్మిది నెలలుగా తాడేపల్లి క్యాంపు కార్యాలయానికే పరిమితమయ్యారు. అప్పుడప్పుడు హడావిడిగా జిల్లా పర్యటనలు తప్పించి పెద్దగా క్షేత్రస్థాయికి వెళ్లడం లేదు. జగన్ కు వచ్చే ఫీడ్ బ్యాక్ మొత్తం అధికారులు, పార్టీ సీనియర్ నేతలనుంచి వస్తున్నవే. అది సహజంగా ఫీల్ గుడ్ అనే ఉంటుంది.

క్షేత్రస్థాయిలో వ్యతిరేకతను…..

కానీ క్షేత్రస్థాయిలో వ్యతిరేకతను జగన్ పసిగట్టలేకపోతున్నారని వైసీపీ సీనియర్ నేతలే అభిప్రాయపడుతున్నారు. కేవలం సంక్షేమం పైనే కాకుండా అభివృద్ధి పనులపై కూడా జగన్ దృష్టి పెడితే బాగుంటుందని సూచిస్తున్నారు. కానీ జగన్ కు చెప్పే ధైర్యం ఎవరికీ లేదు. ముఖ్యంగా ఇసుక, మద్యం పాలసీలు ప్రజల్లో వ్యతిరేకతను పెంచాయి. ఇక రహదారుల పరిస్థితి ఘోరంగా ఉంది. ఇవేవీ జగన్ ఇప్పట్లో పట్టించుకునే అవకాశాలు లేవు. ఆయన దృష్టంతా హామీల అమలుపైనే ఉందంటున్నారు.

ఓడిపోవాలని…..

పొరుగున ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దుబ్బాక ఉప ఎన్నిక, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఫలితాలతో మారిపోయారు. తన నిర్ణయాలను కూడా వెనక్కు తీసుకుంటున్నారు. నియంత్రిత సాగు పై ఇప్పటికే కేసీఆర్ వెనక్కు తగ్గారు. అలాగే ఎల్ఆర్ఎస్ పై కూడా పునరాలోచిస్తున్నారు. ప్రజా వ్యతిరేకతను గుర్తించి కేసీఆర్ తాను చేసిన నిర్ణయాలను వాపస్ తీసుకుంటున్నారు. అలాగే జగన్ కు కూడా ఒక దెబ్బ పడితేనే కొన్ని కీలక నిర్ణయాల్లో వెనక్కు తగ్గుతారని, తిరుపతి ఉప ఎన్నికలో ఓటమి పాలయితేనే వచ్చే ఎన్నికల్లో తాము సులువుగా గెలుస్తామని కొందరు వైసీపీ నేతలు ఆఫ్ ది రికార్డుగా చెబుతుండటం విశేషం.

Tags:    

Similar News