రూరల్ లో ఓకే… కానీ అర్బన్ దెబ్బేస్తుందా?

ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు ఇరవై నెలలు గడుస్తుంది. ఇప్పటి వరకూ జగన్ సంక్షేమ పథకాల అమలుపైనే ఎక్కువగా దృష్టి పెట్టారు. అప్పులు తెచ్చి [more]

Update: 2021-01-04 12:30 GMT

ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు ఇరవై నెలలు గడుస్తుంది. ఇప్పటి వరకూ జగన్ సంక్షేమ పథకాల అమలుపైనే ఎక్కువగా దృష్టి పెట్టారు. అప్పులు తెచ్చి మరీ సంక్షేమ పథకాలకు కేటాయించడాన్ని కొందరు మేధావులు తప్పుపడుతున్నారు. సంపద సృష్టికి జగన్ నిధులు కేటాయించడం లేదని, కేవలం ఎన్నికల ఓటు బ్యాంకును పటిష్టం చేసుకునేందుకే జగన్ ప్రయత్నాలు చేస్తున్నాయని సర్వత్రా విమర్శలు విన్పిస్తున్నాయి.

గత ఎన్నికల్లో….

ఇప్పడు తాజాగా ఒక చర్చ మొదలయింది. జగన్ పేదలకు ఇళ్ల పట్టాల పేరుతో దాదాపు 35 లక్షల మందికి లబ్ది చేకూరుస్తున్నారు. పదిహేను రోజుల పాటు పండగలా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. గత ఎన్నికల్లో జగన్ పార్టీకి గ్రామీణం, పట్టణం అనే తేడా లేకుండా ఓటర్లు పట్టం కట్టారు. యాభై శాతానికి పైగానే ఓట్లను సాధించి 151 స్థానాలను సాధించారు. అయితే గత ఇరవై నెలలుగా జరుగుతున్న జగన్ పాలనపై అర్బన్ ప్రాంత ఓటర్లు అసంతృప్తిగా ఉన్నట్లు ఒక సర్వేలో వెల్లడయింది.

బాగా వీకయిందని…..

గతంలో అర్బన్ ప్రాంతాల్లో టీడీపీ వీక్ గా ఉండేది. వైసీపీ బలంగా ఉంది. చంద్రబాబు పాలనతో విసిగిపోయిన విద్యావంతులు, విద్యర్థులు, ఉద్యోగ వర్గాలు, మేధావులు గత ఎన్నికల్లో జగన్ వైపు నిలిచారు. ఫలితంగా అర్బన్ ప్రాంతాల్లోనూ ఫ్యాన్ గాలి బలంగా వీచింది. కానీ ఈసారి రివర్స్ అయిందంటున్నారు. ఈ వర్గాలు జగన్ అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల పట్ల పెదవి విరుస్తున్నారు. రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టి, ప్రజాధనాన్ని జగన్ వృధా చేస్తున్నారన్న విమర్శలు అర్బన్ ప్రాంతాల్లో బలంగా విన్పిస్తుంది.

ఇక్కడ చెక్కు చెదరలేదట…..

ఇక సంక్షేమ పథకాలను అమలు చేస్తుండటంతో వైసీపీ నేటికి రూరల్ ప్రాంతంలో బలంగా ఉందంటున్నారు. వివిధ పథకాల అమలుతో పాటు రైతాంగం కూడా జగన్ పాలన పాట్ల సుముఖంగా ఉంది. తాను ఇచ్చిన హామీలను ఎన్నికలతో సంబంధం లేకుండా అమలు చేయడం వల్లనే రూరల్ ప్రాంతంలో జగన్ కు ఇప్పటికీ బలం చెక్కు చెదరకుండా ఉందంటున్నారు. అయితే రూరల్ ప్రాంతంలో టీడీపీకి కూడా పటిష్టమైన ఓటు బ్యాంకు ఉంది. మొత్తం మీద జగన్ పాలనపై అర్బన్ ప్రాంతాల్లో మాత్రం కొంత వ్యతిరేకత మొదలయిందనే చెప్పాలి.

Tags:    

Similar News