మనసు విప్పి మాట్లాడితే ఏంపోయింది?

ప్రాంతీయ పార్టీలో పార్టీ అధినేత సుప్రీం. ఆయన దగ్గర పిలిచి మాట్లాడితే అన్ని విభేదాలు సర్దుకుంటాయి. కానీ ఏపీ ముఖ్యమంత్రి జగన్ మాత్రం ఆ దిశగా ప్రయత్నాలు [more]

Update: 2021-01-03 03:30 GMT

ప్రాంతీయ పార్టీలో పార్టీ అధినేత సుప్రీం. ఆయన దగ్గర పిలిచి మాట్లాడితే అన్ని విభేదాలు సర్దుకుంటాయి. కానీ ఏపీ ముఖ్యమంత్రి జగన్ మాత్రం ఆ దిశగా ప్రయత్నాలు చేయడం లేదన్న విమర్శలు వినపడుతున్నాయి. వివిధ జిల్లాలను పర్యటిస్తున్న జగన్ ఆ జిల్లాలో వైసీపీ నేతలతో కనీసం గంట సమయం కేటాయిస్తే విభేదాలు వాటంతట అవే పరిష్కారమవుతాయని వైసీపీ నేతలు చెబుతున్నారు. కానీ జిల్లాల పర్యటనకు వచ్చిన జగన్ మాత్రం విభేదాల పరిష్కారానికి ప్రయత్నించడం లేదు.

రాష్ట్రమంతటా అదే పరిస్థితి…..

వైసీపీ నేతల మధ్య విభేదాలు రాష్ట్రమంతటా ఉన్నాయి. నిత్యం జగన్ వివిధ శాఖల సమీక్షలతో తీరిక లేకుండా గడుపుతున్నారనుకుందాం. కనీసం జిల్లాల పర్యటనకు వచ్చినప్పుడు వారికి సమయం కేటాయించి విభేదాలను పరిష్కరించిందుకు మాత్రం మొగ్గు చూపడం లేదు. ఇటీవల జగన్ డిసెంబరు 23వ తేదీన కడప జిల్లా పర్యటనకు వచ్చారు. మూడు రోజుల పాటు జగన్ కడప జిల్లాలోనే ఉన్నారు.

జిల్లాల పర్యటనలో…..

కానీ కడప జిల్లాలోని జమ్మలమడుగు నియోజకవర్గంలో వైసీపీ నేతల మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి. అక్కడ రామసుబ్బారెడ్డి, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. హత్య కూడా చోటు చేసుకుంది. కానీ వీరిద్దరితో జగన్ కనీసం మాట్లాడే ప్రయత్నం చేయలేదు. ఇద్దరితో కలిపి కూర్చుని జగన్ మాట్లాడి ఉంటే జమ్మలమడుగు విభేదాలకు తెరపడేది అని అంటున్నారు. కానీ జగన్ మాత్రం ఆ దిశగా ఎటువంటి ప్రయత్నం చేయలేదు.

గంట సమయం కేటాయించలేరా?

ఇక ఇటీవల పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల్లోనూ జగన్ పర్యటించారు. అక్కడ కూడా వైసీపీ నేతల మధ్య విభేదాలున్నాయి. ఇక్కడ పార్టీని బలోపేతం చేసేందుకు కనీసం గంట సమయాన్ని జగన్ కేటాయించే సరిపోయేది అన్న వ్యాఖ్యలు పార్టీ నుంచే వినిపిస్తున్నాయి. ఎటు ఎమ్మెల్యేలకు అపాయింట్ మెంట్ ఇవ్వరన్న విమర్శ జగన్ మీద ఉంది. తాను జిల్లాలకు వెళ్లినప్పుడయినా ఎమ్మెల్యేలతో మాట్లాడి వారి మనసు తెలుసుకునే ప్రయత్నం చేసి ఉంటే పార్టీ కుదురుకునేదన్న టాక్ వైసీపీలో వినపడుతుంది. మరి జగన్ పార్టీని ఎప్పుడు గాడిలో పెడతారా? లేదా? అన్న సందేహం తలెత్తుంది. విభేదాలు మరింత ముదిరితే వాటిని అతుక్కోబెట్టడం ఎవరి వల్లా కాదన్న కామెంట్స్ వినపడుతున్నాయి.

Tags:    

Similar News