మొత్తానికి సోనియాను వెనక్కి నెట్టేసిన జగన్ ?

సరిగ్గా పదేళ్ళ క్రితం నాడు కేంద్రంలో అధికారంలో ఉన్న యూపే సర్కార్ ని ఒక కుర్ర ఎంపీగా జగన్ ఎదిరించారు. యూపీయే చైర్ పర్సన్ సోనియా గాంధీని [more]

Update: 2020-11-30 12:30 GMT

సరిగ్గా పదేళ్ళ క్రితం నాడు కేంద్రంలో అధికారంలో ఉన్న యూపే సర్కార్ ని ఒక కుర్ర ఎంపీగా జగన్ ఎదిరించారు. యూపీయే చైర్ పర్సన్ సోనియా గాంధీని ఏమీ కాకుండా నిలదీశారు. అలా కొండని ఢీ కొట్టి జైలు పాలు అయ్యారు. క్యాలండర్లో అలా కాలం గిర్రున తిరిగేసరికి యూపీయే పతనమై సోనియా గాంధీ ఇపుడు ఏమీ కాకుండా అయ్యారు. జగన్ ఏపీ సీఎం గా తిరుగులేని మెజారిటీతో అధికారాన్ని అనుభవిస్తున్నారు. ఇక జాతీయ స్థాయిలో కూడా తనదైన వినూత్న పాలనతో జగన్ ర్యాంకులు అందుకుంటున్నారు.

మోడీ తరువాత ప్లేస్…

జగన్ కి దేశంలో అందరి ముఖ్యమంత్రుల కంటే ప్రజాదరణ అధికంగా ఉందని ఇప్పటికే పలు సర్వేలు నిరూపించాయి. సామాజిక మాధ్యమాల్లో ఎక్కువగా ట్రెండింగులో ఉండే సీఎం ఎవరా అంటే మళ్ళీ జగనే ముందుకు వచ్చారు. దేశంలో ప్రజాకర్షణలో మోడీకి ఇప్పటిదాకా సరిసాటి ఎవరూ లేరు. ఆయన సోషల్ మీడియా చాంపియన్ గా తొలి స్థానంలో ఉంటే జగన్ ఆ తరువాత సీటు నాదేనని చెప్పేశారు. ఇక సోనియా గాంధీ, రాహుల్ గాంధీ జగన్ తరువాత సీట్లో సర్దుకోవాల్సి వచ్చింది. ఆగ‌స్టు నుంచి అక్టోబ‌ర్ వ‌ర‌కు సోష‌ల్ మీడియా టాప్ ట్రెండ్స్‌ను చెక్‌బ్రాండ్ సంస్థ అధ్యయ‌నం చేసి ఓ నివేదిక వెలువ‌రించింది. ఈ మూడు నెల‌ల్లో దేశంలో 95 మంది టాప్ పొలిటిక‌ల్ లీడ‌ర్లు, 500 మంది అత్యున్నత ప్రభావితం చేయ‌గ‌ల వ్యక్తుల‌కు సంబంధించి వివిధ సోష‌ల్ మీడియా వేదిక‌ల్లో ట్రెండ్స్‌ను ఆ సంస్థ విశ్లేషించిందని చెబుతున్నారు.

జాతీయ యవనికపై….

జగన్ జాతీయ రాజకీయాలను విశేషంగా ప్రభావితం చేస్తున్నారు. ఆయన పాలనాపరంగా తీసుకుంటున్న అనేక విప్లవాత్మకమైన నిర్ణయాలు దేశంలో తరచూ చర్చకు వస్తున్నాయి. ఇక తాజాగా న్యాయ వ్యవస్థలో సంస్కరణలు రావాలని జగన్ ఏకంగా సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ బాబ్డేకు రాసిన ఒక లేఖతో జాతీయ హీరో అయిపోయారు. జగన్ మీద ఓ దశలో ప్రతీ ప్రముఖ నేషనల్ చానల్ లో డిబేట్లు జరిగాయి. చేసిన పని ఒప్పా తప్పా అన్న దాని మీద రోజుల తరబడి హాట్ హాట్ డిస్కషన్స్ జరిగాయి. దాంతో ట్రెండింగులో ఉన్న ఓకే ఒక పేరు జగన్ అయ్యారు. మోడీ అయితే 28 రాష్ట్రాలకు పెద్ద, మరి జగన్ కేవలం 13 జిల్లాలకు మాత్రమే సీఎం. అయినా కూడా అయన జాతీయ తెరను ఆయన ఆకట్టుకున్నారంటే గ్రేటే అని చెప్పాలిగా.

దూకుడుతోనే అలా…?

జగన్ దూకుడు రాజకీయాలనే నమ్ముకున్నారు. తాను అనుకున్నది చేయడమే ఆయనకు అలవాటు, ఒక విధంగా జగన్ సీఎం అయ్యాక ట్రెడిషనల్ పాలిటిక్స్ కి బ్రేకులు వేస్తున్నారు. బోల్డ్ గా ఉంటూ పాలిటిక్స్ ఎలా చేయవచ్చో చూపిస్తున్నారు. ఇంతవరకూ ఎవరూ టచ్ చేయని ఏరియాలను కూడా జగన్ ఎటువంటి సంకోచం లేకుండా టచ్ చేస్తున్నారు. ఇది రిస్క్ అని అంతా భావించిన వాటితోనే ఆటాడుకోవడం ద్వారానే జగన్ నేషనల్ వైడ్ కొత్త ట్రెండ్ క్రియేట్ చేశారని అంటున్నారు. ఇక జగన్ యువ సీఎం. ఇప్పటిదాక సీఎంలుగా పనిచేసిన వారు ఒకే రకమైన కల్చర్ తో ఒకే రకమైన ప్రోటోకాల్ కి అలవాటు పడి పాలన సాగించారు. జగన్ తనదైన మార్క్ ని క్రియేట్ చేస్తూ ఇలా కూడా చేయవచ్చు. ఇలా కూడా మన వ్యవస్థలలోని తప్పులను నిగ్గదీయవచ్చు అని దారి చూపిస్తున్నారు. మరి రానున్న రోజుల్లో జగన్ మార్గదర్శిగా మారుతారా అన్నది చూడాలి. ఏది ఏమైనా జగన్ జగన్ ఇపుడు మోడీ తరువాత నేషనల్ లెవెల్ లో బిగ్ హీరో అయ్యారన్నది వాస్తవం.

Tags:    

Similar News