ఉత్తరానికి రారాజు ఆయనే.. జగన్ డిసైడ్ చేశారు

జగన్ కొన్ని విషయాల్లో అచ్చం చంద్రబాబునే అనుసరిస్తున్నారు. రాజకీయంగా ముదురు అయిన బాబు 2014లో అధికారంలోకి వచ్చాక వైసీపీ గెలిచిన చోట్ల టీడీపీ వారిని ఇంచార్జిలుగా చేసి [more]

Update: 2020-11-27 02:00 GMT

జగన్ కొన్ని విషయాల్లో అచ్చం చంద్రబాబునే అనుసరిస్తున్నారు. రాజకీయంగా ముదురు అయిన బాబు 2014లో అధికారంలోకి వచ్చాక వైసీపీ గెలిచిన చోట్ల టీడీపీ వారిని ఇంచార్జిలుగా చేసి వారినే అసలైన ఎమ్మెల్యేలుగా గుర్తించారు. వారికే నిధులు మంజూరు చేస్తూ అభివృద్ధి పనులనీ కూడా వారి చేతుల మీదుగానే నడిపించారు. ఇక అదే ఫార్ములను బాబుని నిండారా వ్యతిరేకించే జగన్ కూడా అందుకున్నారు. జగన్ సైతం ఎక్కడిక్కడ టీడీపీ ప్రాబల్యానికి అడ్డుకట్ట వేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ఓడిన వారికే ఆయా సీట్లలో డీఫ్యాక్టో ఎమ్మెల్యేలుగా అధికారాలను కట్టబెడుతున్నారు.

గంటా డమ్మీ….

ఇక విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి నాలుగు వేల స్వల్ప మెజారిటీతో గెలిచిన టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఏడాదిన్నరగా నియోజకవర్గం ముఖం చూడడంలేదు. ఆయన టీడీపీ ఆఫీస్ గడప తొక్కడం లేదు. ఆయన పూర్తిగా ఏకాంతవాసానికి పరిమితం అయిపోయారు. దాంతో ఆయన మీద ఓడిన వైసీపీ అభ్యర్ధి కేకే రాజు ఇపుడు దూకుడు పెంచారు. ఆయన్నే ఇంచార్జిగా నియమించడంతో పట్టు పెంచుకుంటారు. అంతే కాదు. పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలు ఒంటి చేత్తో చేపడుతున్నారు. అధికారులను పిలిచి సమీక్షలు కూడా నిర్వహిస్తున్నారు. దీంతో గంటా డమ్మీగా మారారని అంటున్నారు.

జగన్ హామీ….

ఇక ఉత్తర నియోజకవర్గం అభివృద్ధి పనుల గురించి కూడా కేకే రాజు ఈ మధ్యనే ముఖ్యమంత్రి జగన్ ని కలిశారు. మొత్తం సమస్యల చిట్టా కూడా విప్పారు. అందుకు అవసరమైన నిధులను ఇవ్వాలని కోరారు. దానికి జగన్ సైతం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే కాకుండా అధికారులను పిలిచి మరీ ఏం కావాలో అక్కడ చేయాలని ఆదేశించారు. దీంతో ఇపుడు రాజు రెట్టించిన ఉత్సాహంతో ఉన్నారు. తాను చేసిన పనులే వచ్చే ఎన్నికల్లో గెలిపిస్తాయని ఆయన అంటున్నారు. చిత్రమేంటంటే టీడీపీ నాయకులు ఇక్కడ ఉన్నా కూడా సరైన నాయకుడు లేకపోవడం వల్ల వారు సైతం పనుల కోసం రాజునే ఆశ్రయించాల్సి వస్తోంది.

వదిలేసినట్లేనా…?

మిగిలిన చోట్ల ఇదే రకమైన ఇబ్బందులు ఉంటే టీడీపీ ఎమ్మెల్యేలు కలెక్టర్ కి ఫిర్యాదు చేస్తున్నారు. అధికారులు ప్రోటోకాల్ పాటించడంలేదని ఆరోపిస్తున్నారు. తాముండంగా వైసీపీ నేతల పెత్తనమేంటని కొంత అయినా గొంతు విప్పుతున్నారు. కానీ గంటా విషయం వేరు. ఆయన మౌనమే నా భాష అంటున్నారు. గెలిపించిన ప్రజలను, పార్టీని కూడా వదిలేశారు. మరి వచ్చే ఎన్నికల్లో కొత్త సీటుని ఆయన వెతుక్కుంటారో లేక వేరే జిల్లాకు మారుతారో కానీ ప్రస్తుతానికి మాత్రం ఆయన ఉత్తరం వైపు కనీసంగా కూడా చూడడంలేదు. దాంతో వైసీపీ నేత రాజు ఉత్తరానికి నిజమైన రాజుగా మారిపోయారు. ఏ వైసీపీ నేతకూ లేని సౌకర్యం ఆయనకు గంటా అలా ఇచ్చేశారు. ఓడినా ఎమ్మెల్యేగా ఆయన హవా చలాయిస్తున్నారు.

Tags:    

Similar News