అందుకే జగన్ కు వారిపై అంత నమ్మకం

ఏపీ ముఖ్యమంత్రి జగన్ పాలనలో బీజీగా ఉన్నా పార్టీలో ఎవరికీ అన్యాయం జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాటు చేసుకున్నారు. తనకు అత్యంత నమ్మకస్తులైన వారికే నియామకాల బాధ్యతలను జగన్ [more]

Update: 2020-10-26 05:00 GMT

ఏపీ ముఖ్యమంత్రి జగన్ పాలనలో బీజీగా ఉన్నా పార్టీలో ఎవరికీ అన్యాయం జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాటు చేసుకున్నారు. తనకు అత్యంత నమ్మకస్తులైన వారికే నియామకాల బాధ్యతలను జగన్ అప్పగించారన్న టాక్ విన్పిస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో 56 బీసీ కులాల కార్పొరేషన్లకు ఛైర్మన్లు, 612 మంది డైరెక్టర్లను నియామకం చేపట్టారు. ఇందులో ఎలాంటి వివాదం లేకుండా పోవడానికి కారణం జగన్ తీసుకున్న ముందు జాగ్రత్త చర్యలేనని పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

అన్ని జిల్లాలకు ప్రాతినిధ్యం…..

56 బీసీ కులాలకు కార్పొరేషన్లతో పాటు, డైరెక్టర్ల పదవులను అన్ని జిల్లాల నుంచి ఎంపిక చేయాలని జగన్ భావించారు. పార్టీకి విధేయతగా పనిచేసే వారికి ఈ పోస్టుల్లో నియమించాలన్నది జగన్ ఆలోచన. దీంతో తొలుత ఎమ్మెల్యేల నుంచి ప్రతిపాదనలను తెప్పించుకోవాలనుకున్నారు. కానీ ఎమ్మెల్యేలు తమకు అనుకూలంగా ఉండే వారి పేర్లనే ప్రతిపాదించే అవకాశముందని భావించిన జగన్ వారి ప్రమేయం ఇందులో లేకుండా చూడాలని భావించారు.

ఎమ్మెల్యేలను నొప్పించకుండా…..

ఎమ్మెల్యేలను నొప్పించకుండా వారి అభిప్రాయం తీసుకుంటూనే తమ పని ముగించాలన్నది జగన్ ప్రధాన ఉద్దేశం. ఇందుకోసం తనకు అత్యంత విధేయులైన బీసీ నేతలు మోపిదేవి వెంకట రమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ లను వినియోగించుకున్నారు. వారిద్దరూ గత అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి పాలయినా ఎమ్మెల్సీ చేసి మంత్రి పదవి ఇచ్చారు. అలాగే శాసనమండలి రద్దు చేద్దామని నిర్ణయించుకున్న తర్వాత ఆ ఇద్దరినీ రాజ్యసభకు పంపారు. అలా వారిపై జగన్ కు అంత నమ్మకం ఉందంటారు.

మంత్రుల సిఫార్సులను సయితం…..

అందుకే వారిద్దరూ జిల్లాల్లో పర్యటించి వాస్తవ పరిస్థితులను అక్కడి ఎమ్మెల్యేలను అడిగి తెలుసుకోవడంతో పాటు స్థానిక నాయకుల అభిప్రాయాలను కూడా సేకరించారు. అందుకే అన్ని జిల్లాల నుంచి ప్రాతినిధ్యం లభించింది. ఎమ్మెల్యేలు వద్దన్న వారికి కూడా పదవులు వచ్చాయి. అలాగే ఎమ్మెల్యేలు సిఫార్సులు చేసిన వారికి కూడా కొందరికి పదవులు దక్కలేదు. దాదాపు రెండు నెలలకు పైగానే కసరత్తులు చేసిన తర్వాత నివేదికను జగన్ కు అందించారు. మంత్రుల మాటలను కూడా పక్కన పెట్టి వారిచేతనే ప్రకటన చేయించారట జగన్. మొత్తం మీద పదమూడు జిల్లాల్లో పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారిని గుర్తించి వారికి పదవులు ఇవ్వగలిగారు జగన్.

Tags:    

Similar News