జగన్ ఇక్కడ మాత్రం ఫుల్లు సక్సెస్ అయినట్లేనట

మొత్తానికి వైఎస్ జగన్ ఒక విషయంలో సక్సెస్ అయినట్లే. చంద్రబాబు వ్యవస్థలను ఎలా మేనేజ్ చేస్తారన్న విషయం కేవలం కొన్ని వర్గాల ప్రజలకు మాత్రమే తెలుసు. తాజాగా [more]

Update: 2020-10-24 11:00 GMT

మొత్తానికి వైఎస్ జగన్ ఒక విషయంలో సక్సెస్ అయినట్లే. చంద్రబాబు వ్యవస్థలను ఎలా మేనేజ్ చేస్తారన్న విషయం కేవలం కొన్ని వర్గాల ప్రజలకు మాత్రమే తెలుసు. తాజాగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు జగన్ లేఖ రాయడంతో చంద్రబాబు విషయాన్ని గ్రౌండ్ లెవల్లోకి తీసుకెళ్లగలిగారంటున్నాయి వైసీపీ శ్రేణులు. ఇటీవల సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు జగన్ లేఖ రాయడం జాతీయంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే.

భిన్నవాదనలను విన్పిస్తున్నా…..

దీనికి సంబంధించి భిన్న వాదనలు విన్పిస్తున్నాయి. కొందరు లేఖను బహిర్గతం చేయడం తప్పని అంటుంటే.. ప్రశాంత్ భూషణ్ వంటి సీనియర్ న్యాయవాదులు జగన్ చేసింది కరెక్టేనని అంటున్నారు. జాతీయ మీడియా కూడా ఈ అంశానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడంతో న్యాయవ్యవస్థలపై జగన్ చేస్తున్న పోరాటం క్షేత్రస్థాయిలోకి వెళ్లింది. దీంతో పాటు చంద్రబాబు గత కొన్నేళ్లుగా వ్యవస్థలను మేనేజ్ చేస్తున్న తీరునుకూడా సమర్థవంతంగా జగన్ ప్రజల్లోకి తీసుకెళ్లగలిగారంటున్నారు.

అన్ని తీర్పులూ……

వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి హైకోర్టు దగ్గర నుంచి సుప్రీంకోర్టు వరకూ అన్ని తీర్పులూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తున్నాయి. అయితే తొలినాళ్లలో దీనిని పెద్దగా అనుమానించలేదు. ప్రభుత్వ నిర్ణయాల్లో లోపం అయి ఉంటుందని సరిపెట్టుకున్నారు. దీనికితోడు న్యాయమూర్తుల ఫోన్లు ట్యాప్ అవుతున్నాయంటూ ఎల్లో మీడియాలో వార్తలు రావడం కూడా దీనికి లింకుగానే వైసీపీనేతలు చూశారు.

క్షేత్రస్థాయిలోకి…..

ఇలా చంద్రబాబు ఒక వ్యవస్థను అడ్డంపెట్టుకుని పాలనను అడ్డుకుంటున్నారని జగన్ అనుమానించారు. దాదాపు పది నెలలు ఓపిక పట్టిన జగన్ చివరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎన్వీ రమణపై చీఫ్ జస్టిస్ కు లేఖ రాశారు. దీనికితోడు సోషల్ మీడియా ద్వారా కూడా చంద్రబాబు ఎలా వ్యవస్థలను మేనేజ్ చేయగలుతున్నారన్న అంశాన్ని బలంగా క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లారు. ఇప్పటి వరకూ కొద్దోగొప్పో న్యాయవ్యవస్థపైన ప్రజలకు నమ్మకముంది. ఇలాంటి సంఘటనలతో దానిపై కూడా ప్రజల్లో ఉన్న భ్రమలు తొలగిపోతాయని అంటున్నారు. మొత్తం మీద వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబు దిట్ట అన్న విషయాన్ని సామాన్య ప్రజలకు చేరవేసే విషయంలో మాత్రం జగన్ సక్సెస్ అయ్యారనే చెప్పాలి.

Tags:    

Similar News