వస్తానంటున్నా …. వద్దంటున్నారటగా.. జగన్ స్ట్రాంగ్ డెసిషన్

ఈ ఒక్క విషయంలో జగన్ ఫర్మ్ గా ఉన్నారు. గతంలో తనను కాదని వెళ్లిన వారి విషయంలో కటువుగానే ఉండాలని జగన్ నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం ఏపీలో జగన్ [more]

Update: 2020-09-27 14:30 GMT

ఈ ఒక్క విషయంలో జగన్ ఫర్మ్ గా ఉన్నారు. గతంలో తనను కాదని వెళ్లిన వారి విషయంలో కటువుగానే ఉండాలని జగన్ నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం ఏపీలో జగన్ బలంగా ఉన్నారు. 151 మంది ఎమ్మెల్యేలతో స్ట్రాంగ్ గా ఉన్న జగన్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు కండువా అనధికారికంగా కప్పేందుకు ఉత్సాహం చూపుతున్నారు. ఇప్పటికే నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు అనధికారికంగా వైసీపీలో చేరిపోయారు.

గతంలో పార్టీని వీడిన వారు….

ఇదే సమయంలో గతంలో పార్టీని వీడి వెళ్లిన వారు తిరిగి వైసీపీలో చేరేందుకు ఉత్సాహం చూపుతున్నారు. కానీ జగన్ మాత్రం వీరి ఎంట్రీకి నో చెబుతున్నట్లు తెలుస్తోంది. గతంలో 23 మంది ఎమ్మెల్యేలు టీడీపీలో చేరి జగన్ కు ఝలక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. వారిలో నలుగురు మంత్రులు కూడా అయ్యారు. మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి బీజేపీలో చేరిపోయారు. అఖిలప్రియ, అమర్ నాధ్ రెడ్డిలు టీడీపీలో ప్రస్తుతం యాక్టివ్ గా ఉన్నారు. సుజయ కృష్ణ రంగారావు మాత్రం తిరిగి వైసీపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారు.

పదిహేను మంది వరకూ……

ఆయనతో పాటు మరో పదిహేను మంది మాజీ ఎమ్మెల్యేలు వైసీపీలో చేరేందుకు రెడీ అవుతున్నారు. గతంలో పార్టీని వీడి వెళ్లిని అక్కడ టీడీపీ నేతలు వారికి సహకరించకపోవడం ఒక కారణమైతే, టీడీపీ బలహీన పడటం కూడా మరొక కారణం. మాజీ ఎమ్మెల్యేలు పాలపర్తి డేవిడ్ రాజు, ముత్తముల అశోక్ రెడ్డి, గిడ్డి ఈశ్వరి, వంతల రాజేశ్వరి, చాంద్ పాషా, జలీల్ ఖాన్ వంటి వారు తిరిగి వైసీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు.

కఠిన నిర్ణయమేనట…..

వారి ప్రాంతాల్లో మంత్రుల ద్వారా, వైసీీపీ సీనియర్ నేతల ద్వారా ప్రయత్నాలు జోరుగా చేస్తున్నారు. గతంలో పార్టీని వీడిన వారిలో ఎస్.వి.మోహన్ రెడ్డిని మాత్రమే పార్టీలో తిరిగి చేర్చుకున్నారు. అదీ ఎన్నికలకు ముందు వచ్చినందునే. ఇప్పుడు కర్నూలు నియోజకవర్గంలో ప్రస్తుత ఎమ్మెల్యే, ఎస్వీ మోహన్ రెడ్డికి మధ్య వార్ నడుస్తుంది. గతంలో పార్టీని వీడిన వారి విషయంలో కఠినంగా ఉండాలని జగన్ నిర్ణయించారు. వారి విషయంలో ఎవరూ తన వద్ద ప్రస్తావన చేయవద్దని జగన్ సీరియస్ గా చెప్పినట్లు తెలుస్తోంది. వారిని చేర్చుకుని నియోజకవర్గాల్లో అనవసర తలనొప్పులు తెచ్చుకోవడం ఎందుకని జగన్ భావిస్తున్నారు. అందుకే వారికి నోచెబుతున్నారని తెలుస్తోంది.

Tags:    

Similar News