నో డౌట్.. జగన్ ను రౌండప్ చేస్తున్నారు

రాష్ట్రంలో ప్రస్తుతం నెల‌కొన్న ప‌రిణామాలు.. ఓ మ‌తం కేంద్రంగా సీఎం జ‌గ‌న్ ప్రభావాన్ని త‌గ్గించే ప్రయ‌త్నం చేస్తున్నాయా ? మ‌తం సెంట్రిక్‌గా జ‌గ‌న్‌ను తీవ్రస్థాయిలో ఇబ్బంది పెట్టేలా [more]

Update: 2020-09-17 06:30 GMT

రాష్ట్రంలో ప్రస్తుతం నెల‌కొన్న ప‌రిణామాలు.. ఓ మ‌తం కేంద్రంగా సీఎం జ‌గ‌న్ ప్రభావాన్ని త‌గ్గించే ప్రయ‌త్నం చేస్తున్నాయా ? మ‌తం సెంట్రిక్‌గా జ‌గ‌న్‌ను తీవ్రస్థాయిలో ఇబ్బంది పెట్టేలా వ్యూహాత్మకంగా ప‌రిస్థితులు మారుతున్నాయా ? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. ఎన్నిక‌ల‌కు ముందు కూడా జ‌గ‌న్‌ను క్రిస్టియ‌న్‌గా ప్రచారం చేశారు. హిందూ దేవుళ్లంటే ఆయ‌న‌కు వ్యతిరేక‌మ‌ని ప్రచారం చేశారు. తిరుమ‌ల వెళ్లిన‌ప్పుడు కూడా ఆయ‌న డక్లరేష‌న్ ఇవ్వలేదంటూ.. ఓ వ‌ర్గం మీడియా తీవ్రస్థాయిలో దుయ్యబ‌ట్టింది.

ఇప్పడే ఆ పరిస్థితులున్నాయా?

ఇక‌, ఇప్పుడు అంత‌ర్వేది ల‌క్ష్మీన‌ర‌సింహ‌స్వామి ఆల‌యంలో ర‌థం ద‌గ్ధం కావ‌డం స‌హా.. తాజాగా విజ‌య‌వాడ క‌న‌క‌దుర్గ దేవాల‌యంలో వెండి ర‌థానికి సంబంధించిన నాలుగు వెండి సింహాల ప్రతిమ‌ల్లో మూడు అదృశ్యం కావ‌డం వంటి ఘ‌ట‌న‌లు జ‌గ‌న్ స‌ర్కారుకు ఇబ్బందిగా మారాయ‌నే వాద‌న వ‌స్తోంది. ఇక‌, తిరుమ‌ల‌లోనూ అప‌చారాలు జ‌రుగుతున్నాయ‌ని, శ్రీకాళ‌హ‌స్తిలో బ‌య‌ట నుంచి తెచ్చిన శివ‌లింగాన్ని ఏర్పాటు చేశార‌ని.. ఇలా.. జ‌గ‌న్‌ను హిందువులు ఈస‌డించుకునే రేంజ్‌లో ప్రచారం జ‌రుగుతుండ‌డం గ‌మ‌నార్హం. అయితే, ఈ ప‌రిస్థితి ఇప్పుడు మాత్రమే ఉందా? మ‌త ప్రచారం, మ‌త ప‌ర‌మైన విమ‌ర్శలు కేవలం జ‌గ‌న్‌కు మాత్రమే ప‌రిమిత‌మ‌య్యాయా? అంటే.. కాద‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు.

మీడియానే తొక్కిపెట్టిందా?

గ‌తంలో చంద్రబాబు ప్రభుత్వంలోనూ ఇలాంటి ఆరోప‌ణ‌లు వ‌చ్చాయ‌ని.. అయితే. అప్పట్లో చంద్రబాబు అనుకూల మీడియా వీటిని ప్రొజెక్టు చేయ‌క‌పోవ‌డంతో పెద్దగా విమ‌ర్శలు రాలేద‌ని అంటున్నారు. అప్పట్లోనూ.. క్రిస్టియ‌న్లపై దాడులు జ‌రుగుతున్నాయ‌ని, చ‌ర్చిల‌ను కూల‌గొడుతున్నార‌ని.. అప్పట్లో బాబు స‌ర్కారుపై ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. అదేస‌మ‌యంలో తిరుమ‌ల‌లో అన్యమ‌త ప్రచారం జ‌రుగుతోంద‌ని కూడా పెద్ద ఎత్తున విమ‌ర్శలు వ‌చ్చాయి. అయితే, బాబుకు మ‌ట్టి అంట‌కుండా ఆయ‌న అనుకూల మీడియా వీటిని ప‌క్కకు త‌ప్పించింది.

ఇప్పుడు మాత్రం…..?

ఇక‌, ఇప్పుడు మాత్రం.. జ‌గ‌న్‌కు వ్యతిరేకంగా క‌థ‌నాలు రాయ‌డ‌మే కాకుండా.. రాజ‌కీయంగా ఆయ‌న‌ను డైల్యూట్ చేసేందుకు కూడా ప్రయ‌త్నాలు సాగుతున్నాయి. ఈ క్రమంలోనే మ‌త‌ప‌ర‌మైన విష‌యాల‌ను ప్రధానంగా ప్రస్తావిస్తున్నార‌నే వాద‌న ఉంది. ప్రధానంగా బీజేపీ, టీడీపీలు ఒక మతాన్ని జగన్ కు దూరం చేయాలన్న ఉద్దేశ్యంతోనే వేగంగా పావులు కదుపుతున్నాయి. ఈ పదహారు నెలల్లోనే జరుగుతున్న సంఘటనలు ఎందుకు హైలెట్ అవుతున్నాయి. ముఖ్యమంత్రిగా ఎక్కువ కాలం ఉండాలని కోరుకునే జగన్ ఈ రకమైన చర్యలను ఎందుకు ప్రోత్సహిస్తారు? తెలివైన రాజకీయ నాయకుడు ఎవరూ వీటిని ప్రోత్సహించరు. ఏదేమైనా.. ప‌క్క రాష్ట్రం తెలంగాణ‌లో లేని విధంగా ఏపీలో మాత్రం మ‌తం విష‌యం.. అప్పట్లో చంద్ర‌బాబును, ఇప్పుడు జ‌గ‌న్‌ను ఇక్కట్ల పాల్జేస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Tags:    

Similar News