ఎమ్మెల్యేల మీద నిఘా పెట్టిన జగన్ ?

జగన్ కష్టార్జితం వైసీపీకి ఏపీలో అధికారం. అలా ఇలా కాకుండా 151 సీట్లతో ఏపీ పీఠం మీద జగన్ కూర్చున్నాడు అంటే దానికి నూటికి తొంబై సాతం [more]

Update: 2020-09-19 14:30 GMT

జగన్ కష్టార్జితం వైసీపీకి ఏపీలో అధికారం. అలా ఇలా కాకుండా 151 సీట్లతో ఏపీ పీఠం మీద జగన్ కూర్చున్నాడు అంటే దానికి నూటికి తొంబై సాతం ఆయన ఇమేజ్, ఆయన పట్టుదల కారణం అని ఎవరైనా చెబుతారు. ఇక ముఖ్యమంత్రిగా కూడా జగన్ వన్ మ్యాన్ షో చేస్తూ జనంలో దూసుకుపోతున్నారు. అయితే ఎంత అధినాయకుడి ప్రతిష్ట. బలం ఉన్నా కూడా లోకల్ గా ఎమ్మెల్యేలు కూడా ఎంతో కొంత పాత్ర పోషిస్తారు కదా. వారి పనితీరు మీద జనం చూపు సారిస్తారు కదా. వారు అపసవ్యంగా ఉంటే జగన్ ముఖ్యమంత్రిగా ఎంత కష్టపడుతున్నా కూడా అది సత్ఫలితాలు ఇవ్వదు కదా. ఇప్పటికి జగన్ కి ఈ సంగతి బోధపడిందని పార్టీలో అంటున్నారుట.

నివేదికలు రెడీ….

తాను ప్రతీ రోజూ అధికారులను ముందరేసుకుని సమీక్షకు చేస్తూ పాలన చేస్తూంటే పార్టీకు ప్లస్ కాదని జగన్ మెల్లగా గ్రహింపునకు వచ్చారని అంటున్నారు. తనతో పాటు మంత్రులు పనిచేయాలి. వారు రోజూ కళ్ల ముందు కనిపిస్తారు కాబట్టి జగన్ నేరుగానే డైరెక్షన్లు ఇస్తున్నారు. ఇక ఎమ్మెల్యేలు చూస్తే ఒకరా ఇద్దరా. వందల్లో ఉన్నారు. వారిని కూర్చోబెట్టి మాట్లాడే తీరిక ఇంకా జగన్ కి చిక్కడంలేదు. దాంతో వారి పనితీరు ఎలా ఉందో తెలుసుకోవాలనుకుంటున్నారుట. దాని కోసం నివేదికలు తయారు చేసే పనిలో ఇంటలిజెన్స్ అధికార యంత్రాంగం ఉందని అంటున్నారు.

వారితోనే అంతా ……

ఎమ్మెల్యేలు ఒక ప్రభుత్వానికి ఫేస్ లాంటి వారు అన్నది తెలిసిందే. చంద్రబాబు కూడా ఎమ్మెల్యేలది ఏముంది తన ఫేస్ వాల్యూ చూసి జనాలు ఓటేస్తారు అని భ్రమించేవారు. ఆయన మూడు సార్లు ముఖ్యమంత్రి అయినా కూడా ఎమ్మెల్యేలకు పెద్దగా విలువ ఇవ్వలేదనే ఇప్పటికీ తమ్ముళ్ళు మాట్లాడుతూంటారు. మరి బాబు పరాజయాల వెనక ఉన్న కారణాలు తెలుసుకుని వైసీపీని తీర్చిదిద్దుకోవాలన్న ఆలోచన జగన్ కి కలగడం మంచి పరిణామమే. వైసీపీలో కొందరు ఎమ్మెల్యేల మీద ఇటీవల కాలంలో ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఎటూ ప్రభుత్వం ఏడాదిన్నర పాలన ముంగిట ఉంది. నెమ్మదిగా అసంతృప్తి జనాల్లో పెరిగే అవకాశం ఇపుడే ఉంటుంది. దాంతో జగన్ జాగ్రత్త పడుతున్నారని అంటున్నారు.

వార్నింగులేనా…?

ఎమ్మెల్యేలు సరిగ్గా పనిచేయకపోయినా, ఆరోపణల్లో ఇరుక్కున్నా కూడా వారిని పిలిచి వార్నింగు ఇవ్వడానికి జగన్ రెడీ అవుతున్నారుట. పార్టీకి చెడ్డ పేరు తెచ్చి జనాల్లో పరువు తీసే వారి విషయంలో కఠినంగానే ఉండాలని జగన్ డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశ పెడుతోంది. వాటిని జనాల్లోకి తీసుకువెళ్ళి పార్టీకి మైలేజ్ తీసుకువచ్చేలా ఎమ్మెల్యేలు పనిచేస్తున్నారా లేదా అన్నది కూడా జగన్ చూస్తారని అంటున్నారు. బాగా పనిచేసిన ఎమ్మెల్యేలను గుర్తు పెట్టుకుంటూనే దారి తప్పిన వారిని లైన్ లో పెట్టడానికి జగన్ యాక్షన్ ప్లాన్ రెడీ చేశారని అంటున్నారు. అదే కనుక జరిగితే మాత్రం ఎమ్మెల్యేలు ఇప్పటి నుంచే గీత దాటకుండా ఉండడం బెటరేమో.

Tags:    

Similar News