బాబును దెబ్బకొట్టాలనుకుని…?

రాజకీయాలు అంటేనే చాలా చిత్ర విచిత్రం. మయసభ మాదిరిగా అగుపిస్తాయి. ఒక్కోసారి లేనిది ఉన్నట్లుగా, ఉన్నది లేనట్లుగా కనిపిస్తుంది. ఇక జగన్ మనసంతా చంద్రబాబే ఉంటారు. అదువల్ల [more]

Update: 2020-09-12 03:30 GMT

రాజకీయాలు అంటేనే చాలా చిత్ర విచిత్రం. మయసభ మాదిరిగా అగుపిస్తాయి. ఒక్కోసారి లేనిది ఉన్నట్లుగా, ఉన్నది లేనట్లుగా కనిపిస్తుంది. ఇక జగన్ మనసంతా చంద్రబాబే ఉంటారు. అదువల్ల ఆయన ఏది చేసిన బాబును దెబ్బకొట్టడానికే మొదటి ప్రాధాన్యత ఇస్తారు. అనేక ఎన్నికల ద్వారా ఏపీలో సోష‌ల్ ఇంజనీరింగ్ చేయడంలో తానే దిట్టనని బాబు నిరూపించుకున్నారు. ఆయన ఎత్తులను పసిగట్టిన జగన్ తాను కూడా ఆ విద్యలో ఆరితేరాననిపించుకున్నారు. ఏపీలో టీడీపీ వెనెకాల ఉన్న బీసీలను లాగేసి బాబు పార్టీని 23 సీట్లకే పరిమితం చేశారు.

శాశ్వతమనుకుని….

ఇదే ఊపులో బీసీలను శాశ్వతంగా తనవైపునే ఉంచుకోవాలని జగన్ చేస్తున్న ప్రయత్నాల్లో సక్సెస్ రేటు ఎంత ఉంటుందో తెలియదు కానీ ఆయన‌ ఈ పరుగుపందెంలో మిగిలిన వారిని అందరినీ దూరం చేసుకుంటున్నారు. ఏపీలో కులాల కంపు చంద్రబాబు హాయంలో ఎక్కువగా ఉందని అంతా అనుకునేవారు. దాన్ని మించేలా జగన్ బీసీ జపం ఉందని సొంత పార్టీలోనే విమర్శలు ఉన్నాయి. జగన్ ప్రభుత్వం పదవులు ఇవ్వాలంటే బీసీలే కొలమానంగా పెట్టుకుంటోంది. జగన్ లెక్కలు వేరు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు కలుపుకుంటే బాహుబలిగా వైసీపీ మారుతుందని అంచనా వేస్తున్నారు.

ఓసీలు దూరమే….

కాంగ్రెస్ పార్టీఎకి ఓసీలు వెన్నుదన్ను, వారు వైఎస్సార్ టైంలో మరింతగా దగ్గర చేరారు. దానికి వైఎస్సార్ విధానాలే కారణం. ఫీజు రీఇంబర్స్ మెంట్ అన్న పధకం ఎక్కడైనా దేశంలో నాడు ఉందా? అది కూడా కులాలకు మతాలకు అతీతంగా వైఎస్సార్ పెట్టడంతో ఓసీలే ఎక్కువగా బాగుపడ్డారు. అలాగే ఆరోగ్యశ్రీ కూడా. అంతే కాదు ఇళ్ల నిర్మాణం పెద్ద ఎత్తున చేస్తూ పోయారు. ఇక రాజకీయ పదవులు కానీ నామినేటెడ్ పోస్టులు కానీ వైఎస్సార్ సీఎంగా ఉండగా ఓసీలకే ఎక్కువగా దక్కాయి. దాంతో వారంతా హ్యాపీగా ఉండేవారు.

షాక్ తగిలితే ….?

బీసీల ఓటు బ్యాంక్ ఎపుడూ టీడీపీకి పెట్టని కోటే. ఒకే ఒక ఎన్నిక అదీ 2019లోనే వైసీపీ వైపుగా ర్యాలీ అయింది. దానికి అనేక కారణాలు ఉన్నాయి. బాబు ఆ అయిదేళ్లూ కాపులను బీసీల్లో చేరుస్తామని లేనిపోని హామీలు గుప్పించి వారి జపం చేశారు. బీసీలు ఎటూ తమవైపే కదా అని కడు ధీమా ప్రదర్శించారు. దాంతోనే వారంతా బాబుని వదిలి వైసీపీ వైపు చూశారు. అలా టీడీపీ పెట్టాక తొలిసారి వారు పసుపు పార్టీకి దెబ్బకొట్టారు. 2024 ఎన్నికలకు ఆ పరిస్థితి ఉంటుందా? అంటే చెప్పలేమనే అంటున్నారు. బీసీలు గుత్తమొత్తంగా వైసీపీకి ఓటు వేసే సీన్ ఉండకపోవచ్చు. మరి వారినే నమ్ముకుని ఓసీలను, తనను వైఎస్సార్ ని దశాబ్దాల తరబడి అట్టిపెట్టుకుని ఉన్న రెడ్లను, ఇతర అగ్ర కులాలను జగన్ కనుక దూరం చేసుకుంటే రాజకీయంగా గట్టి షాకులు తగులుతాయి అన్న విశ్లేషణలు ఉన్నాయి. జగన్ మరీ బీసీల జపం చేయకుండా ఓసీలను అక్కున చేర్చుకుంటూ బ్యాలన్స్ చేస్తేనే సేఫ్ జోన్ లో ఉంటారని అంటున్నారు.

Tags:    

Similar News