సారీ.. మాట తప్పుతున్నా…!!

వైఎస్ జగన్ మాట ఇస్తే తప్పరంటారు. అయితే ఒక విషయంలో మాత్రం ఆలోచన చేస్తున్నారంటున్నారు. జగన్ కొందరు మంత్రుల వ్యవహార శైలి పట్ల ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. [more]

Update: 2019-11-04 08:00 GMT

వైఎస్ జగన్ మాట ఇస్తే తప్పరంటారు. అయితే ఒక విషయంలో మాత్రం ఆలోచన చేస్తున్నారంటున్నారు. జగన్ కొందరు మంత్రుల వ్యవహార శైలి పట్ల ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. కనీసం సొంత జిల్లాను కూడా వారు పట్టించుకోవడం లేదన్న ఇంటలిజెన్స్ నివేదికలతో జగన్ వారిని సాగనంపాలని నిర్ణయించుకున్నట్లు పార్టీలో పెద్దయెత్తున ప్రచారం జరుగుతోంది. వైఎస్ జగన్ వైఎస్సార్సీఎల్పీ సమావేశంలోనే రెండున్నరేళ్ల తర్వాత మంత్రివర్గ విస్తరణ మళ్లీ చేపడతానని సంచలన ప్రకటన చేశారు.

రెండున్నరేళ్ల పాటు….

ప్రస్తుతమున్న మంత్రివర్గంలో 90 శాతం మార్పులు ఉంటాయని అప్పుడే జగన్ చెప్పారు. దీంతో వీరంతా రెండున్నరేళ్ల మంత్రులే అన్న ఫీలింగ్ వచ్చింది. అయితే 151 మంది శాసనసభ్యులు గెలవడం, వారిలో ఎక్కువ మంది సీనియర్లు ఉండటంతో అందరికీ అవకాశం కల్పించాలన్నది జగన్ ఆలోచన. ఇది బాగానే ఉన్నట్లు అన్పించింది. కానీ మొదటి విస్తరణ లో జగన్ ఎంపిక సరిగా లేదనిపిస్తోంది. తొలినాళ్లలో పరుగులు పెట్టాల్సిన మంత్రులు వెనకబడి పోతున్నారు. నీరసంగా తయారయ్యారు. పార్టీని, ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకోవడంలో విఫలమవుతున్నారు.

కొందరిపై అసంతృప్తి…..

అందుకే ఇటీవల జరిగిన మంత్రి వర్గ సమావేశంలో మంత్రులపై జగన్ సీరియస్ అయ్యారు. కొందరు మంత్రులయితే నియోజకవర్గానికి మాత్రమే పరిమితమవుతున్నారు. ఎక్కువ మంది జూనియర్లు కావడంతో జిల్లాలో సీనియర్లకు భయపడి జిల్లా పాలిటిక్స్, పార్టీపై దృష్టి సారించడం లేదు. అంతేకాదు గోటితో పోయే వివాదాలు ముదిరిపోతున్నాయి. అంతటి శక్తి సామర్థ్యాలు లేకపోవడం వల్లనే జిల్లాల్లో పార్టీలో గ్రూపుల గోల ఎక్కువయింది. అందుకే ఈమధ్య ఇన్ ఛార్జి మంత్రులను కూడా మార్చారు.

ఆలస్యం చేస్తే….

కానీ కొందరు మంత్రుల విషయంలో ఇక ఆలస్యం చేస్తే అసలుకే ఎసరు వస్తుందని జగన్ భావిస్తున్నారు. అందుకోసమే కొందరిని మంత్రివర్గం నుంచి తప్పించాలని కూడా నిర్ణయించుకున్నారు. అందుకోసమే మొన్నటి మంత్రి వర్గ సమావేశంలో చూచాయగా కొందరికి సంకేతాలు ఇచ్చినట్లు అర్థమవుతుంది. ఐదు నెలలు గడుస్తున్నా వీరిలో మార్పు రాకపోవడంతో జగన్ వేటు వేయాలని నిర్ణయించుకున్నారు. మొత్తం మీద రెండున్నరేళ్లు అనుకున్నది ఆరు నెలల్లోనే జగన్ కొందరిని మార్చేస్తారన్న టాక్ పార్టీలో జోరుగా నడుస్తుంది.

Tags:    

Similar News