నానా తిట్లు తిట్టినా నవ్వుతూనే?

రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరని అంటారు. కానీ వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ మనస్తత్వం అలా కాదు అని చెబుతారు. ఆయన తన శత్రువులను బాగా గుర్తు [more]

Update: 2019-10-08 12:30 GMT

రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరని అంటారు. కానీ వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ మనస్తత్వం అలా కాదు అని చెబుతారు. ఆయన తన శత్రువులను బాగా గుర్తు పెట్టుకుంటారని కూడా అంటారు. ముఖ్యంగా వర్తమాన రాజకీయాలకు జగన్ చాలా భిన్నం చెబుతారు. అదే చంద్రబాబు లాంటి రాజకీయ నాయకులు అయితే ఇదంతా మామూలే అని అంతా సరిపెట్టుకుంటారు కానీ జగన్ ఈ విషయంలో పట్టు సడలిస్తూండడంతోనే వైసెపీ నేతలు షాక్ తింటున్నారు. జగన్ ని నానా మాటలు అన్న వారు ఇపుడు వైసీపీ గూటికి చేరుతున్న్నారు. వారందరికీ కండువాలు కప్పి జగన్ స్వయంగా ఆహ్వానం పలుకుతున్నారు. దీని అసలైన కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు

జూపూడి రీ ఎంట్రీ…..

ఇదిలా ఉండగా టీడీపీ నేత జూపూడి ప్రభాకరరావు వైసీపీలోకి రీ ఎంట్రీ ఇవ్వడాన్ని సొంత పార్టీ వారే తప్పుపడుతున్నారు. జూపూడి టీడీపీ నేతగా జగన్ ని వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకుని చాలా విమర్శలు చేయడాన్ని వారు గుర్తు చేసుకుంటున్నారు. జగన్ వెంట ఉన్న జూపూడికి మంచి ప్రాధాన్యత పార్టీలో దక్కిందని, జగన్ సైతం ఆయన్ని చేరదీసి 2014 ఎన్నికల్లో పార్టీ టికెట్ కూడా ఇచ్చారని చెబుతున్నారు. టికెట్ దక్కినా గెలుపు సొంతం కాకపోవడంతో జూపూడి మంచి రోజు చూసుకుని అప్పట్లో అధికారంలోకి వచ్చిన టీడీపీలో చేరిపోయారు. ఆ తరువాత జూపూడి గత అయిదేళ్ళుగా జగన్ మీద చేసిన విమర్శలు అన్నీ ఇన్నీ కావు. జగన్ ఎప్పటికీ సీఎం కాలేడంటూ హాట్ కామెంట్స్ చేసిన జూపూడి జగన్ పాదయాత్రలు ఎన్ని చేసినా అధికార పీఠం దక్కదని కూడా జోస్యం చెప్పారు. ఇక జగన్ ని ప్రతీ రోజూ టార్గెట్ చేసి విమర్శలు చేసిన ఆయన ఈ రోజు పార్టీలో చేరడం వెనక అధికార దాహం మాత్రమే ఉందని వైసీపీ నేతలు అంటున్నారు. ఆయన్ని చేర్చుకుని జగన్ తప్పుచేశారని కూడా అంటున్నారు.

జగన్ మారిపోయారా…?

ఇదిలా ఉండగా జగన్ ఇపుడు ఫక్తు పొలిటీషియన్ గా మారిపోయారా అన్న ప్రశ్నలు కూడా ఉదయిస్తున్నాయంటున్నారు. ఒకపుడు జగన్ ని ఒక్క మాట అంటే ఆయన జీవితంలో ముఖం చూడలేమని భయపడేవారు. ఇపుడు నానా రకాలుగా తిట్టినా జగన్ చేర్చేసుకుంటూండడంతో ఆయన సైతం బాబు తరహా రాజకీయాలకు అలవాటు పడ్డారని అంటున్నారు. దీంతో గతంలో జగన్ ని తిట్టి బయటకు పోయిన వారు సైతం అధికారంలో ఉన్న వైసీపీలో చేరేందుకు రెడీ అవుతున్నారని టాక్ నడుస్తోంది. మరి జగన్ వీరందరినీ చేర్చుకుని పదేళ్ల పాటు పార్టీ కోసం కష్టపడిన వారికి షాకిస్తారా అన్న డౌట్లు కూడా వస్తున్నాయట. మొత్తానికి రాజకీయం అంటే అంతేనేమో, ఎవరు వచ్చినా అది తనలాగే మార్చేస్తుందని కొంతమంది తలపండిన వైసీపీ నేతలు వేదాంతం వల్లిస్తున్నారు.

Tags:    

Similar News