సినీ పెద్దలు చేరుతున్నారుగా…?

తెలుగు సినిమా రంగం వైసీపీకి ఎంతో దూరం అన్నది నిన్నటి మాట. ఇపుడు ఆ దూరాలు చెరిగిపోతున్నాయి. అనుబంధాలు పెరిగిపోతున్నాయి. తాజాగా సినీ పెద్దలు కొంతమంది ముఖ్యమంత్రి [more]

Update: 2020-03-04 00:30 GMT

తెలుగు సినిమా రంగం వైసీపీకి ఎంతో దూరం అన్నది నిన్నటి మాట. ఇపుడు ఆ దూరాలు చెరిగిపోతున్నాయి. అనుబంధాలు పెరిగిపోతున్నాయి. తాజాగా సినీ పెద్దలు కొంతమంది ముఖ్యమంత్రి జగన్ ని కలసి చర్చలు జరపడం ఆసక్తిగకరమైన పరిణామంగా ఉంది. టాలీవుడ్ లో టాప్ నిర్మాతగా ఉన్న సురేష్ సంస్థ అధినేత దగ్గుబాటి సురేష్ బాబు, మరో బడా నిర్మాత శ్యాం ప్రసాద్ రెడ్డి, నల్లమలుపు బుజ్జి వంటి వారు జగన్ని కలసి చాలా సేపు మాట్లాడారు. అందులో ముఖ్యమైనది విశాఖలోని హుదూద్ తుఫాన్ టైంలో నష్టపోయిన మత్స్యకారులకు పక్కా ఇళ్ళు నిర్మించింది టాలీవుడ్. వాటిని ప్రారంభించాలని సీఎం జగన్ ని వారు కోరారు. దానికి జగన్ కూడా సరేనన్నారు.

అలా మొదలైంది…..

ఇంతకు ముందు మెగాస్టార్ చిరంజీవి సతీసమేతంగా జగన్ ని కలసి ఆయన చేతుల మీదుగా ఘనమైన అతిధి మర్యాదలు పొందారు. ఆ తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి నమ్రత జగన్ సతీమణి భారతిని కలుసుకున్నారు. ఇపుడు బడా నిర్మాతలు జగన్ తో భేటీ వేశారు. మొత్తానికి టాలీవుడ్ నెమ్మదిగా వైసీపీ సర్కార్ కళ్ళలో పడేందుకు ఆరాటపడుతోందని అర్ధమవుతోంది. జగన్ సైతం వచ్చిన వారిని సాదరంగా మర్యాద చేస్తున్నారు. వారి సమస్యలు వింటున్నారు. రాష్ట్ర పెద్దగా భరోసా ఇస్తున్నారు.

ట్విస్ట్ ఇలానా….?

ఇక టాలీవుడ్ పెద్దలు జగన్ ని భేటీ కావడం వెనక కొన్ని రాజకీయాలు కూడా ఉన్నాయని వినిపిస్తోంది. ఈ మధ్య కేసీఆర్ సర్కార్ మెగాస్టార్ చిరంజీవిని, మరో టాలీవుడ్ సీనియర్ హీరో నాగార్జునని దగ్గరకు తీస్తోంది. వారితోనే మొత్తం సినీ పరిశ్రమ అంతా ఉందన్నట్లుగా బిల్డప్ ఇచ్చేలా భేటీలు జరుగుతున్నాయి. ఆ భేటీలకు మరో ప్రముఖుడు దగ్గుబాటి సురేష్ కి ఎటువంటి ఆహ్వానం రాలేదు. దీంతో ఆయన గుస్సా అయ్యారని ఇన్నర్ టాక్. దానికి పోటీ అన్నట్లుగా ఇపుడు హఠాత్తుగా సురేష్ ఇతర నిర్మాతలు జగన్ ని కలిశారని అంటున్నారు. కేసీఆర్ కూడా మెగాస్టార్ , నాగ్ లను జగన్ వైపు మళ్ళకుండా కట్టడి చేశారని ప్రచారం సాగుతోంది. ఈ పరిణామాలతోనే అలెర్ట్ అయిన సురేష్ ఎటువంటి మొహమాటాలు లేకుండా జగన్ తో భేటీ అయి టాలీవుడ్ పెద్దలం తామేనని చెప్పకనే చెప్పారని అంటున్నారు.

విశాఖపైనే ….?

ఇక విశాఖను పాలనా రాజధానిగా జగన్ ప్రకటించారు. రెండు దశాబ్దాల క్రితమే దగ్గుబాటి రామానాయుడు భీమిలీలో స్టూడియో నిర్మించారు. అక్కడ సినీ ప్రముఖులకు పెద్ద ఎత్తున భూములు కూడా ఉన్నాయి. అందుకే చిరంజీవి కూడా విశాఖకు జై కొట్టారని అంటారు. ఇపుడు చిరంజీవి కేసీయార్ అభిమానం జల్లుల్లో తడుస్తున్నారు. దాంతో సురేష్ టీం జగన్ తో సాన్నిహిత్యాన్ని పెంచుకుంటోంది. జగన్ కి కూడా ఇది అవసరమే. సినీ రంగంలోని పెద్దలు ముందుకు వస్తే మేలు చేయడానికి జగన్ కూడా రెడీగా ఉన్నారు. విశాఖలో సినీ పరిశ్రమ ఏర్పాటు వైసీపీ అజెండాలో ఉంది. మొత్తానికి టాలీవుడ్ లో రాజకీయాలు కూడా రెండుగా చీలడంతో వైసీపీ, వర్సెస్ టీఆరెస్ గా కూడా వ్యవహారం సాగుతోందని అంటున్నారు. ఈ భేటీ మీద తెలంగాణా మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ స్పందిస్తూ అది మంచి పరిణామమేనని అనడం విశేషం. ఏది ఏమైనా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు సినీ రంగానికి మేలు చేయలనుకుంటున్నాయి. దాంతో ఎన్నడూ లేని విధంగా టాలీవుడ్ కి డిమాండ్ వచ్చిపడుతోంది.

Tags:    

Similar News