ఇద్దరి ఆలోచనలకు కరోనా బ్రేక్ వేసినట్లేనా?

కరోనా వైరస్ ఇపుడు ప్రపంచవ్యాప్తంగా ఇదే గోల. భయంతో కూడిన కలవరం, ఆ వెంటనే అనేక సందేహాలతో జనం కరోనా అంటూ కంగారు పడుతున్నారు. కరోనా ఏలికల [more]

Update: 2020-03-26 15:30 GMT

కరోనా వైరస్ ఇపుడు ప్రపంచవ్యాప్తంగా ఇదే గోల. భయంతో కూడిన కలవరం, ఆ వెంటనే అనేక సందేహాలతో జనం కరోనా అంటూ కంగారు పడుతున్నారు. కరోనా ఏలికల నుంచి పరిచారికల వరకూ వారూ వీరూ అన్న తేడా లేకుండా వణికిస్తోంది. కరోనా వైరస్ ని అరికట్టడం ఇపుడు తక్షణ కర్తవ్యంగా మారిపోయింది. ముందుగా వేసుకున్న ప్లాన్లూ, ప్రణాళికలూ అన్నీ ఒక్కసారిగా సైడ్ అయిపోయాయి. ఏపీలో ముఖ్యమంత్రి జగన్ యక్షన్ ప్లాన్ అయితే పూర్తిగా గజిబిజి అయిపోగా. కేంద్రంలో మోడీ ఆలోచనలు సైతం కరోనా దూసుకురావడంతో కొట్టుకుపోయాయి.

ఇప్పటికి ఆగినట్లే…

గత నాలుగు నెలలుగా దేశంలో ఒకటే ఆందోళన. అదే ఉమ్మడి పౌర పట్టిక విషయంలో. అలాగే జాతీయ జనగణనపైన కూడా విపక్షాలు ఒక్క గొంతుకతో అడ్డుకుంటున్నాయి. ఈ నేపధ్యంలో ఎట్టి పరిస్థితుల్లో భారత్ లో జనగణన జరపాలని మోడీ సర్కార్ నిర్ణయించింది. ఆ తరువాత వీలువెంబడి ఎన్నార్సీని కూడా అమలు చేయాలనుకుంది. అయితే అన్నింటికీ గండి కొడుతూ కరోనా వైరస్ ముందుకు వచ్చేసింది. దాంతో కొంతకాలం వాయిదా మాత్రం తప్పలేదు.

జగన్ అలా…..

ఇక జగన్ విషయం తీసుకుంటే ఆయన విశాఖను రాజధాని చేసుకోవాలనుకుంటున్నారు. దాని కోసమే గత నాలుగు నెలలుగా యాక్షన్ ప్లాన్ ముందు పెట్టుకుని వేగంగా కదులుతున్నారు. అయితే ఇంతవరకూ రాజకీయంగా, న్యాయపరంగానే జగన్ చిక్కులు ఎదుర్కొన్నారు. వాటిని కూడా అధిగమించి తాను అనుకున్న లక్ష్యాలను చేరుకోవాలనుకుంటే ఇపుడు ఏకంగా పెను విపత్తు కరోనా రూపంలో వచ్చింది. దాంతో జగన్ సైతం వెనక్కితగ్గాల్సివచ్చింది. పైగా పేదలకు ఇళ్ళ పట్టాల పంపిణీ వంటి జగన్ ప్రాణప్రదమైనా కార్యక్రమాలను కూడా ఆపుకోవాల్సి వచ్చింది.

ఇబ్బందులేనా…?

ఇంకా నాలుగేళ్ళ అధికారం చేతిలో ఉండడంతో ఇవన్నీ ఇప్పటి నుంచి సర్దుకోవాలని అటు మోడీ, ఇటు జగన్ అనుకున్నారు. అందుకే విపక్షాల విమర్శలు సైతం ఖాతరు చేయకుండా దూకుడుగా ముందుకు సాగారు. అయితే కరోనా మాత్రం మీ కోరికలు ఆపుకోండి అంటూ ఒక్కసారిగా స్పీడ్ బ్రేక్ వేసేసింది. దీంతో ఇక కొంతకాలమైనా తమ అజెండాను పక్కన పెట్టుకోవాల్సిందే. ఏది ఏమైనా జగన్, మోడీ వంటి వారి మనస్తత్వం తెలిసిన వారు ఇవాళ కాకపోతే రేపు అయినా తన అజెండాను అమలుచేయడానికి సిధ్ధపడతారని అంటున్నారు. ఏది ఏమైనా కరోనా టైం ఇది. అందుకే దాన్ని ముందు తరిమికొట్టాల్సిందే. అంతవరకూ మరే అజెండా ఎవరికీ లేదూ, కూడదు కూడా.

Tags:    

Similar News