అందుకే బాబు అంత కంఫర్ట్ గా ఉంటారట

మీడియాను ఎలా డీల్ చేయాలో చంద్రబాబుని చూసే అంతా నేర్చుకోవాలి. ఆయన వ్యతిరేక వార్తలను సైతం తనకు అనుకూలంగా మార్చుకుంటారు. అయితే బాబుకు తెలుగు రాష్ట్రాల్లో మెజారిటీ [more]

Update: 2020-03-28 05:00 GMT

మీడియాను ఎలా డీల్ చేయాలో చంద్రబాబుని చూసే అంతా నేర్చుకోవాలి. ఆయన వ్యతిరేక వార్తలను సైతం తనకు అనుకూలంగా మార్చుకుంటారు. అయితే బాబుకు తెలుగు రాష్ట్రాల్లో మెజారిటీ మీడియా అడుగులకు మడుగులు ఒత్తుతుంది. దాంతో ఆయన మీడియా బేబీగా పేరు కూడా తెచ్చుకున్నారు. ఆయనతో పోలిస్తే ఆ రేంజిలో మీడియాతో రాసుకు పూసుకు తిరిగిన నేతలు లేరు ఇక ఏపీలో చంద్రబాబు శకానికి తాత్కాలికంగా బ్రేక్ పడింది. అక్కడ కేసీఆర్. ఇక్కడ జగన్ తెలుగు ప్రజల ఇలవేలుపుగా ఏలుతున్నారు. అయితే చిత్రమేంటంటే ఈ ఇద్దరు నేతలు కూడా మీడియాకు బహుదూరం. వారు అనుకుంటేనే మాట్లాడుతారు. అది కూడా వారు చెప్పాలనుకున్నదే చెబుతారు. దానికి ఒక ప్రశ్న అదనంగా వచ్చినా వారు సమాధానం చెప్పరు. అంతే.

జగన్ అలా….

జగన్ ముఖ్యమంత్రి అయ్యాక మీడియా మీటింగు పెట్టింది ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చలవ వల్లనే. ఆయన‌ ఆగ్రహం చల్లార్చుకోవడానికి మీడియా అక్కరకు వచ్చింది. దాంతో హఠాత్తుగా పిలిచి మరీ మీడియా మీటింగు పెట్టారు. అయితే అక్కడ జగన్ తాను చెప్పాల్సింది చెప్పేసి తిట్టాల్సిన వారిని తిట్టేసి వెళ్ళిపోయారు. మీడియా ప్రశ్నలు నోట్లో ఉండగానే జగన్ సీట్లోకి లేచిపోయారు. ఇక రెండో ప్రెస్ మీట్ కరోనా మీద పెట్టారు. అది కూడా షరా మామూలే. జగన్ లాక్ డౌన్ గురించి తాను చెప్పాల్సింది చెప్పేశారు. అంతే లేచి వెళ్ళిపోయారు. అయితే జగన్ ని నిలువరిస్తూ విలేకరులు ప్రశ్నలు అడగడంతో ఆయన ఇక చాలు. నేను ఇదే చెబుతాను. మిగిలినది మా వాళ్ళు బ్రీఫ్ చేస్తారంటూ సున్నితంగా చెప్పేశారు.

కేసీఆర్ ఇలా…

ఇక ఫార్మ్ హౌస్ సీఎం అని కేసీయార్ కి పేరు. ఉద్యమ కాలంలో ఆయన మీడియాను ఎంత వాడుకున్నారో సీఎం అయ్యాక అంతగా దూరం పెడుతూ వచ్చారు. ఇక ఆయన కరోనా తెలంగాణాలో తీవ్రమయ్యాక తరచూ మీడియా మీటింగులు పెడుతున్నారు. అయితే ఆయన సైతం తాను చెప్పాల్సింది చెప్పేసి రాసేసుకోమంటున్నారు. మీడియా ఏవైనా ప్రశ్నలు వేస్తే ఆయన చికాకు పడుతున్నారు. చిల్లర ప్రశ్నలు ఇది సమయమా అని చిటపటలాడుతున్నారు. ఇపుడు కరోనా మీదనే అంతా దృష్టి. నో మోర్ క్వశ్చన్స్ అంటూ వెళ్ళిపోతున్నారు. ఇక ఈ మధ్య మీడియా సమావేశంలో కేసీఆర్ కొంత ఆగ్రహం వ్యక్తం చేశారు కూడా.

ఫేస్ చేయలేరా…?

మీడియా అంటే ప్రజల నుంచి వచ్చిన వారే. ఓ విధంగా వారే ప్రజల గొంతుకలు. వారు అన్నీ అనుకూలంగా ప్రశ్నలు వేయరుగా. జనంలో ఉన్న ఇబ్బందులు పాలకుల ద్రుష్టికి తీసుకురావాలనుకుంటారు. అది తప్పు ఎలా అవుతుంది. దాన్ని ఫేస్ చేసి తాము చెప్పాల్సింది చెబితే హుందాగా ఉంటుంది. జనాలు కూడా వీటిని గమనిస్తారు. ఎస్కేపిజంతో నేతలు ఉన్నా కూడా జనాలకు ఇట్టే తెలిసిపోతుంది. ఏది ఏమైనా చంద్రబాబులా మరీ అలా దగ్గరకు తీయనక్కరలేదు. మరీ దూరంగానూ పెట్టక్కరలేదు. మీడియాను కూడా విశ్వాసంలోకి తీసుకుంటే ఏలిన వారికే లాభమూ. ప్రయోజనమూ కూడా.

Tags:    

Similar News