ఇద్దరు ముఖ్యమంత్రులు మళ్లీ కలవనున్నారా?

పోతిరెడ్డి పాడు ప్రాజెక్టు ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య వివాదం రేపింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ ముఖ్యమంత్రి జగన్ లు తమ రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఈ [more]

Update: 2020-06-07 12:30 GMT

పోతిరెడ్డి పాడు ప్రాజెక్టు ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య వివాదం రేపింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ ముఖ్యమంత్రి జగన్ లు తమ రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని చెబుతున్నారు. గతంలో ఇద్దరు ముఖ్యమంత్రులు జగన్, కేసీఆర్ లు సఖ్యతగా ఉండేవారు. అనేక సార్లు నీటి సమస్యలపైనే సమావేశమయ్యారు. గోదావరి జిలాల మళ్లింపు ఇద్దరు ముఖ్యమంత్రులు చర్చించుకున్నారు.

పోతిరెడ్డి పాడు తర్వాత….?

కానీ ఏపీ ప్రభుత్వం జీవో నెంబరు 203 విడుదల చేసిన తర్వాత రెండు రాష్ట్రాల మధ్య జలవివాదం రాజుకుంది. ప్రధానంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఫైర్ అయ్యారు. ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని కోరారు. తాము న్యాయపరంగా దీనిపై పోరాటం చేస్తామని కేసీఆర్ చెప్పారు. జగన్ తీసుకున్న నిర్ణయంపై కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు కు ఫిర్యాదు కూడా చేశారు.

తాము నిర్మిస్తామంటూ….

ఏపీ ముఖ్యమంత్రి జగన్ కూడా పోతిరెడ్డిపాడు విషయంలో ఒక స్టాండ్ తీసుకుని ఉన్నారు. తాము వరద జలాలను మాత్రమే వాడుకుంటామని, కేటాయింపులకు మించి వాడుకోమని చెప్పారు. వృధాగా పోతున్న నీటిని వినియోగించుకుంటే ఎవరికి అభ్యంతరం అని జగన్ ప్రశ్నించారు. పోతిరెడ్డి పాడు ప్రాజెక్టు సామర్థ్యం పెంచుతామని స్పష్టం చేశారు. కృష్ణా, గోదావరి బోర్డు మీటింగ్ లలోనూ ఇరు రాష్ట్రాలు ఒకరి ప్రాజెక్టులపై మరొకరు ఫిర్యాదు చేసుకున్నారు.

త్వరలోనే సమావేశం…..

ఈ నేపథ్యంలో త్వరలో ఇద్దరు ముఖ్యమంత్రులు జగన్, కేసీఆర్ లు సమావేశమవ్వాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలోనే అపెక్స్ కౌన్సైిల్ కమిటీ మీటింగ్ ఉంది. ఈ మీటింగ్ జరిగే లోపే జగన్, కేసీఆర్ లు కలసి సమావేశమై ఇక్కడే పరిష్కరించుకోవాలని భావిస్తున్నారు. ఈ మేరకు తేదీ ఖరారు కాకపోయినప్పటికీ త్వరలోనే జగన్, కేసీఆర్ ల సమావేశం జరుగుతుందని చెబుతున్నారు. ఇద్దరూ కలసి సమస్యకు పరిష్కారం దిశగా ప్రయత్నిస్తే మంచిదే.

Tags:    

Similar News