ఇద్దరూ బోల్తా పడినట్లేనా?

చంద్రబాబు ఫార్టీ యియర్స్ ఇండస్ట్రీ. ఆయనది 70 దశకం రాజకీయం. అందుకే ఆయన ఎపుడూ బ్యాక్ రూం పాలిటిక్స్ చేస్తారని పేరు. జగన్ ఆధునిక రాజకీయాల నుంచి [more]

Update: 2020-01-24 12:30 GMT

చంద్రబాబు ఫార్టీ యియర్స్ ఇండస్ట్రీ. ఆయనది 70 దశకం రాజకీయం. అందుకే ఆయన ఎపుడూ బ్యాక్ రూం పాలిటిక్స్ చేస్తారని పేరు. జగన్ ఆధునిక రాజకీయాల నుంచి వచ్చినవారు. ప్రత్యేకంగా ఈతరం ప్రతినిధి. పైగా ముక్కుసూటిగా ఉండాలనుకుంటారు. ఇక్కడే ఇద్దరి మధ్యన వస్తోంది తంటా. సరే రాజకీయాల్లో ఎవరి పోకడలు వారివి అనుకున్నా కూడా జగన్, బాబు కొన్ని విషయాల్లో మాత్రం ఒకే స్కూల్లో చదివారా అన్న డౌట్లు వస్తాయి.

ఆ కాన్సెప్టే…

నిజానికి రాజధాని చుట్టూ అంతలా జగన్, బాబు పరిభ్రమించడం. అక్కడే ఆలోచనలు చేయడం మేధావివర్గం సైతం తప్పుపడుతోంది. రాజధానికి అంత విలువ ఎందుకు ఇస్తున్నారని కూడా ప్రశ్నిస్తోంది. నిజానికి ఒక రాష్ట్రానికి పాలనకు చక్కని రాజధాని కావాలి. అక్కడ అసెంబ్లీ, సచివాలయం. హైకోర్టు, గవర్నర్ నివాసం, సీఎం, మంత్రుల నివాసాలు ఇవి ఉంటే చాలు. దానికి పరిమితమైన ఖర్చుతో కధ నడిపించుకోవచ్చు. దీంతోనే అభివృధ్ధికి ముడి పెట్టాలనుకోవడమే చంద్ర బాబు, జగన్ చేస్తున్న అతి పెద్ద తప్పు అంటున్నారు.

మహా నగరాలు అలా ….

మరో వైపు దేశంలో చూసుకున్న, ఇతర దేశాల్లో చూసుకున్నా రాజధాని ప్రాముఖ్యతను తగ్గిస్తున్నారు. మహా నగరాలుగా ఉన్నవి అక్కడ రాజధానులు కానేకావు. అవి అభివృధ్ధికి పట్టుకొమ్మలుగా ఉంటున్నాయి. వాటిని వేరే విధంగా విజన్ తో అభివృధ్ధి చేస్తున్నారు. దాంతో రాజధానుల విషయం, ఊసూ జనాలకు తెలియడంలేదు. మరి ఆ విధంగా జగన్, బాబు ఎందుకు ఆలోచన చేయరన్నది అందరి ప్రశ్నగా ఉంది. నయా ముంబై తరహాలోనో కర్నాటక, తమిళనాడులలో ఉన్న ఇతర మహా నగరాల తరహాలో మోడల్ తీసుకుని ఏపీలో కొన్ని ప్రాంతాలను ఎంపిక చేసుకుంటే ఈ తలనొప్పి ఉండదు కదా అని సూచిస్తున్నారు.

రాజధాని అలాగే…

ఇక ఇంత పెద్ద వివాదానికి కారణమవుతున్న అమరావతి రాజధానిని అక్కడే ఉంచడం బెటర్. పైగా ఒక్క పైసా ఖర్చు లేకుండా జగన్ రానున్న అయిదేళ్ళ పాటు అక్కడ నుంచే పాలన సాగించే వీలు కూడా ఉంది. విశాఖ విషయనికి వస్తే ఇది మహానగరమే. దాన్ని అభివృధ్ధి చేసుకోవడంపైన వైసీపీ సర్కార్ దృష్టి సారించాలి. అలాగే బాగా కష్టపడితే కర్నూలు, తిరుపతి, రాజమండ్రి, నెల్లూరు, వంటివి కూడా నగరాలుగా, మహా నగరాలుగా అభివృద్ధి చేయవచ్చు. వివిధ ప్రాంతాల అభివృధ్ధి కోసం కమిషనరేట్లను బీసీజీ, జీఎన్ రావు కమిటీ నివేదికలు ప్రతిపాదించాయి. వాటిని అనుసరించి ఎక్కడ ఏ పరిశ్రమ పెడితే లోకల్ గా అభివృధ్ధి చెందుతుందో ఆలోచన చేయాలి. జగన్ ఈ విషయంలో బాబు కంటే వేరేగా ఆలోచన చేయాలి. మహా నగరాలను, రాజధానిని ముడిపెట్టి చూస్తే పాత కాన్సెప్ట్ ని వదిలేయాలి. అపుడే ఏపీ డెవలప్మెంట్ పరుగులు తీస్తుంది.

Tags:    

Similar News