జగన్ అలా రివెంజ్ తీర్చుకున్నారా

వైఎస్ జగన్ అంటే మాట ఇస్తే తప్పడు, మడమ తిప్పడు అంటారు. ఆయన వ్యవహార శైలి ఇపుడు కొత్తగా ఏపీ జనాలకు చెప్పాల్సింది కూడా ఏమీ లేదు. [more]

Update: 2019-08-05 03:30 GMT

వైఎస్ జగన్ అంటే మాట ఇస్తే తప్పడు, మడమ తిప్పడు అంటారు. ఆయన వ్యవహార శైలి ఇపుడు కొత్తగా ఏపీ జనాలకు చెప్పాల్సింది కూడా ఏమీ లేదు. సుదీర్ఘ పాదయాత్రలో వైఎస్ జగన్ ని దగ్గరగా చూసారు, ఆయన మాటలు విన్నారు, ఆయన ఏమిటో స్వయంగా తెలుసుకున్నారు. ఇపుడు ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ పాలనను కూడా చూస్తున్నారు. మరి వైఎస్ జగన్ లో మరో కోణం కూడా వుంది. తనకు మేలు చేసిన వారిని ఎంతలా గుర్తు పెట్టుకుంటారో తనకు కీడు చేసిన వారిని కూడా అంతకు పదింతలు వైఎస్ జగన్ గుర్తు పెట్టుకుంటారుట. సమయం సందర్భం వచ్చినపుడు అప్పు తీర్చినట్లుగా బదులు ఇచ్చేస్తారట. ఇపుడు దీని మీదనే చర్చ సాగుతోంది. ఏపీలో టీడీపీ హయాంలో అవినీతి జరిగిందని వైఎస్ జగన్ ప్రాజెక్టులు ఆపడంతో పాటు ప్రజా వేదికను కూల్చడం వంటివి చేపట్టిన తీరులో కొంత రివెంజ్ ఉందని అంటారు. దీన్ని టీడీపీ తమ్ముళ్ళైతే చలవలు పలవలు అల్లి వేరేగా ఘాటైన విమర్శలు కూడా చేస్తూ వచ్చారు.

ఆ ఖాకీలకు అంతేనా…

ఇవన్నీ ఒక ఎత్తు అయితే వైఎస్ జగన్ రివెంజ్ ఫలితాన్ని స్వయంగా అనుభవిస్తున్నారుట విశాఖలోని ఆ ఖాకీలు. వారు అప్పటి సీఎం చంద్రబాబుకు అనుకూలంగా పనిచేసి ఓవయాక్షన్ చేసిన దానికి తగిన ఫలితాన్ని ఇపుడు చవి చూస్తున్నారుట. ఆ కధేంటంటే అది 2017 జనవరి 26. వైఎస్ జగన్ విశాఖలో ప్రత్యేక హోదా గురించి ఆందోళన చేయాలని నిర్ణయించారు. దాని కోసం ఆయన హైదరాబాద్ నుంచి విమానంలో విశాఖ ఎయిర్ పోర్టులో దిగారు. వైఎస్ జగన్ ఇలా వచ్చారో లేదో కానీ సిటీ పోలీసులు ఏకంగా ఎయిర్ పోర్టులోకి వచ్చేసి వైఎస్ జగన్ ని ఆయన వెంట ఉన్న విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, అంబటి రాంబాబు వంటి వైసీపీ పెద్ద నాయకులను నిర్బంధించారు. ఎవరూ ఎయిర్ పోర్టు నుంచి బయటకు పోకుండా గట్టి బందోబస్తు చేపట్టారు. ఆఖరుకు తాము విశాఖలో పార్టీ ఆఫీసుకు వెళ్తామన్నా కూడా వినిపించుకోలేదు. వచ్చినవారు వచ్చినట్లే వెళ్ళిపోవాలని హుకుం జారీ చేశారు. దీంతో మండుకొచ్చిన వైఎస్ జగన్ తాను మరో రెండేళ్ళలో సీఎం అవుతానని ఆనాడు అందరి జాతకాలు చూస్తానని నాడే సిటీ పోలీసులకు గట్టిగా హెచ్చరించారు కూడా. అది మీడియాలోనూ వైఎస్ జగన్ మీద విపరీతమైన నెగిటివ్ ప్రచారంతో వచ్చింది.

సైలెంట్ గా యాక్షన్….

ఇపుడు ఆ ఓవరాక్షన్ పోలీసులకు సైలెంట్ గా శిక్ష పడిందని అంటున్నారు. వైఎస్ జగన్ సర్కార్ ఓరల్ గా ఇచ్చిన ఆదేశాల మేరకు విశాఖ నగర పోలీస్ కమిషనర్ ఆనాడు ఎవరైతే ఎయిర్ పోర్టులో వైఎస్ జగన్ ని అడ్డుకుని దారుణంగా ప్రవర్తించారో గుర్తించి మరీ వారికి శిక్షలు అమలు చేశారు. శిక్షలంటే అవేమీ బయటకు చెప్పుకునేవి కావు, అవి చిత్రంగా ఉంటాయి. అదేలా అంటే
వారికి ఏ డ్యూటీ వేయరు, ఎక్కడికీ పంపరు, అలా వారిని వదిలేస్తారన్న మాట. దీన్ని వేకెన్సీ రిజర్వ్ డ్ అంటారు. అంటే వారిని అలా ఖాళీగా రిజర్వ్ లో ఉంచి కీలక బాధ్యతల నుంచి తప్పించేస్తారన్న మాట. గత నెల 27న సిటీ పోలీసులకు ఈ రకమైన యాక్షన్ తీసుకుంటే ఇప్పటికి అది వెలుగులోకి వచ్చిందట. మరి వారు ఏమైనా మారితేనే తిరిగి బాధ్యత‌లు అప్పగించేది ఉంటుందని అంటున్నారు. మొత్తానికి సైలెంట్ గానే వైఎస్ జగన్ రివెంజ్ తీర్చుకున్నారని అంటున్నారంతా.

Tags:    

Similar News