ఆ ప్రాంతానికి అన్యాయం చేశారుగా?

జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయింది. అయితే జగన్ తన సమాయాన్ని మొత్తం సంక్షేమ పథకాలు అమలు కోసమే కేటాయిస్తున్నారు. అభివృద్ధిని పూర్తిగా పక్కన పెట్టేశారన్న [more]

Update: 2021-06-30 15:30 GMT

జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయింది. అయితే జగన్ తన సమాయాన్ని మొత్తం సంక్షేమ పథకాలు అమలు కోసమే కేటాయిస్తున్నారు. అభివృద్ధిని పూర్తిగా పక్కన పెట్టేశారన్న విమర్శలున్నాయి. ఇందుకు ఉదాహరణ దొనకొండ. దొనకొండ ప్రాంతాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామని అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో జగన్ ప్రభుత్వం చెప్పింది. పరిశ్రమలు కూడా అక్కడకు వస్తున్నాయని ప్రకటించిది. కానీ దొనకొండలో అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడ మాదిరిగానే ఉంది.

రాజధాని అని చెప్పినా?

దొనకొండ అసలు రాజధాని కావాల్సిన ప్రాంతం. శివరామ కృష్ణన్ కమిటీ కూడా అదే సూచించింది. అక్కడ అప్పట్లో వైసీపీ నేతలు పెద్దయెత్తున భూములు కొనుగోలు చేశారు. భూముల ధరలకు అక్కడ రెక్కలు వచ్చాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా పెరిగింది. అయితే చంద్రబాబు మాత్రం అమరావతి రాజధాని చేయడంతో ఇక్కడ భూముల ధరలు ఢమాల్ అన్నాయి. ఆ తర్వాత వచ్చిన జగన్ ప్రభుత్వం దొనకొండపై దృష్టి పెడతామని చెప్పింది.

పారిశ్రామికంగా….

పారిశ్రామికంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి జగన్ సయితం చెప్పారు. అందుకోసం అధికారులతో కమిటీని కూడా వేశారు. దొనకొండకు పరిశ్రమలు వస్తున్నాయని పదే పదే చెప్పారు. దీంతో ఆ ప్రాంత వాసులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ రెండేళ్ల నుంచి దొనకొండను జగన్ ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు. ఇక్కడకు కనీసం ఒక్క మంత్రి అయినా వచ్చి చూసిన పాపాన పోలేదు.

భూముల ధరలు….

దీంతో దొనకొండలో భూముల ధరలు బాగా పడిపోయాయి. ఒకప్పుడు ఎకరా యాభై లక్షలు రూపాయలు చేసిన భూమి ఇప్పుడు రెండు, మూడు లక్షలు చెప్పినా కొనే నాధుడు లేరు. ఇలా దొనకొండ ప్రాంతం రెండు ప్రభుత్వాల నిర్లక్ష్యానికి గురయిందని చెప్పాలి. జగన్ కు దొనకొండ పట్ల సానుకూలత ఉన్నప్పటికీ నిధుల లేమి కారణంగా ఆయన కూడా చేతులెత్తేసినట్లే కన్పిస్తుంది. మొత్తం మీద దొనకొండ ప్రాంతం అన్యాయమైపోయిందన్న కామెంట్స్ వినపడుతున్నాయి.

Tags:    

Similar News