షాక్ ట్రీట్ మెంట్ ఇవ్వబోతున్నారా? అప్పడు గాని సెట్ కాదా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను నేదరుమిల్లి కుటుంబాన్ని విడదీసి చూడలేం. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత ఆయన కుటుంబం నుంచి నేదురుమిల్లి రాజ్యలక్ష్మి మంత్రిగా [more]

Update: 2020-07-03 08:00 GMT

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను నేదరుమిల్లి కుటుంబాన్ని విడదీసి చూడలేం. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత ఆయన కుటుంబం నుంచి నేదురుమిల్లి రాజ్యలక్ష్మి మంత్రిగా పనిచేశారు. తొలి నుంచి నేదురుమిల్లి కుటుంబం కాంగ్రెస్ లోనే ఉంది. ఆ కుటుంబానికి కాంగ్రెస్ లో ప్రత్యేక స్థానం కూడా ఉంది. నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఈ కుటుంబానికి ప్రత్యేక స్థానం ఉంది.

నేదురుమిల్లి కుటుంబం….

అయితే రాష్ట్ర విభజన తర్వాత నేదురుమిల్లి కుటుంబం దాదాపు కనుమరుగైంది. నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గంంలో నేదురుమిల్లి కుటుంబానికి పట్టుంది. అక్కడి నుంచే ఆ కుటుంబం ప్రాతినిధ్యం వహించింది. అయితే ఎన్నికలకు ముందే నేదురుమిల్లి రామ్ కుమార్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనకు వెంకటగిరి సీటు దక్కుతుందని అందరూ భావించారు. అయితే ఆ తర్వాత వచ్చిన ఆనం రామనారాయణరెడ్డికి జగన్ వెంకటగిరి సీటును కేటాయించారు. నెల్లూరు జిల్లాలో వైసీపీ క్లీన్ స్వీప్ చేసేసింది.

ఆనంపై అసంతృప్తి….

తాజాగా జరుగుతున్న రాజకీయ పరిణామాలు నేదురుమిల్లి కుటుంబానికి కలసి వస్తున్నాయని చెబుతున్నారు. ఆనం రామనారాయణరెడ్డిపై జగన్ అసంతృప్తితో ఉన్నారు. ఆయన తరచూ పార్టీని ఇబ్బందుల్లోకి నెడుతూ చేస్తున్న వ్యాఖ్యలు జగన్ కు ఆగ్రహం తెప్పించాయంటున్నారు. సీనియర్ నేత కావడంతో ఆచితూచి ఆనం విషయంలో అడుగులు వేయాలని జగన్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. అందుకే మరోసారి నేదురుమిల్లి రామ్ కుమార్ రెడ్డి పేరు మరోసారి తెరపైకి వచ్చింది.

రానున్న కాలంలో…..

దీంతో రానున్న కాలంలో నెల్లూరు జిల్లాలో నేదురుమిల్లి రాంకుమార్ రెడ్డికి ప్రాధాన్యత ఇవ్వాలని జగన్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. అవసరమైతే వెంకటగిరి నియోజకవర్గ ఇన్ ఛార్జి పదవి ఇవ్వాలని కూడా జగన్ భావిస్తున్నారని పార్టీలో విస్తృతమైన చర్చ జరుగుతోంది. ఇప్పటికే నెల్లూరు జిల్లాలో పార్టీ నేతల మధ్య విభేదాలు తీవ్రంగా ఉండటంతో ఆనం రామనారాయణరెడ్డికి షాక్ ట్రీట్ మెంట్ ఇస్తే గాని గాడిలో పెట్టలేమని జగన్ గట్టిగానే డిసైడ్ అయ్యారని పార్టీ నేతలు చెబుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News