వన్ సైడ్ వెళితే అంతేకదా యోగీ?

వన్ సైడ్ వెళ్లడం ఎప్పుడూ సరికాదు. ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఉత్తర్ ప్రదేశ్ లో ఇదే జరుగుతుంది. యోగీ ఆదిత్యనాధ్ తీసుకున్న నిర్ణయంపై మాజీ ఐఏఎస్ [more]

Update: 2021-01-07 18:29 GMT

వన్ సైడ్ వెళ్లడం ఎప్పుడూ సరికాదు. ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఉత్తర్ ప్రదేశ్ లో ఇదే జరుగుతుంది. యోగీ ఆదిత్యనాధ్ తీసుకున్న నిర్ణయంపై మాజీ ఐఏఎస్ అధికారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు 104 మంది మాజీ ఐఏఎస్ అధికారులు యోగి ఆదిత్యనాధ్ కు లేఖ కూడా రాశారు. వెంటనే ప్రజా వ్యతిరేక ఆర్డినెన్స్ ను ఉపసంహరించుకోవాలని మాజీ ఐఏఎస్ లు ఆ లేఖలో కోరారు.

ఆ ఆర్డినెన్స్ పై…..

యోగీ ఆదిత్యానాధ్ ప్రభుత్వం లవ్ జీహాద్ కు వ్యతిరేకంగా ఆర్డినెన్స్ ను తీసుకు వచ్చింది. మత మార్పిడులకు పాల్పడితే చర్యలు తప్పవని ఈ ఆర్డినెన్స్ ద్వారా యోగి ఆదిత్యనాధ్ ప్రభుత్వం హెచ్చరించింది. ఇప్పటికే ఈ ఆర్డినెన్స్ కింద ఉత్తర్ ప్రదేశ్ లో నమోదవుతున్న కేసులపై మాజీ ఐఏఎస్ లు అభ్యంతరం వ్యక్తం చేశారు. మొరాదాబాద్ లో ఒక యువకుడిని భజరంగ్ దళ్ కార్కకర్తలు కొట్టడమే కాకుండా ఆ యువకుడిపై ఈ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు.

అనేక మందిని వేధిస్తూ…..

ఆ యాక్టును అడ్డం పెట్టుకుని ఉత్తర్ ప్రదేశ్ లో అనేక మంది యువజంటలను భజరంగ్ దళ్ కార్యకర్తలు వెంటపడి వేధిస్తున్నారని మాజీ ఐఏఎస్ అధికారులు యోగి ఆదిత్యనాధ్ కు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఇప్పటికే ఈ యాక్టుపై ఉత్తర్ ప్రదేశ్ లో యోగి ఆదిత్యనాధ్ ప్రభుత్వంపై ఒక వర్గంలో తీవ్ర అసంతృప్తి నెలకొంది. రాజకీయ పార్టీలైన సమాజ్ వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీలు ఈ యాక్ట్ పై పోరాడుతున్నా ఫలితం లేదు.

అభ్యంతరాలు ఎక్కువవుతుండటంతో….

యోగి ఆదిత్యనాధ్ హిందుత్వ అజెండాతో ఆర్డినెన్స్ లను రుద్దుతూ పౌరహక్కులకు భంగం కల్గిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మాజీ ఐఏఎస్ అధికారులే కాదు యోగి ఆదిత్యనాధ్ ప్రభుత్వంలో పనిచేస్తున్న సీనియర్ అధికారులు సయితం దీనిపై ఆఫ్ ది రికార్డుగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలు 2023లో జరగనున్నాయి. మరో రెండున్నరేళ్ల సమయం ఉన్నప్పటికీ యోగి ఆదిత్యనాధ్ తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదంగా మారుతున్నాయి. మరి యోగి ఆదిత్యానాధ్ దీనిపై వెనక్కు తగ్గుతారో? ముందుకు వెళతారో? చూడాల్సి ఉంది.

Tags:    

Similar News