యోగికి భవిష్యత్ లో ఇబ్బందులేనా?

ఉత్తర్ ప్రదేశ్ కు మరో రెండేళ్లలో ఎన్నికలు జరగనున్నాయి. అయితే మూడేళ్ల పాటు ఎలా ఉన్నా యూపీలో జరిగిన హథ్రాస్ ఘటన యోగి ఆదిత్యానాధ్ ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి [more]

Update: 2020-10-11 17:30 GMT

ఉత్తర్ ప్రదేశ్ కు మరో రెండేళ్లలో ఎన్నికలు జరగనున్నాయి. అయితే మూడేళ్ల పాటు ఎలా ఉన్నా యూపీలో జరిగిన హథ్రాస్ ఘటన యోగి ఆదిత్యానాధ్ ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టిందనే చెప్పాలి. ఎన్నికల వరకూ ఈ అంశం ఉంటుందా? లేదా? అని పక్కన పెడితే ప్రస్తుతం ప్రతిపక్షాలకు మాత్రం హథ్రాస్ ఘటన ఊతంలా మారిందని చెప్పవచ్చు. ఈ అంశంతో ప్రజల వద్దకు వెళ్లేందుకు వీలు చిక్కింది. హథ్రాస్ ఘటనపై దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.

మూడేళ్ల పాలనలో…..

గత మూడేళ్ల నుంచి యోగి ఆదిత్యానాధ్ ముఖ్యమంత్రిగా పాలనను సమర్థవంతంగానే నిర్వహిస్తున్నారు. యోగి ఆదిత్యానాధ్ పై ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవు. గోరఖ్ పూర్ మఠ్ లో ఉంటూ రాజకీయాల్లోకి వచ్చిన ఆదిత్యానాధ్ కు ఆ అవసరం కూడా లేదు. ఆయన స్వచ్ఛమైన పాలన అందిస్తారనే ఎంపీగా ఉన్న యోగి ఆదిత్యానాధ్ ను రాజీనామా చేయించి మరీ మోదీ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టారు.

శాంతి భద్రతలపై కూడా…..

తొలి నుంచి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాధ్ పరిపాలనలో అవినీతికి ఎంత మాత్రం తావివ్వలేదు. అలాగే శాంతిభద్రతల విషయంలోనూ ఆయన ఉపేక్షించలేదు. రౌడీషీటర్లు ఎన్ కౌంటర్లు జరుగుతాయేమోనని స్వచ్ఛందంగా పోలీసులకు లొంగిపోతున్నారు. ఈ నేపథ్యంలో హథ్రాస్ ఘటన ఆయనకు తలనొప్పులు తెచ్చిపెట్టిందనే చెప్పాలి. మయావతి నేరుగా ఆయనపై ఆరోపణలు చేశారు. యోగి ఆదిత్యానాధ్ ను గోరఖ్ పూర్ మఠ్ కు పంపాలని మాయావతి డిమాండ్ చేశారు.

సీబీఐకి అప్పగించి…..

మరోవైపు రాహుల్, ప్రియాంక్ లు హథ్రాస్ ఘటన బాధితులను పరామర్శించారు. ప్రియాంక గాంధీ ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరగాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనలపై త్వరలో కాంగ్రెస్ పార్టీ ఆందోళనలను ఉధృతం చేయనుంది. ఈ నేపథ్యంలో యోగి ఆదిత్యానాధ్ హథ్రాస్ ఘటనను సీబీఐకి అప్పగించారు. ఉత్తర్ ప్రదేశ్ లో తాజా పరిస్థితులు యోగి ఆదిత్యానాధ్ ప్రభుత్వానికి అనుకూలంగా ఏమీ లేవనే చెప్పాలి. మొత్తం మీద హథ్రాస్ ఘటన విపక్షాలకు ఒక ఆయుధంగా దొరికిందనే చెప్పాలి.

Tags:    

Similar News