యోగి రచ్చ చేసుకుంటారా…?

యోగీ ఆదిత్యానాధ్ అధిష్టానం వైఖరితో ఇబ్బంది పడుతున్నారు. సాఫీగా సాగిపోతున్న పాలనలో కేంద్ర నాయకత్వం ఇచ్చిన ఆదేశాలు పార్టీ కొంపముంచేలా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ లో ఇప్పుడు మంత్రులు [more]

Update: 2019-08-22 18:29 GMT

యోగీ ఆదిత్యానాధ్ అధిష్టానం వైఖరితో ఇబ్బంది పడుతున్నారు. సాఫీగా సాగిపోతున్న పాలనలో కేంద్ర నాయకత్వం ఇచ్చిన ఆదేశాలు పార్టీ కొంపముంచేలా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ లో ఇప్పుడు మంత్రులు వరసబెట్టి రాజీనామాలు చేస్తున్నారు. అందుకు ప్రధాన కారణం వారి వయస్సు అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 75 సంవత్సరాల వయసు నిండిన వారు భారతీయ జనతా పార్టీ నిబంధనల ప్రకారం ఎటువంటి పదవులు నిర్వహించకూడదు.

రెండున్నరేళ్ల తర్వాత….

ఇప్పుడు ఉత్తర్ ప్రదేశ్ లో అదే విషయంపై పలువురు మంత్రులు రాజీనామా చేయడం చర్చనీయాంశంమయింది. ఉత్తరప్రదేశ్ లో యోగి ఆదిత్యనాధ్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు రెండున్నరేళ్లు గడుస్తోంది. యోగి ఆదిత్యానాధ్ పాలనపై ప్రశంసలతో పాటు విమర్శలు ఉన్నాయి. గత రెండున్నరేళ్లుగా యోగి ఆదిత్యానాధ్ అదే మంత్రివర్గంతో తన పాలనను సాగిస్తున్నారు. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లోనూ బీజేపీ విజయకేతనం ఎగురవేసింది.

వారికి అవకాశం కల్పించాలనేనా?

ీదీంతో తమతో జట్టుకట్టిన పార్టీలకు మంత్రివర్గంలో చోటు కల్పించాలని బీజేపీ కేంద్ర నాయకత్వం నిర్ణయించింది. ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు కావడం, కొందరు మంత్రులపై అవినీతి ఆరోపణలు రావడం, మరికొందరు మంత్రుల పనితీరు బాగా లేకపోవడం వల్ల మంత్రివర్గాన్ని విస్తరించాలని యోగి ఆదిత్యానాధ్ భావిస్తున్నారు. ఇదే విషయాన్ని కేంద్ర నాయకత్వానికి చెప్పడంతో సీనియర్ మంత్రులను కూడా తొలగించాలని ఆదేశాలిచ్చినట్లు తెలుస్తోంది. దీంతో పాటు 75 ఏళ్ల వయసు పైబడిన మంత్రులు రాజీనామా చేయాలని కూడా కేంద్ర నాయకత్వం కోరడంతో ఇప్పుడు యోగి ఆదిత్యానాధ్ ఇరకాటంలో పడ్డారు.

వయసు కారణంగానే…

ఇప్పటికే ఉత్తర్ ప్రదేశ్ లో మంత్రులుగా ఉన్న రాజేష్ అగర్వాల్ తో పాటు మరో నలుగురు మంత్రులు అర్చనా పాండే, చేతన్‌ చౌహన్‌, ముకుత్‌ బిహారీ వర్మలు రాజీనామా చేశారు. అయితే రాజేష్ అగర్వాల్ వయసు 75కి పైబడటంతో రాజీనామా చేశారు. అలాగే యూపీ బీజేపీ అధ్యక్షుుడు కూడా వయసు మీరడంతో పదవికి రాజీనామా చేశారు. వయసు కారణంగానే వీరిని తప్పించారన్న వార్తలు విన్పిస్తున్నాయి. దీంతో యోగి ఆదిత్యానాధ్ మరోసారి మంత్రివర్గాన్ని విస్తరించాల్సి వచ్చింది. బుధవారం 18 మందితో మంత్రివర్గాన్ని విస్తరించారు. దీంతో యోగి కూడా సొంత పార్టీ నుంచి అసంతృప్తిని ఎదుర్కొనే అవకాశాలున్నాయి.

 

Tags:    

Similar News