ఎల్లో మీడియా వెర్సెస్ బ్లూ మీడియా …?

ప్రజాస్వామ్యం లో కీలకమైన నాలుగు స్తంభాల్లో మీడియా ఒకటి. అయితే స్వతంత్రం సిద్ధించిన నాటినుంచి దేశంలోని మీడియా రంగాన్ని భ్రష్టుపట్టించాయి అన్ని పార్టీలు. ప్రస్తుతం మీడియా అంటే [more]

Update: 2020-06-28 11:00 GMT

ప్రజాస్వామ్యం లో కీలకమైన నాలుగు స్తంభాల్లో మీడియా ఒకటి. అయితే స్వతంత్రం సిద్ధించిన నాటినుంచి దేశంలోని మీడియా రంగాన్ని భ్రష్టుపట్టించాయి అన్ని పార్టీలు. ప్రస్తుతం మీడియా అంటే ఏ పార్టీ మీడియా అనే పరిస్థితి దాపురించింది. మీడియా లోకి కార్పొరేట్ సంస్థలు వాటి వెనుక రాజకీయ పార్టీలు ప్రవేశించి మొత్తం నాశనం చేసేసాయి. దాంతో ఇప్పుడు ఎవరైనా మీడియా పేరు చెబితే ఏ పార్టీ మీడియా అని ప్రజలు ప్రశ్నించే స్థాయికి వ్యవస్థ దిగజారింది.

సోషల్ మీడియా ను దిగజార్చేశారు …

స్వతంత్ర మీడియా దేశంలో ఏమి లేవని భావించిన ప్రజలు సోషల్ మీడియా ను కూడా నమ్ముకోవడానికి ఇప్పుడు పరిస్థితి లేదు. ఇక్కడా కార్పొరేట్ లు రాజకీయ పార్టీలు పాగా వేసేసాయి. స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎల్లో మీడియా అనేది ఆవిష్కృతం అయ్యింది. ఆ తరువాత ఆయన తదనంతరం జగన్ విపక్ష నేతగా ఎల్లో మీడియా అంటూ పచ్చ మీడియా అంటూ తెలుగుదేశం అనుకూల మీడియా లపై నేరుగా ధ్వజమెత్తడమే కాదు తన సొంత పత్రిక, ఛానెల్ లో బాగా ప్రచారం నిర్వహించారు. ఆ ఎఫెక్ట్ ప్రజలపై చాలా బాగా పడింది. పత్రికలు, ఛానెల్స్ లో వచ్చిన వార్తలను ఏ పార్టీ అనుకూలంలో ఏమి వచ్చాయో ప్రజలు బేరీజు వేసుకునే చైతన్యం పెరిగింది.

ఈ రెండిటిని జనం నమ్మడం లేదు …

అడ్డగోలుగా ఏ పార్టీ మీడియా లో ఏమి వచ్చినా దాన్ని నమ్మే పరిస్థితి లేదు. ఎల్లో మీడియా పేరు ఇలా పాపులర్ కావడంతో ఈ ప్రచారాన్ని ఎదుర్కోవడానికి ఇప్పుడు వైసిపి మీడియా కు బ్లూ మీడియా అని నామకరణం చేసేసింది టిడిపి మీడియా. తమకు పేరు పెట్టాక తామెందుకు ఉరుకోవాలని ఈ తరహా ప్రచారానికి టిడిపి మీడియా మొదలు పెట్టింది. ఇప్పుడు ఈ రెండు మీడియా లు సై అంటే సై అంటున్నాయి. అటు సంప్రదాయ మీడియా తో పాటు సోషల్ మీడియా లోను ఎల్లో, బ్లూ మీడియా లు తలపడుతున్నాయి. ఈ రెండు మీడియా ల లో వచ్చే గాసిప్ వార్తలతో మాత్రం జనం తీవ్ర అయోమయానికి గురౌతున్నాయి.

Tags:    

Similar News